Menthi Kura Chicken Gravy in telugu
MenthuKura Chicken Gravy : మీరు ఎప్పుడైనా మేతి చికెన్ తిన్నారా? మేతి చికెన్ గ్రేవీ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చికెన్ గ్రేవీని కొద్దిగా డిఫరెంట్‌గా అద్భుతమైన టేస్ట్ వచ్చేలా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్టైల్‌లో చేసి చూడండి.. చాలా రుచిగా ఉంటుంది. మెంతికూర చికెన్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా.. ఒక అర కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అలాగే ఈ 1/2 కేజీ చికెన్‌లోకి మెంతుకూర ఒక గుప్పెడు తీసుకోండి సరిపోతుంది. మరి ఎక్కువైపోతే కూడా కర్రీ చేదుగా అనిపిస్తుంది. ఇలా తీసుకున్న మెంతుకూరని శుభ్రంగా కడిగి జల్లెడలో వేసి పెట్టండి. ఇప్పుడు బాండిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఒక 2 నిమిషాలు వేయించండి.
మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుతూ బాగా వేయించుకోండి. సుమారుగా నాలుగు ఐదు నిమిషాలు టైం పడుతుంది. బాగా వేగడానికి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి. అవి వేగే లోపల మెంతికూర కూడా బాగా వేగిపోతుంది. మంచి కలర్ వచ్చిందాకా వేయించుకోండి. మెంతికూర వేయించుకుంటే పెద్దగా చేదు ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చిది వేసే కన్నా మెంతుకూరని ఇలా వేయించి పెట్టుకోండి.
దీంట్లోనే పుచ్చ గింజలను ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ గింజలను వేస్తే మేతి చికెన్ కర్రీ చాలా టేస్టీ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే ఒక నాలుగైదు జీడి పప్పులు వేసుకొని వేయించుకోండి. ఈ పుచ్చ గింజలు వేసిన తర్వాత మీడియం సైజు రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగనివ్వండి. ఈ టమాటా ముక్కలు వేయించుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోవాలి. అలా చేస్తే తొందరగా వేగి మెత్తబడతాయి. టమాటా ముక్కలు సాల్ట్ వేయడం వల్ల బాగా వేగిపోయాయి.
ఇలా వేగిన తర్వాత మొత్తం తీసేసి మిక్సీ జార్‌లో వేసుకోండి. మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత కొద్దిగా ఆరనిచ్చేసి మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సుమారుగా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దాల్చిన చెక్క వన్ ఇంచ్, రెండు యాలకులు, మూడు లవంగాలు వేయండి. దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మసాలా దినుసులు లైట్ గా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్‌ని వేసి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి హై ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌ని కలుపుకుంటూ బాగా వేగనివ్వండి. అంటే మనకి చికెన్‌లో నుంచి నీళ్లు ఊరతాయి. ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయేదాకా ఇలా కలుపుతూ వేయించండి.
ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలకి గాట్లు పెట్టి వేయండి. దీంట్లోనే ఒక రెండు రెమ్మలు కరివేపాకును కూడా తుంచుకుని వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్‌కి బాగా పడుతుంది. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇదే విధంగా మరో 2 నిమిషాలు బాగా వేగనివ్వండి. నాలుగైదు నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంతవరకు లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించండి. లేదంటే.. అల్లం వెల్లుల్లి పేస్టు బాండిల్‌కి బాగా అంటుకుపోతుంది. అందుకని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా వేగనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల ఫుల్లుగా కారం వేసుకోవాలి. కారం సరిపోకపోతే చూసుకొని మళ్లీ వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. రెండు వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా కలపండి.
ఈ కారం, ధనియాల పొడి కూడా ముక్కకి బాగా పడుతుంది. ఇలా కలిపేసిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్టు మొత్తాన్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఉంచి మొత్తం ఈ పేస్ట్ బాగా కలిసి పోయేటట్టు కలుపుకోండి. ఇదివరకే ఉల్లిపాయలు టమాట మెంతుకూరని బాగా వేగే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. మీకు గ్రేవీ చూసుకొని నీళ్లు పోసుకోండి. సుమారుగా మొత్తం మీద ఒకటి 1/2 గ్లాస్ దాకా నీళ్లు పోయాలి. నీళ్లు పోసేసి మొత్తం బాగా కలుపుకోవాలి.
ఉప్పు, కారం అన్ని కరెక్ట్‌గా సరిపోయాయా లేదా అని చూసుకోవాలి. సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని కలుపుకోండి. మరి చిక్కగా అనిపిస్తుంది. ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఇలా చూసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోండి. మరీ ఎక్కువ నీళ్లు పోయొద్దు. లేదంటే టేస్ట్ బాగుండదు. చివరిగా ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుని పాన్‌కి మూత పెట్టి లోఫ్లేమ్ పెట్టి ఉడికించండి. లో ఫ్లేమ్‌లో ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడికించాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఒక 15 నిమిషాలలో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిస్తే.. ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీలాగా వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.. మేతీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ.. ఈ కర్రీని రైస్‌తో గాని చపాతీతో కానీ ఎందులో అయినా తింటే చాలా కమ్మగా ఎంతో రుచికరంగా ఉంటుంది.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.