
Pregnant Easy Delivery Asanas
Easy Delivery Yoga Asanas : ప్రస్తుత జీవన విధానానికి అలవాటు పడిన వారు చాలా వరకు శరీర ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టలేకపోతున్నారు. దీనికి తోడు శారీరక శ్రమ లేనందున పొట్టతో పాటు బరువు సైతం పెరిగిపోతున్నారటే అతిశయోక్తికాదు. ఇలా పెరిగాక కొవ్వును కరిగించుకోవాలని జిమ్‌లో కసరస్తులు, యోగాసనాలు చేస్తున్నారు. మనిషి ఫిట్‌గా ఉండాలని అంటే ప్రతి రోజూ యోగాను తమ డైలీ లైఫ్‌లో భాగంగా చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. యోగాచేయడం ద్వారా బాడీకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనం తీసుకున్న ఫుట్ పూర్తిగా జీర్ణం కాకపోవడంతో ఉబ్బసం, తేన్పులు తీస్తూ బాధపడుతుంటాం. ఇలా బాధపడేవారికి ఉపయోగపడే ఆసనం ఒకటుంది. అదే వజ్రాసనం. బాడీని బలంగా చేసి తీసుకున్న ఫుడ్‌ను ఫాస్ట్‌గా జీర్ణయం అయ్యేలా చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి, దీని వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం..
బాడీకి కాన్సన్‌ట్రేట్.. ధ్యానం ఎలా చేయాలంటే :
బాడీకి కాన్సన్‌ట్రేట్.. ధ్యానం కోసం ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. బాడీని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచేందుకు ఇది సహాయపడుతుంది. ప్రతి రోజూ ఈ ఆసనాన్ని చేయడం వల్ల బాడీ స్ట్రాంగ్‌గా, ఫిట్‌గా మారుతుంది. సంస్కృతంలో వజ్ర అంటే స్ట్రాంగ్ అని అర్థము. ఈ ఆసనాన్ని వేసిన వారు స్ట్రాంగ్ గా కనిపిస్తారు. అందుకే దీనికి వజ్రాసనం అని పేరొచ్చింది. చాలా ఆసనాలను ఎప్పడుపడితే అప్పుడు వేయొద్దు. కానీ, వజ్రాసనం విషయానికి వస్తే దీనిని ఎప్పడైనా వేయొచ్చు.
ఈ ఆసనం వేస్తూ ఎన్నో పనులు చేయొచ్చు. అంటే.. పేపర్ చదవడం, టీవీ చూడటం వంటివి చేయొచ్చు. ఈ ఆసనం ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరుకు ఎంతగానో ఉపయోగకరం. ఈ ఆసనం కాళ్లకు, తొడలకు రక్తప్రవాహాన్న అడ్డుకుంటుంది. ఫలితంగా మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని బయటకు పడేస్తుంది. పేగు కదలికను మెరుగుపరుస్తుంది. ఫుడ్ తీసుకున్న తర్వాత చాలా మంది ఎటువంటి ఆసనాలు చేయడానికి ముందుకు రారు. కానీ తిన్నాక ఈ ఆసనం చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య విశ్లేషకులు చెబుతున్నారు.
ముందుగా కూర్చొని కాళ్లు రెండింటిని ముందుకు చాచాలి. అనంతరం ఒక కాలును మరోకాలు మోకాళ్ల దగ్గరకు వంచుతూ వెనక్కు తీసుకోవాలి. పాదాలను పిరుదుల కిందకు తీసుకొచ్చి, మడెమలను ఎడంగా ఉంచి బొటనవేళ్లను తాకేట్టు చేయాలి. అర చేతులను మోకాళ్లకు ఆనేలా చూసుకోవాలి. బాడీ బరువు పిరుదుల మీద సమానంగా పడేట్టు చూడాలి. తల, వెన్నెపూసను నిటారుగా ఉంచుకోవాలి. అనంతరం కండ్లు మూసి నెమ్మదిగా గాలిని పీల్చాలి. కాసేపైన తర్వాత యథాస్థితికి రావాలి. కాస్త ఇబ్బందిగా అనిపించిందంటే.. మొదట ఒక పాదంపై కూర్చునేలా ప్రాక్టిస్ చేస్తే సరిపోతుంది. అలా చేశాక రెండు పాదాలపై కూర్చునేలా ప్రాక్టిస్ చేయాలి.
