Masa Shivaratri in Telugu
Masa Shivaratri 2023 : ప్రతిమాసంలో మాసశివరాత్రి రోజున శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఏకకాలంలో పొందడానికి ఆ రోజు ప్రదోషకాలంలో పరమేశ్వరుడు కైలాసంలో ఆనందతాండవం చేస్తూ ఉంటాడు. అయితే, మాస శివరాత్రి రోజు ప్రదోషకాలలో ఆనందతాండవం, కైలాసంలో చేసే పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలతో శివార్చన చేయాలి. ఈ మాసంలో మాస శివరాత్రి రోజున శివార్చన చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రులు కావచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పరమేశ్వరుడి అనుగ్రహం ఏకకాలంలో లభించాలంటే పరమేశ్వరుడికి సంబంధించి ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు ఆ శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ ఆ రోజున సాయంకాలం పూట ప్రదోషకాలంలో అభిషేకం చేయాలి. ఆ శక్తివంతమైన మంత్రం . “శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ నమః “ఇది మంత్రం ఆగమశాస్త్రం పరమేశ్వరుని ఐశ్వర్య ఈశ్వరుడుగా వర్ణించింది.
ఈశ్వరుడు ఇవ్వాలి.. ఇల్లు నిండాలి అన్నట్లుగా పరమేశ్వరుడు ఐశ్వర్య ఈశ్వరుడు కాబట్టి.. ఈ ఐశ్వర్య ఈశ్వరుడికి సంబంధించిన మంత్ర జపం చేస్తూ సాయంకాలం 5:15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో శివాభిషేకం చేస్తే.. దానివల్ల ధనపరమైన సమస్యలని తొలగిపోతాయి. ప్రత్యేకంగా సాయంకాలం ఈరోజు అభిషేకం చేసేటప్పుడు ఆవుపాలతో అభిషేకం చేయటం కొబ్బరినీళ్ళతో అభిషేకం చేయటం, రుద్రాక్ష జలంతో అభిషేకం చేయటం, బిల్వ దళాలు కలిపిన జలంతో అభిషేకం చేయడం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే, ఈ రోజు సాయంకాలం పూట ప్రదోషకాలంలో ఈ మంత్రం చదువుతూ అభిషేకం చేసిన తర్వాత గంధం రాసిన మారేడు దళాలు పరమేశ్వరుడికి సమర్పించండి గంధం రాసిన మారేడు దళాలు సమర్పించేటప్పుడు కూడా ఈ ఐశ్వర్య ఈశ్వర మంత్రాన్ని చదువుకోవాలి.
అభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. గంధం రాసిన మారేడు దళాలు సమర్పించేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులని తొలగిపోతాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అనేక మార్గాలు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అలాగే, ఈరోజు శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి. అలా వెలిగిస్తే దాంపత్య జీవితంలో ఏర్పడే విభేదాభిప్రాయాలని తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెంచుకోవచ్చు. నమ్మక చమకాలు మొత్తం చదువుతూ శివాభిషేకం చేయలేని వాళ్ళు ఈ ఒక్క ఐశ్వర్య స్వర శివ మంత్రం చదువుతూ శుక్రవారంతో కలిసి వచ్చిన మాస శివరాత్రి సందర్భంగా శివాభిషేకం చేసుకోండి. శివుడు పరమానంద భక్తుడై ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగింపజేస్తాడు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఆ అనారోగ్య సమస్యలు పోవాలంటే బాలాంబికేశ వైద్యశా భవరోగ్య అనే 3 నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో శివాభిషేకం చేసుకోండి.
అలాగే, జాతకంలో కాలసర్ప దోషాలు ఉన్నవాళ్లు నాగదోషాలు ఉన్నవాళ్లు కుజ షాలు ఉన్నవాళ్లు పితృ దోషాలు ఉన్నవాళ్లు, ఈ దోషాలు ఏవి జాతకంలో ఉన్న ఆ దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాత్రం బొప్పాయి పండ్ల రసంతో ఈరోజు ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకోండి. అలాగే, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవాళ్లు మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్లు ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం వెన్నతో శివాభిషేకం చేసుకోండి. దాని వల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే, శత్రుభాధలు ఎక్కువగా ఉన్నవాళ్లు కనుదిష్టి ఎక్కువగా ఉన్నవాళ్లు ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేసుకోండి. ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేసుకోండి. ఇలా మీ సమస్యను బట్టి శివాభిషేకం చేసుకుంటూ ఈ ఐశ్వర్య ఈశ్వర శివ మంత్రాన్ని చదువుకుంటే శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఏదైనా తీవ్రమైన కష్టం ఎదుర్కొంటున్న వాళ్లు ఆ కష్టం నుంచి బయటపటానికి ప్రదోషకాలంలో 108 ప్రదక్షిణలు శివాలయంలో చేయండి.
అలా చేస్తే, మీరు ఎదుర్కంటున్నటువంటి కష్టానికి ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన విధివిధానాలు పాటించండి. అలాగే ఈరోజు పుష్పాలతో శివ పూజ చేసే వాళ్ళు అంటే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఈశ్వరుడి చిత్రపటానికి పూజ చేసే వాళ్ళు పద్మ పుష్పాలతో గాని గులాబీ పూలతో గాని శివ పూజ చేయండి. పద్మ పుష్పాలు లేదా గులాబీ పూలతో శివ పూజ చేస్తే శివుడు తొందరగా ప్రసన్నడు అవుతాడు. లక్ష్మీదేవి అనుగ్రహం, పరమేశ్వరుడి అనుగ్రహం ఏకకాలంలో పొందటానికి ఈ పుష్పార్చన విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు ఎవరైనా సరే మారేడు దళం మీద దీపారాధన కుందిని ఉంచి అందులో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి శివుడి దగ్గర దీపాన్ని వెలిగించండి. అలా చేస్తే శివుడి అనుగ్రహానికి తొందరగా పాత్రులు కావచ్చు. శుక్రవారంతో కూడిన మాస శివరాత్రి కలిసి వచ్చినప్పుడు పరమేశ్వరుడికి పెరుగన్న నైవేద్యం సమర్పించండి. అలాగే, ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం కొబ్బరికాయ ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి.
Read Also : Lakshmi Devi : లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు కనిపించే 4 సంకేతాలు ఇవే..!
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.