Spiritual

Puri Jagannath Rath Yatra 2023 : ఈ శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే చాలు.. విపరీతమైన ధనాకర్షణ, పూరీ జగన్నాథుడి రథయాత్ర చూసినంత పుణ్యం..!

Advertisement

Puri Jagannath Rath Yatra 2023 :  ప్రసిద్ధ ఫుణ్యక్షేత్రమైన పూరీక్షేత్రంలో జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జగన్నాథుడి రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్ధాన్ని మనం పరిశీలించినట్లయితే.. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే.. అంటుంది శాస్త్రం.. అంటే జీవితంలో ఒక్కసారి అయినా సరే పూరీక్షేత్రంలో జగన్నాథుడే రథయాత్రను దర్శించుకోవాలి. అలాంటి వాళ్లకి పునర్జన్మ అనేది ఉండదని మోక్ష ప్రాప్తి కలుగుతుందని మనకి ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. అలాగే, జగన్నాథుడి వైభవాన్ని పరిశీలించినట్లయితే ఈ పూరీ క్షేత్రాన్ని ఇంద్రజనుడు అనే మహారాజు చక్కగా పరిపాలిస్తూ అక్కడ విగ్రహాలను ప్రతిష్టింప చేశాడని స్థలపురాణం తెలియజేస్తుంది. దానికి సంబంధించిన కథను చూస్తే.. ఒకానొక సమయంలో ఇంద్రజనుడు అనే పేరు కలిగిన మహారాజుకి శ్రీమహావిష్ణువు కలలో కనిపించి సముద్రంలో ఒక వేప మాను తేలుతూ ఉంటుందని దానితో విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో ప్రతిష్టించమని కలలో చెప్తాడు. నిద్రలేచిన తర్వాత ఆ మహారాజు వెళ్లి చూస్తే.. సముద్రంలో ఆ వేప మాను కనిపిస్తుంది.

వెంటనే, ఆ వేప మాను తీసుకొని వచ్చి విగ్రహాలు తయారు చేయాలని భావిస్తున్న తరుణంలో శ్రీమహావిష్ణువు ఒక వృద్ధ శిల్పి రూపంలో ఇంద్రజ్యమున మహారాజు దగ్గరకు వస్తాడు. ఆ విగ్రహాలు తానే చెక్కుతానని, అయితే 21 రోజులపాటు తనకు ఏకాంతం కావాలని తన విగ్రహాలు తయారు చేసే గదిలోకి ఎవరూ ప్రవేశించరాదని చెప్పాడు. రాజు అందుకు సరేనంటాడు. వృద్ధ శిల్పి రూపంలో ఉన్నటువంటి శ్రీమహావిష్ణువు విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాడు. అయితే, వీళ్ళకి ఆకలి కలుగుతుందేమో అన్న భావనలో మహారాణి అనుకోకుండా ఒక రోజు తలుపులు తెరిచి చూస్తుంది. వృద్ధ శిల్పి రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ మూర్తి అదృశ్యం అవుతాడు. అసంపూర్తిగా చెక్కబడినటువంటి విగ్రహాలు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. సుభద్ర బలబద్రుడు జగన్నాధుడు ఈ ముగ్గురి విగ్రహాలు కూడా అసంపూర్తిగా చెక్కబడి ఉంటాయి.

Puri Jagannath Rath Yatra 2023 : మీ ఇంట్లో దీపం పెట్టి.. ధనాకర్షణ శ్రీకృష్ణ మంత్రం చదివితే..

అసంపూర్ణంగా ఉన్న ఆ విగ్రహాలని ఇంద్రజ్యమున మహారాజు దేవాలయంలో ప్రతిష్టించాడని మనకు స్థల పురాణం చెప్పడం జరిగింది. అలాగే, ఈ పూరీ క్షేత్ర వైభవాన్ని మనం పరిశీలిస్తే.. శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సముద్రంలో ఈ వేపమానులాగా మారాడని, ఆ విధంగా పూరీక్షేత్రంలో విగ్రహాలు తయారు చేశారని కూడా స్థల పురాణాల్లో చెప్పడం జరిగింది. పూరీ జగన్నాథ రథయాత్రలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే.. ఈ రథయాత్రలో ఎక్కడా కూడా పూజారులు ఉండరు. దళితపతులు అని పిలిచే సభ్యులు ఈ రథయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. అలాగే జగన్నాథుడు అందరికీ చేరువైనటువంటి భగవంతుడు అని చెప్పటానికి సంకేతంగా జగన్నాథుడి ప్రీతి కోసం ఆకుకూరలు, కూరగాయలతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అలాంటి నైవేద్యాన్ని స్వీకరించడం ద్వారా జగన్నాథుడు అందరిని కూడా అనుగ్రహిస్తాడు. అలాగే పూరీ క్షేత్రంలో ఈ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు బలభద్రుడు, సుభద్ర ముగ్గురు కూడా వేరువేరు రథాలలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు.

Jagannath Puri Rath Yatra 2023 Live Updates

పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా.. రథయాత్రను దర్శనం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే పూరీ క్షేత్రానికి వెళ్లి ఆ రథయాత్రలో పాల్గొనడం వీలుకాని వాళ్ళు ఎవరైనా సరే గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి మంత్ర శాస్త్రంలో చెప్పబడిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21సార్లు చదువుకుంటే చాలు.. జగన్నాథుడి పూరీక్షేత్రానికి వెళ్లి రథయాత్రను దర్శించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. “ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః” ఇది మంత్రం దీన్ని ధనాకర్షణ శ్రీకృష్ణ మంత్రం అంటారు. పూరీక్షేత్రంలో జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా జగన్నాధుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మక ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ధన ఆగమనం పెరగటానికి ఇంట్లో ఈ మంత్రాన్ని చదువుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతి కోసం వెన్న నైవేద్యం సమర్పించండి.

ఇలా చేస్తే కృష్ణుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవచ్చు. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు. అప్పుల సమస్యలు అధిగమించవచ్చు. కాబట్టి, జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి మంత్ర శాస్త్రంలో చెప్పిన ఏ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం.. “ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః” దీన్ని ధనాకర్షణ శ్రీకృష్ణ మంత్రం అంటారు. పూరీ క్షేత్రంలో జగన్నాధుడికి ఎంతో ప్రీతిపాత్రమైన విధంగా రథయాత్ర జరిగే రోజు కాబట్టి కృష్ణుడికి సంబంధించిన ఈ ధనాకర్షణ మంత్రం చదువుకోండి. ధన పరంగా విశేషమైన ప్రయోజనాలు పొందండి.

Read Also : Varahi Ashtothram : శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి.. ఈ 108 నామాలను ప్రతిరోజూ పఠించారంటే ఏది కోరుకున్న ఇట్టే తీరుపోతుంది..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago