Cold Relief Tips : చలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. విపరీతంగా ముక్కు కారటం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు గరగర అనడం వంటివి ఊపిరాడనివ్వవు. వీటి వలన రోజువారీలాగా మన మెదడు యాక్టివ్ నెస్ కోల్పోతుంది. చిరాకు వస్తుంది.
కొంచెం చల్లగాలి తగిలితే చాలు ఇక తుమ్ములే తుమ్ములు.. జలుబు దెబ్బకు మన పక్కన కూర్చునే వారు భయంతో పరుగులు తీస్తుంటారు. పైగా దేశంలో ఇంకా కరోనా వేవ్ ఇంకా పూర్తిగా సర్దుమనగ లేదు. అక్కడక్కడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అందుకే చలి కాలంలో చాలా జగ్రత్తాగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబుకు ఇంట్లోనే వైద్యం చేసుకోవాలని కూడా కొందరు చెబుతున్నారు.
అయితే, ఈ ఐదు ఆరోగ్య సూచనలు పాటిస్తే జలుబును కంట్రోల్ చేసుకోవచ్చట.. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. చిన్న పిల్లల నుంచి పెద్దవారు సైతం ఇంట్లో, బయటకు వెళ్లివచ్చినప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. చేతుల్లో మనకు కనిపించని ఎన్నో క్రిములు దాగియుంటాయి.
దీంతో అనారోగ్యం బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. రెండోది చలికాలంలో మనకు ఎక్కువగా దాహం అనిపించదు.అయినా, రోజువారీగా మన శరీరాన్ని హైడ్రేడెట్ గా ఉంచాలి. సమయం దొరికినప్పుడల్లా నీరు తాగాలి. బాడీ డీ హైడ్రేట్ అవుతే అనారోగ్య సమస్యలు దరిచేరే ప్రమాదం ఉంటుందట.. నీరు ఎక్కువగా తాగితే శరీరంలోని మలినాలను, టాక్సిన్లను శుభ్రం చేసి బయటకు పంపించివేస్తుంది.
జలుబు రుగ్మతలను నివారించాలంటే :
మూడో విషయం ఏంటంటే తీసుకునే ఆహారం విషయంలో చాలా కేరింగ్ గా ఉండాలి. ఆరోగ్యకరమైన, తాజా ఆహారం తీసుకోవాలి. ఫిట్‌గా ఉండేందుకు మంచి ఆహారం అవసరం.. జింక్, విటమిన్ -D ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా ఉత్తమం.. నాలుగోది నిద్ర.. జలుబు వంటి వ్యాధులు త్వరగా తగ్గాలంటే మనిషి తగినంత నిద్రపోవాలి. అప్పుడే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు దరిచేరినా కోట్లాడుతుంది.
అందుకే సరిపడా నిద్ర మనిషికి తప్పక అవసరం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 7 నుంచి 8 గంటల నిద్రపోవాలి. చివరగా వ్యాయామం అనేది మనిషి తన జీవితంలో చాలా ప్రాధాన్యమివ్వాలి. వాకింగ్, జిమ్, యోగా వంటివి చేయడం వలన శరీరంలోని చెడు కేలరీలు కరిగిపోయి చాలా యాక్టివ్ గా ఉంటారు. బరువు తగ్గుతారు. రక్త ప్రసరణ మెరగవుతుంది. ప్రాణాయామం చేస్తే శ్వాససంబంధిత రోగాలు నయమవుతాయి.
సాధారణంగా శీతాకాలంలో జలుబు లేదా రొంప వంటి అనేక అలర్జీ సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలను రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. నీళ్ల ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కంటినిండా నిద్ర కూడా చాలా అవసరం. సరైన నిద్రలేనివారిలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు కొలస్ట్రాల్ అధిక శాతం పెరగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనారోగ్య రుగ్మతలకు దారితీస్తాయి. రోజు వేడినీళ్లు తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండొచ్చు.
Read Also : Parijat Flower Benefits : ‘పారిజాతం’ పూలా మజాకా.. ఎన్నో ఔషధ గుణాలు.. అన్ని వ్యాధులకు దీనితో చెక్..!
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.