ధ్యాస.. మీ శ్వాస మీదే ఉండాలి :
ఈ ఆసనం చేసేటప్పుడు మన ధ్యాసను శ్వాసమీదనే ఉంచాలి. మోకాలి నొప్పులతో బాధపడేవారు అవి తగ్గేవరకు ఈ ఆసనం చేయకపోవడం మంచింది. ఈ ఆసనం మన బాడీలో అవయవాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ఇందులో భాగంగానే కడుపు, పొత్తికడుపు, పేగులపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. మలబద్దకంతో బాధపడేవారికి సైతం ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది. తిన్నాక ఐదు నుంచి ఇరవై నిమిషాల్లోపు ఈ ఆసనం చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. మోకాళ్లపై కూర్చుంటే వెన్నుముక, కాళ్లను కొద్దిగా సాగదీసేందుకు ఉపయోగపడుతుంది. దీని వల్ల కీళ్లు, కండరాలు విశ్రాంతి చెందడంతో ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఇంకా సమర్థవంతంగా పని చేయాలంటే మోకాళ్లపై కూర్చొని బలంగా శ్వాస తీసుకోవాలి. దీని వల్ల మజిల్స్ రిలాక్సవడాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని స్ట్రెస్ తగ్గిస్తుంది. ఈ ఆసనంలో కొద్దిసేపు కూర్చన్నట్టయితే కాస్త ఉపశమనం పొందిన భావన కలుగుతుంది. పలు రకాల వ్యాధులు సైతం దీని వల్ల ఈజీగా తగ్గుతాయి. జాయింట్ పెయిన్స్, ఆర్థ్ర రైటిస్ వంటి రోగాలను ఈ ఆసనం నివారించేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తే రిజల్ట్ బాగుంటుంది. ప్రసవం ఈజీగా కావాడానికి గర్భిణులకు ఈ ఆసనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పీరియడ్స్ నొప్పుల నివారణకు వజ్రాసనం :
మహిళలలో పీరియడ్ నొప్పులు తగ్గించేందుకు సైతం వజ్రాసనం సహాయపడుతుంది. ధ్యానం చేసే వారికి ఆ ఆసనం ఉపయుక్తం. ఈ ఆసనంలో వ్యాయామం చేస్తే మనుసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఆసనం వల్ల బాడీలోని కొవ్వుతో పాటు బరువును సైతం క్రమక్రమంగా తగ్గిస్తుంది. పైన చెప్పిన విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు డాక్టర్లను సంప్రదించిన తర్వాతే ఆసనాన్ని కొనసాగించడం ఉత్తమం.
ఆసనాలు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
ఆసనాలను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి గర్భం దాల్చిన మహిళలు ఆసనాలపై అవగాహన పెంచుకోవాలి. యోగసానాలపై ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోవడం చాలా మంచిది. అది గర్భిణీ ఆరోగ్యంతో పాటు కడుపులో పెరిగే బిడ్డకు కూడా చాలా మంచిది. ఆసనాలను అతిగా వేయడం లేనిపోని అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఏయే ఆసనాలను ఎలా వేయాలో అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఆ తర్వాతే యోగససాలను వేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో మీ ఆరోగ్య పరిస్థితులను కూడా అంచనా వేసుకోవాలి. ఆసనాలను వేసుకునేందుకు ఈ శరీరం సహకరించే స్థితిలో ఉందా? లేదా అనేది నిర్ధారించుకోవాలి. శారీరక శ్రమ అవసరమే కానీ, అతిగా శ్రమించడం కూడా అనారోగ్యానికి దారితీస్తుందని మరవద్దు. మహిళల్లో సాధారణంగా తలెత్తే అనేక అనారోగ్య సమస్యలను కూడా యోగసనాలతో తగ్గించుకోవచ్చు. కానీ, గర్భిణీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచరించాల్సి ఉంటుంది. తెలిసి తెలియక టీవీలు, వీడియోలు చూసి చేయకపోవడమే ఉత్తమం. డెలివరీకి సమయం దగ్గరపడే సమయంలో కూడా నిపుణుల సలహాలతో యోగసాలను వేయొచ్చు. అది కూడా ప్రత్యేకమైన భంగిమల్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. మోకాళ్లను ముందుకు వంచడం, మోకాళ్లపై కూర్చోవడం వంటివి చేయవచ్చు.
కానీ, పొట్టపై శరీరం బరువు పడకుండా చూసుకోవాలి. ఆసనాలను వేయమన్నారు కదా అని ఎలా పడితే అలా వేయడం మానుకోవాలి. సాధారణ మహిళలు అయితే పర్వాలేదు. కానీ, గర్భిణీల ఆరోగ్యంతో పాటు వారి మానసిక ఆరోగ్యంగా ఉండాలి. గర్భిణుల మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే యోగసానాలను వేయవచ్చు. కొంతమంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం కూడా చేయొచ్చు. ధ్యానం చేసే అలవాటు ఉన్నవారిలో వారి మనస్సు కూాడా ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంటుంది. ఆరోగ్యకరమైన పోషకహారాన్ని తీసుకుంటూనే మరోవైపు గర్భం దాల్చిన సమయంలో ఎదురయ్యే శారీరక అనారోగ్య సమస్యలను నివారించుకునేందుకు తప్పనిసరిగా ఈ యోగససానాలను ప్రయత్నించాలి. అప్పుడు ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ ప్రసవం అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. తద్వారా ప్రసవ వేదనను తగ్గించుకోవచ్చు. కండరాలు కూడా సులభంగా రిలాక్స్ అవుతాయి. పుట్టే బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పుట్టేందుకు వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Pomegranate Benefits : దానిమ్మతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్… ఇక అస్సలు దానిమ్మను వదలరు..
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.