Gongura Royyalu Curry : రొయ్యల కూర ఎప్పుడైనా తిన్నారా? అయితే రొయ్యలు, గోంగూర కాంబినేషన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్టు మాత్రం అదిరిపోద్ది.. ఆంధ్రా స్టయిల్లో రొయ్యలు, గోంగూరతో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తింటుంటే నోరూరి పోతుందంతే.. వేడివేడి అన్నంలో గోంగూర రొయ్యల కర్రీని కలుపుకునే తింటే చాలు.. అద్భుతంగా ఉంటుంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది. కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం.. నోరూరించే రోయ్యల గోంగూర కర్రీని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు :
రొయ్యలు 1/2 కేజీ, గోంగూర, నూనె, కారం 2 టీ స్పూన్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ , పసుపు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 5, దాచిన చెక్క 1ఇంచు , లవంగాలు 2 , ఉల్లిపాయ 2, కరివేపాకు 1 రెమ్మ, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్
తయారీ విధానం :
రొయ్యలను పొట్టు తీసి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు గోంగూర గుప్పెడు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక బౌల్ తీసుకొని పచ్చిమిర్చి ముక్కలు, గోంగూర అందులో ఒక మీడియం సైజ్ కట్ చేసిన టమాట వేసుకోవాలి. ఆ గ్లాసు వాటర్ పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి మగ్గనివ్వాలి.
మరో స్టవ్ పై మూకుడు పెట్టి రొయ్యలు, ఉప్పు ఒక టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్ వేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించాలి. రొయ్యల్లో నుంచి నీళ్లు వస్తాయి ఆ నీళ్లన్నీ పోయేవరకు ఉడికించాలి స్టవ్ ఆఫ్ చేసి రొయ్యలను పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న వాసన పోతుంది.
గోంగూర, టమాట ఉడికిన తర్వాత పప్పు గుత్తితో పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క, రెండు లవంగాలు, మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి.
హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక రెమ్మ కరివేపాకు, ఇవన్నీ వేగిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు రెండు టీ స్పూన్లు కారం రుచికి తగినంత, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, వీటిని ఒకసారి బాగా కలపాలి ముందుగా ఉడికించిన రొయ్యలను వేసుకోవాలి.
ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని కూర అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఎనిపిన గోంగూర పేస్టు వేసుకోవాలి కూరలో రుచికి తగినంత ఉప్పు, కారం ఒకసారి చూసి సరిపోకపోతే ఇప్పుడు వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు ముప్పావు గ్లాసు నీళ్లు పోసుకోవాలి కూరలో మరీ ఎక్కువగా వాటర్ పోసి ఉడికించకూడదు రొయ్యలు గట్టిగా అవుతాయి.
మధ్య మధ్యలో కలుపుతూ అందులో ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన రొయ్యల గోంగూర రెడీ… ఎప్పుడూ ఒకే విధంగా చేసుకోకుండా ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలి అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
Read Also : Chicken Haleem Recipe : హైదరాబాద్ చికెన్ హలీమ్.. ఇంట్లోనే ఇలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు తెలుసా?
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.