Renu Desai : సోషల్ మీడియాలో అకీరా నందన్ (Akira Nandan) ఫొటోలను పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆమె పోస్టు చేసిన చాలా ఫొటోలు, వీడియోల్లో అకీరా మొఖం కనిపించదు. అకీరా పుట్టిన రోజున కూడా రేణు షేర్ చేసిన అకీరా వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో అకీరా కనిపించకపోవడంపై పవన్ ఫ్యాన్స్ (Pawan Fans) కామెంట్స్ చేశారు. దాంతో రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అకీరా విషయంలో పవన్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్‌పై రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు.
ఏప్రిల్ 8న అకీరా పుట్టినరోజు.. (Akira Birthday) ఈ సందర్భంగా పవన్ అభిమాని (Pawan Fan) ఒకరు.. అకీరా గురించి ఒక విషయాన్ని ఇలా అడిగారు.. మా అన్న కొడుకు అకీరా ను సరిగా చూపించండి.. ఇలా దాచిపెట్టకండి అంటూ కామెంట్ చేశాడు. ఆ మాటలకు రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. మీ అన్న కొడుకు.. అకీరా నా కొడుకు.. ఒక తల్లికి పుట్టలేదా? మీరు.. అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
పవన్ కు మీరు ఫ్యాన్స్ కావొచ్చు.. నేను అర్థం చేసుకోగలను.. ముందుగా ఆడవాళ్లతో పద్ధతిగా ఎలా మాట్లాడాలో నేర్చుకోండి.. నెగటివ్ కామెంట్లు పెట్టేవారిని పట్టించుకోవడం మానేశాను.. ఎంతో ఓర్పుతో సహనంగా ఉంటున్నాను. కానీ, మీరు మీ హద్దులను మితిమీరుతున్నారంటూ రేణు దేశాయ్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.
రేణ్ దేశాయ్ కామెంట్లపై పవన్ ఫ్యాన్స్ మాత్రం కూల్‌గా రియాక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరి అబ్బాయివి అని అడిగితే అందరూ తండ్రి పేరే చెబుతారు. పవన్ ఫ్యాన్స్ మీద ఇలా ఫైర్ కాకండి’ అంటూ రిప్లయ్ చేశారు. దానిపై రేణు స్పందిస్తూ.. ‘మీరు స్త్రీ జాతిని అవమానిస్తున్నారు. దేవుడి కన్నా గొప్ప స్థానం తల్లిదే.. మీకు తెలియకపోతే మీ అమ్మను అడగండి’ రిప్లయ్ ఇచ్చారు. అకీరా బర్త్‌డే (Renu Desai Instagram) రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో నెగెటివ్ కామెంట్స్ పెడుతూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు.
11 ఏళ్ల నుంచి నేను భరిస్తూనే ఉన్నాను. కానీ, తల్లిగా ఎప్పుడూ బాధపడుతునే ఉన్నాను. మీ సమస్య ఏంటి? అనేది నాకు అర్థం కావటం లేదని రేణు ఎమోషనల్ అయ్యారు. అకీరా నందన్‌కి 19 ఏళ్లు పూర్తి కావడంతో పవన్ వారసుడిగా సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Read Also : Chicken Haleem Recipe : హైదరాబాద్ చికెన్ హలీమ్.. ఇంట్లోనే ఇలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు తెలుసా?
Anjeer : డ్రై ఫ్రూట్స్‌లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.