
parama ekadashi 2023 puja vidhanam in telugu
Parama Ekadashi 2023 : ఈ పరమ ఏకాదశి శ్రీమన్నారాయణ మూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన ఏకాదశి మామూలు మాసంలో వచ్చే ఏకాదశి కంటే అధికమాసంలో వచ్చే ఏకాదశి కొన్ని వేల రేట్లు ప్రయోజనాలను కలిగింపజేస్తుంది ఎందుకంటే అధికమాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. శ్రీమన్నారాయణ మూర్తికి ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో చేసే విష్ణు అర్చన మామూలు మాసాల కంటే ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి పరమ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తే మామూలు సమయాల్లో చేసే ఏకాదశి వ్రతం కన్నా ఎక్కువ రెట్లు శుభఫలితాలను కలిగింపజేస్తుంది. ఏకాదశ్యాం నిరాహార భూత్వాహం అపరే హని మోక్షామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకుంటూ పుష్పాంజలి శ్రీమన్నారాయణ మూర్తి చిత్రపటం దగ్గర సమర్పించి ఏకాదశి వ్రతం చేసుకోండి.
ఏకాదశి వర్తమంటే ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనాన్ని సేకరించాలి దీని ఏకాదశి వ్రతం అంటారు. ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా విష్ణుమూర్తికి సంబంధించిన రెండు శక్తివంతమైన మంత్రాలని ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఒక్కొక్క మంత్రం 21సార్లు చదువుకుంటే ఏకాదశి వ్రతం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. ఆ శక్తివంతమైన మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణువే నమః దీని శ్రీధర మంత్రం అంటారు. ఈ శ్రీధర మంత్రం చదువుకుంటే పరమ ఏకాదశి సందర్భంగా ఏకాదశి వర్ధంతి చేసిన ఫలితం కలుగుతుంది.
ఆ తర్వాత రెండో మంత్రం విష్ణు రహస్య మంత్రం ఆ మంత్రం ఏంటంటే హ్రీం విష్ణువే నమః ఇది రెండో మంత్రం కూడా 21 సార్లు ఇంట్లో దీపారాధన చేశాక చదువుకుంటే విష్ణు కృపకు పాతులై ఏకాదశి వ్రతం చేసిన అద్భుత ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈరోజు గృహంలో లక్ష్మీనారాయణ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి వెండి ప్రమిదల ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలాగే తెల్ల గన్నేరు పూలతో గాని నందివర్ధనం పూలతో గాని తుమ్మి పూలతో గాని జాజిపూలతో గాని లక్ష్మీనారాయణ చిత్రపటానికి అర్చన చేయండి. ఈ పూలు మీకు లభించని పక్షంలో తులసి దళాలతో జాజిపూలతో అర్చన చేయడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే విష్ణుమూర్తి ప్రీతి కోసం పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వటం పచ్చ కర్పూరం కలిపిన తీపి పదార్థాలు లక్ష్మీనారాయణ చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.
అలాగే ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ఈరోజు గంట దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. విష్ణు ఆలయానికి గంట దానం ఇవ్వటం ద్వారా శక్తులు బాధలు తొలగింప చేసుకోవచ్చు లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి ఈరోజు అద్దం దానంగా ఇవ్వండి. అద్దం దానమిస్తే సౌందర్యం పెరుగుతుంది శారీరక మానసిక సౌందర్యం పెరగటానికి అతిశక్తివంతమైన పరమ ఏకాద శి సందర్భంగా విష్ణు ఆలయం రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహ స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి అద్దం మీరు దానంగా ఇవ్వండి అలాగే జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండటానికి వంట పాత్రలు దానం ఇవ్వండి అంటే దేవాలయంలో ప్రసాద వితరణ కోసం ఉపయోగించే వంట పాత్రలు మీరు ఈరోజు దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
విష్ణు ఆలయంలో వంట పాత్రలు దానం ఇవ్వటం ద్వారా అద్భుత ప్రయోజనాలు చేకూరతాయి అలాగే ఈరోజు విష్ణు ఆలయానికి అభిషేకాల నిమిత్తమై లేదా అర్చన నిమిత్తమై కొంత ధనాన్ని దానంగా ఇచ్చిన కూడా పూర్వజన్మ కర్మ ఫలితాలు తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు ఇలా ఈరోజు దేవాలయానికి మీకు తోచినంత దానం ఇవ్వండి దానం ఇవ్వలేని పక్షంలో విష్ణు ఆలయం ముందు ముగ్గులు వేయండి విష్ణు ఆలయంలో చెట్లకు నీళ్లు పోయండి విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయండి.
అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చేయండి వీటిలో ఏది చేసినా కూడా అధికమాసంలోవచ్చే ఏకాదశి పరమ ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు ప్రతి ఒక్కరు సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి పరమ ఏకాదశి సందర్భంగా ఏ శక్తివంతమైన మంత్రాలు చదువుకుంటే ఏకాదశి వ్రతం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొక్కసారి చూద్దాం మరి మొదటి మంత్రం శ్రీధర మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణువే నమః రెండో మంత్రం విష్ణు రహస్య మంత్రం హ్రీం విష్ణువే నమః మంత్ర జపం చేయండి పరమ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరు సులభంగా పాతులకండి…
Read Also : Varahi Kanda Deepam : వారాహి దేవి మంత్రం పఠిస్తే చాలు.. కంద దీపం ఇలా పెడితే సకల బాధలు, దోషాలు తొలగిపోతాయి..!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.