Categories: Food RecipesLatest

Mango Pesara Pappu : మామిడికాయ పచ్చి కొబ్బెరతో పెసరపప్పు రెసిపీ.. ఇలా చేశారంటే మిగల్చకుండా తినేస్తారు.. చాలా టేస్టీగా ఉంటుంది!

Advertisement

Mango Pesara Pappu : మామిడికాయ- పచ్చి కొబ్బెరతో పెసరపప్పు.. ఈ కూర తినే వాళ్ళు వావ్ అనాల్సిందే.. పెసరపప్పుతో మామిడికాయ ఒకసారి చేసి చూడండి ఆహా ఓహో అంటారు. పెసరపప్పు ఒంటికి చాలా చలువ.. పెసరపప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. వేడివేడి అన్నం పెసరపప్పు దీని కాంబినేషన్ గా ఆమ్లెట్ వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం…

కావలసిన పదార్థాలు : పెసరపప్పు-100 grams , పచ్చి కొబ్బెర తురుము – , మామిడికాయ ముక్క ఒక కప్పు , పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు, నూనె, పసుపు టీ స్పూన్, ఉప్పు( రుచికి తగినంత) జిలకర టీ స్పూన్, ఆవాలు టీ స్పూన్, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు,

తయారీ విధానం.. ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి పుల్లటి మామిడికాయ ముక్కలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఆఫ్ గ్లాస్ వాటర్ పోసి తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసి గా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

Mango Pesara Pappu : Mamidikaya Pesarapappu Recipe in telugu

మరోవైపు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని నానబెట్టిన పెసరపప్పు పావు లీటర్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో సగం చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు, కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

మూకుడు పెట్టుకొని ఒక టీ స్పూన్ పల్లీల నూనె, ఒక టీ స్పూన్ నెయ్యి వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిటపట అన్న తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, ఐదు లవంగాలు, ఎండుమిర్చి నాలుగు, పావు టీ స్పూన్ మెంతుపొడి, పావు టీ స్పూన్ ఇంగువ, రెమ్మల కరివేపాకు కొంచెం కస్తూరి మేతి వేసి కలపాలి.

ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేంతవరకు కలపాలి ఉడికించిన మామిడి ముక్కలు, ఉడికించిన పెసరపప్పు వేసి పప్పులోకి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి (పెసరపప్పు తొందరగా చిక్కబడుతుంది) రుచికి తగినంత కారం ఉప్పు ఉడికించాలి కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో రుచికరమైన మామిడికాయ కొబ్బరి పెసరపప్పు రెడీ..

Read Also : Mutton Keema Roast : రెస్టారెంట్ స్టయిల్లో మటన్ కీమా రోస్ట్… మటన్ కీమా వేపుడు.. సూపర్ టేస్టీగా ఉంటుంది.. కొంచెం కూడా మిగల్చరు..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

3 weeks ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

3 weeks ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

4 weeks ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

4 weeks ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

4 weeks ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

4 weeks ago