Ayurveda Tea Benefits : ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి తన సంపాదనలో మూడో వంతు ఆస్పత్రి బిల్లులకే ఖర్చు చేస్తున్నాడనంలో అతిశయోక్తి లేదు. అందుకు కారణం మనం రోజు తీసుకునే ఆహారం, కాలుష్యం, కల్తీ ఆయిల్స్, తినే ముందు సమయపాలన పాటించకపోవడం, నిద్రలేమి, జాబ్ టెన్షన్స్ మొదలగునవి అన్ని అనారోగ్యానికి మూల కారకం అవుతున్నాయి. దీంతో వచ్చే సంపాదనలో సగం ఆస్పత్రులకే ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అయితే, మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, ఇంట్లోనే ఆయుర్వేద పద్ధతులను ఫాలో అయితే, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకూ వారు ఏం చెప్పారంటే..
ఆయుర్వేదంలో శరీరాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనే సూత్రాలను వెల్లడించారు. మానవ శరీరం అనేది పంచభూతాలు( ఆకాశం, భూమి, నీరు, అగ్ని, గాలి) వలే ఐదు మూలకాలతో తయారై ఉంటుందన్నారు. మొదటిది అగ్ని. దీని ప్రకారం మానవ శరీరంలో జీర్ణవ్యవస్థ అగ్నిని సూచిస్తుందన్నారు. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణక్రియ అరిగించి, అందులోని పోషకాలు శరీరానికి శక్తిని అందజేస్తాయని తెలిపారు.
బలమైన జీర్ణ వ్యవస్థ అనేది ప్రేగును ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు. ఒకవేళ బలహీనమైన జీర్ణ వ్యవస్థ కలిగిఉంటే ఎల్లప్పుడూ ఆరోగ్యం క్షీణించి శరీరంలో విషతుల్యత పెరిగిపోయి అనారోగ్యానికి దారి తీస్తుందన్నారు. మన జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయాలంటే ఆయుర్వేదాని అనుసరించి తయారుచేసిన టీని రెగ్యూలర్‌గా తీసుకోవాలని చెప్పారు.దీని ద్వారా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని స్పష్టంచేశారు.
ఆహారాన్ని ముందుగా తీసుకునే సమయంలో మంచిగా అరుగుదల కలిగి ఉండాలి. లేదంటే అజీర్ణ సమస్యలు తలెత్తి అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందనేది గుర్తించాలి. ప్రస్తుత రోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి దూరంగా ఉండటం, సమయపాలన లేకుండా తిండి, నిద్ర కారణంగా ఆహారం సరిగా అరగకపోవడంతో కడుపు ఉబ్బరంగా ఉండటం, అజీర్ణం, గ్యాస్ వంటివి తరచు ఇబ్బంది పెడతాయన్నారు. కడుపు ఉబ్బరం అనేది జీర్ణ సంబంధిత సమస్య. అధికంగా గ్యాస్ ఉత్పత్తి కావడం వలన జీర్ణవ్యవస్థలోని కండరాల కదలికలో కొత్త సమస్యలు ఏర్పడతాయి.
పొట్ట ఉబ్బినట్టుగా ఉండటం, కడుపు నొప్పి, కడుపులో మంటగా ఉండటం వంటి సమస్యలు వస్తాయన్నారు. ప్రధానంగా జీర్ణవ్యవస్థ దెబ్బతినడానికి గ్యాప్ ఇవ్వకుండా అతిగా తినడం, ఫాస్ట్‌గా తినడం, ఫ్యాటీ, మసాల ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యకు ఇంగ్లీష్ మందులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ మన ఇంట్లో లభించే వాటితోనే ఈ సమస్యకు చరమగీతం పాడొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పూర్వం సుగంధ ద్రవ్యాలతోనే ఎన్నో మందులు తయారు చేసి ఈ సమస్యకు చెక్ పెట్టారని గుర్తుచేశారు.
ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన టీని మనిషి రోజువారీగా తీసుకుంటే ఎంతో చురుగ్గా ఉంటారన్నారు. అంతేకాకుండా శరీరంలో విషపదార్థాల కౌంట్ తగ్గుతుందన్నారు. ఆయుర్వేద టీ లో ఉపయోగించే మిరియాల పౌడర్ ఆరోగ్యానికి మంచి చేస్తుందన్నారు. ముఖ్యంగా ఈ మూలకం ప్రేగును ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుందట. మనిషి జీవక్రియ సక్రమంగా, వేగంగా పనిచేస్తే అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ బలంగా, ఆరోగ్యంగా కనిపించే ఆస్కారం ఉందన్నారు. వారు సులువుగా బరువు పెరిగే చాన్స్ కూడా ఉందట. ఫిట్‌నెస్ విషయంలో కూడా మంచి రిజల్ట్ ఉంటుందని తెలిపారు. ఇంట్లో రెగ్యులర్‌గా వినియోగించే అల్లం, నల్లఉప్పు, తేనె, మిరియాలు, శొంటి, సోంపు వంటి మూలకాల కలయికతో తయారు చేయబడిన ఆయుర్వేద టీని రోజుతాగితే ఆరోగ్యవంతమైన జీవక్రియకు దోహదపడుతుందన్నారు.
రోగనిరోధక శక్తి పెరుగుదల..
అధిక బరువుతో బాధపడేవారు ఎలా తగ్గాలని చూస్తుంటారు. వ్యాయామం కోసం జిమ్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు తగలేస్తుంటారు. అవన్నీ చేసే బదులు ఈ ఆయుర్వేద టీ ని క్రమం తప్పకుండా తాగితే మంచి శరీరాకృతి ఏర్పడుతుంది. ఇది బాడీలోని కొవ్వును కూడా కరిగిస్తుంది. ఆకలి బాధను నివారిస్తుంది. మనిషి శరీరానికి అవసరమైన విటమిన్ -Cని కూడా అందిస్తుంది. ఈ టీని నిమ్మరసంతో కూడా కలిసి తీసుకోవచ్చును. క్రమం తప్పకుండా తాగిన వారిలో రోగనిరోధక శక్తి కూడా తగిన మోతాదులో ఉంటుంది. బాడీలో ఐరన్ శాతాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.
ఆయుర్వేద టీలో వాడే పదార్థాలు..
మంచి నీరు, తగినంత పెప్పర్ పౌడర్, చిన్న అల్లం ముక్క, ఒకటి లేదా రెండు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల తేనె, రుచిక సరిపడా బ్లాక్ సాల్ట్, 3 లవంగాలు, సోంపు, శొంటి..
ఎలా తయారు చేస్తారంటే :
ముందు స్టవ్ మీద బౌల్ పెట్టుకుని అందులో నీటిని పోయాలి. తర్వాత ఎక్కువ మంట పెట్టి వేడిచేసుకోవాలి. నీరు వేడెక్కాక చిటికెడు మిరియాల పౌడర్, తేనె, మూడు నుంచి నాలుగు లవంగాలు, నల్ల ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో అల్లం తరుమును వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా మరిగించాలి. చివర్లో 15 నిమిషాలు సిమ్‌లో ఉంచి మిశ్రమం చల్లబడ్డాక కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. అనంతరం టీని జాలితో వడపోసి కప్పులలో పోసి సర్వ్ చేసుకోవచ్చు. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ టీని రాత్రి పడుకునే కొద్ది సేపు ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అనారోగ్యం బారిన పడటం తగ్గుతుంది.
ఆయుర్వేద టీ వలన కలిగే లాభాలు :
తరచూ ఈ ఆయుర్వేద టీని తాగితే జీర్ణ సమస్యలే కాకుండా చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. చర్మంపై మచ్చలు, ముడతలు తొలగించడమే కాకుండా కాంతివంతంగా మారుస్తుంది. ముక్కుదిబ్బడతో బాధపడే వారికి ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. సైనస్ దరిచేరకుండా చూస్తుంది. ఇందులో యూజీనాల్ ఉండటం వల్ల ముక్కు సమస్యలు తొలగిపోతాయి. ఈ టీలో వాడే లవంగాల్లో విటమిన్ ఇ, కె లు ఉంటాయి. ఇవి బాక్టీరియాతో నిత్యం పోరాడతాయి. జ్వరం, జలుబు రాకుండా చూస్తాయి.అంతేకాండా దంత సమస్యలు, చిగుళ్లు, పంటి నొప్పిని నివారిస్తాయి. ఈ టీలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉండటంతో జీర్ణక్రియ కూడా సజావుగా ఉంటుంది.
Read Also : Avisa Seeds Health Benefits : అవిసె మొక్క.. ఎన్ని జబ్బులను మాయం చేస్తుందో తెలిస్తే అసలే వదిలిపెట్టరు!
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.