Food Recipes

Poori Aloo Kurma Recipe : బండి మీద దొరికే పూరి-ఆలు కూర్మాను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయొచ్చు.. తింటే మాత్రం టేస్ట్ అదిరిపొద్ది..!

Advertisement

Poori Aloo Kurma Recipe : నోరూరించే పూరికి ఆలూ కూర్మా కాంబినేషన్.. అలాంటి పూరిని ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో చేసుకోవచ్చు. బండి మీద దొరికే పూరికి అంత టేస్ట్ ఎందుకు వస్తుందో తెలుసా? పూరి నూనెలో వేయగానే పెద్దగా పొంగిపోతుంది. చూడగానే ఎవరికైనా నోరూరిపోతుంది. అయితే, వేడివేడి పూరికి ఆలూ కుర్మాకు పూరి కూర కలిపి తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా పూరిని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.  ఉదయం మంచి బ్రేక్ ఫాస్ట్ ఫుడ్‌గా పూరిని తయారుచేసుకోవచ్చుు. అయితే, మీ ఇంట్లోనే పూరిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు.. గోధుమపిండి,  మైదాపిండి,  నూనె, పంచదార,  ఉప్పు..

తయారీ విధానం.. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ గోధుమపిండి తీసుకొని అందులో మూడు స్పూన్ల మైదా పిండి వేసి తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ నూనె వేస్తే సాఫ్ట్ గా వస్తాయి. కొంచెం పంచదార వేసి కలపాలి పూరి, దోశలో అలా చేయడం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. వీటన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కొంచెం మందంగా పూరీలను ఒత్తుకోవాలి.. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రై అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇక,  ఆయిల్ వేడి అయిన తర్వాత పూరీలు వేయాలి. వెంటనే పూరీలు పొంగుతూ వస్తాయి. పూరీలను రెండు వైపులా కాల్చాలి. ఎంతో రుచికరమైన వేడివేడి పూరి రెడీ అయినట్టే.

Potato Kurma : ఆలు కూర్మకు కావలసిన పదార్థాలు..

నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క 1 ఇంచు, పసుపు టీ స్పూన్, ఉప్పు, కారం, నూనె, కరివేపాకు రెండు రెమ్మలు, పచ్చిమిర్చి 3, ఎండు కొబ్బరి, శనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు ఒక టీ స్పూన్, జిలకర ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, క్యారెట్ ఒకటి, పచ్చి బఠాణి అర కప్పు, ఉల్లిపాయ పెద్ద సైజు 1, ఆలు పావు కిలో, టమాట మూడు తీసుకోవాలి.

తయారీ విధానం… ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఎండు కొబ్బెర, దాల్చిన చెక్క నువ్వులు వేసి దోరగా వేయించి మిక్సీ జార్ లో పొడి చేసుకోవాలి ఇప్పుడు అందులో పచ్చి టమాటాలు కట్ చేసి వేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత కళాయిలో ఆరు టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయిన తర్వాత ఆవాలు, జిలకర, శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఆలు ముక్కలు వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.

poori aloo kurma recipe street food specials in telugu

గ్రేవీ కోసం నువ్వులు టమాటా పేస్టును వేసి బాగా కలపాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రుచికి తగినంత కారం ఉప్పు వేసి కలపాలి కూర్మాలో ఆలు క్యారెట్ పచ్చిబఠానీ మెత్తగా ఉడికించాలి. కాబట్టి అందులో ఒక గ్లాస్ నీళ్లు వేసి కూర్మాలో నూనె పైకి తేలేంతవరకు ఉంచి.. అప్పుడు ధనియాల పొడి వేసి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. రుచికరమైన హోటల్ స్టైల్, బండి మీద చేసే ఆలూ కుర్మా రెడీ అయినట్టే.

Bombay curry : పూరి కూర (బొంబాయి చట్నీ)కి కావలసిన పదార్థాలు..
శనగపిండి 2 టేబుల్ స్పూన్, నూనె, ఉప్పు, పసుపు1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు, ఎండుమిర్చి రెండు, పచ్చిమిర్చి 6, ఉల్లిపాయ 1, ఆలుగడ్డ 1/4 కేజీ, పచ్చి బఠాణి1/2 కప్పు, టమాట 2 తీసుకోవాలి.

తయారీ విధానం.. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు కారానికి తగినంత తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు వేగిన తర్వాత పచ్చి బఠాణి, టమాట ముక్కలు వేసి కలపాలి.

ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసి శనగపిండిలో నీళ్లు పోసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. కూర కొంచెం మగ్గిన తర్వాత ఐ ఫ్లేమ్ లో పెట్టి శనగపిండిని వెయ్యాలి. ఉడక పెట్టిన ఆలు ముక్కలు మెత్తగా మ్యాచ్ చేయాలి (ఆప్షనల్) వేసి ఉడికించాలి. కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చెయ్యండి ఎంతో రుచికరమైన బొంబాయి చట్నీ రెడీ..

Read Also : Street Style Pakoda Recipe : బండి మీద కరకరలాడే పకోడీ ఇంట్లోనే చేసుకోవచ్చు తెలుసా? అదే టేస్ట్, క్రిస్పీగా రావాలంటే ఇవి కలపాల్సిందే..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago