Star Anise Health Benefits : ఈ అనాస పువ్వుతో అద్భుత ప్రయోజనాలెన్నో ఉన్నాయి. అన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చు.. ఇంట్లోని పొపుల డబ్బాలో ఉండే మసాలా దినుసులు కేవలం నాన్ వెజ్ వంటాకాల్లో ఉపయోగించే వస్తువు కాదు.. ఇంటి వైద్యం కోసం కూడా ఉపయోగపడుతుందట.. చాలా వరకు మసాల దినుసులను వంటల్లో ఉపయోగిస్తున్నారు. కానీ ఒక్కసారి హోమియో, ఆయుర్వేద వైద్య కేంద్రాలకు వెళితే వీటి వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.
వంటింట్లో దొరికే ప్రతీ ఐటం ఒక్కో మెడిసిన్ లాగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. జ్వరం,తలనొప్పి, దగ్గు, జలుబు, పడిసం, ఒళ్లునొప్పులు ఇలా అన్ని అనారోగ్య సమస్యలకు ఇంట్లోని ఐటమ్స్ ఎలా వాడాలో తెలుసుకుంటే చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా అనాస పువ్వు.. ఈ పేరు చెప్పగానే మంచి సుగంధబరితమైన వాసన వస్తుంది కదూ.. ఇవి రుచితో పాటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చూడడానికి స్టార్ రూపంలో ఉండి ఆకర్షిస్తుంటాయి. అయితే, అనాస పువ్వు వలన కలిగే లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధకతను పెంచుతుంది :
ఆయుర్వేద వైద్యులు ఏం చెబుతున్నారంటే అనాస పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయట.. ఇవి ఇమ్యూనిటీ పవర్ (రోగ నిరోధక శక్తిని) పెంచుతాయని చెబుతున్నారు. అదేవిధంగా బాడీలోని ఫ్రీరాడికల్స్‌తో ఫైట్ చేస్తాయి. ఈ పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్ నిరోధకం,సెప్టిక్ తగ్గించే గుణాలు చాలా ఉన్నాయి. వివిధ సీజన్లో వచ్చే బ్యాక్టీరియా, వైరస్ మన దరి చేరకుండా చేస్తాయి. ఆస్తమా వంటి వ్యాధులకు కూడా అనాస మంచి మెడిసిన్. శ్వాసకోశ ఇబ్బందులను కూడా దూరం చేస్తుంది.

అనాస ఫ్లవర్స్ సుగంధ వాసన పరిమాళాలను వెదజల్లుతుంటాయి. ఈ పువ్వుల్లో విటమిన్లు (C, E, A) ఉంటాయి. శరీరంలో ఎలాంటి నొప్పులు ఉన్నా వెంటనే తగ్గించే అద్భుతమైన మందు లాగా ఉపయోగపడుతుంది. దీనిని వాడటం వల్ల బాడీలోని నాడులు ప్రశాంతంగా పనిచేస్తాయి. మంచి నిద్రను ఆస్వాదించవచ్చు. ప్రతీ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్‌లో ఈ పువ్వు వేసి మరిగించాక.. ఆ కషాయాన్ని పడుకునే ముందు తాగితే హాయిగా నిద్ర పోతారు.
సంతానోత్పత్తికి మంచి వంటింటి ఔషధం :
ఇకపోతే చాలా మందికి అసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఇది చక్కటి మెడిసిన్. దీనిని రోజు కొద్దికొద్దిగా తింటుంటే ఆహారం మంచిగా అరుగుతుంది. నోరు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. అనాస పువ్వులను పొడి చేసి రోజూ తీసుకుంటే ఆగ, మగవారిలో హార్మోన్ ప్రాబ్లమ్స్ దరిచేరవు. సంతానోత్పత్తికి ఇది మంచి వంటింటి ఔషధం.
అనాస పువ్వు ఎసెన్షియల్ ఆయిల్ కూడా మార్కెట్లో లభ్యం అవుతుంది. దీనిని మొహానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు, కురుపులు తగ్గుతాయి. ఈ ఆయిల్‌ను జుట్టు మొదళ్లకు పట్టిస్తే బలంగా తయారవడమే కాకుండా, హెయిర్ ఫాల్ ఆగిపోయి ఒత్తుగా తయారవుతుంది. అంతేకాకుండా దీనిని కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపులు ఉన్నవారు రోజూ రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Read Also : Fingernails Health : చేతి గోళ్ల రంగుతో వ్యాధులను ఇట్టే గుర్తు పట్టేయచ్చు.. ఇలా తెలుసుకోండి