Good Time For Travel : సాధారణంగా చాలామంది మంచిపనులు చేసేముందు ముహర్తాలు, తిథులు, నక్షత్రాలను క్యాలెండర్లలో చూస్తుంటారు. పలానా సమయం మంచిది.. ఆ సమయంలోనే ఆ పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటుంటారు. బయటకు వెళ్లేటప్పుడు ఫలానా గడియలోనే ప్రయాణాలు చేయాలంటారు. ఇలాంటివి ఎక్కువగా పంచాగం, జాతకాలు వంటి వాటిపై నమ్మకం ఎక్కువగా ఉన్నవారే చేస్తుంటారు.
వామ్మో రాహుకాలం ఇప్పుడు ఈ పని చేయకూడదు.. పలానా సమయానికి పలానా తిథి మొదలవుతుతంది. అప్పుడు చేయండి.. అంతా కలిసి వస్తుందని చెబుతుంటారు. ఇంతకీ ఇవి ఎంతవరకు వాస్తమమో తెలియదుగానీ నమ్మేవారిని బట్టి అనుసరిస్తుంటారు. మంచిజరిగితే తిథి బాగుంది అంటారు. అదే చెడు జరిగితే మంచిదికాదంటారు.
క్యాలెండర్ చూడగానే మనకు కనిపించే తిథుల్లో మొదటిది పాడ్యమి.. మొత్తం 15 తిథులు ఉంటాయి. అందులో పూర్ణిమ, అమవాస్య కూడా ఉంటాయి. ఆయా తిథుల్లో పలానా పనులు, ప్రయాణాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు.
అయితే ఈ తిథులు ఏయే సందర్భాల్లో చూడాలి.. ఎవరికి వర్తిస్తాయి.. ఎవరికి వర్తించవంటే.. ప్రతిరోజు చేసే పనులకు ఈ తిథులు వర్తించవట.. అంటే.. విద్యార్థులు, శ్రామికులు, వ్యాపార ప్రయాణాలు, వైద్య అవసరాలు, ఉద్యోగాలు చేసుకునేవారికి వర్తించవు. అలా కాకుండా ఏదో ఒకరోజున ప్రత్యేకంగా జరిపే పనులు, శుభకార్యాలకు మాత్రమే తిథులు, ముహుర్తాలు చూస్తుంటారు. ప్రతిరోజు చేసే పనులకు తిథులు, వారాలు, నక్షత్రాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా ప్రతిఒక్కరూ నమ్మే తిథుల్లో ఏయే తిథుల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఓసారి చూద్దాం..
శుక్ల పాడ్యమి రోజున ఏదైనా పనిచేస్తే.. కష్టాలు కలుగుతాయి. విదియ రోజున చేస్తే కార్యసిద్ధి.. తదియ రోజున ప్రయాణం చేస్తే సకల కార్యాలనూ సిద్దింప చేస్తుంది. చవితి రోజున ప్రయాణం చేస్తే ఆపదలను కొనితెచ్చుకున్నట్టే. పంచమి రోజున శుభము కలుగును. ఇక షష్ఠి రోజున అనుకోకుండా గొడవలకు దారితీస్తుంది. సప్తమి రోజున ఎటు వెళ్లినా అతిథి మర్యాదలు జరుగుతాయట..
అష్టమి రోజున అష్ఠకష్టాలే పడాల్సి వస్తుంది. నవమి రోజున నష్టాలతో పాటు అనారోగ్య సమస్యలు వస్తాయంటారు. దశమి రోజున ప్రయాణము ధనలాభంగా భావిస్తారు. ఏకాదశి సౌఖ్యం కలుగుతుందని నమ్ముతారు. ద్వాదశి రోజున మహానష్టాలకు కారణమవుతుందంటారు. త్రయోదశి శుభాలు తెస్తుందని, అలాగే బహుళ చతుర్థీ కీడు చేస్తుందని అంటారు.
అమావాస్య రోజున ప్రయాణం చేస్తే ఆపదలు వస్తాయని విశ్వసిస్తారు. ఏదిఏమైనా మంచి ఆలోచనతో చేసే సత్ కార్యంతో అంతా మంచే జరుగుతుందని నమ్మితే అంతా మంచే.. లేదంటే చెడుగా ఆలోచిస్తే.. అంతా చెడు జరుగుతుందని అనిపిస్తుంది.
మన ఆలోచనల బట్టి అనుకున్నట్టుగా జరిగితే అలా అనుకోవడం వల్లే జరిగిందని అంటారు. ఏ తిథిలో వెళ్లినా మంచి చెడు అనేది ఉండొచ్చు. కానీ, మన ఆలోచన తీరు పాజిటివ్ గా ఉంటే అంతా పాజిటివ్ గానే అనిపిస్తుంది. అదే చెడుగా ఆలోచిస్తే.. అంతా చెడుగానే అనిపిస్తుంది. అంతా మంచే జరగుతుందని భావిస్తూ ముందుకు వెళ్తే మనకు అంతా మంచే జరుగుతుందని విశ్వసించాలి. అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే లేనిపోని చెడు ఆలోచనలతో మనస్సు తీవ్ర మనోవేదనకు గురవవుతుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం.. మనకు తెలుగు తిథుల వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది కచ్చితంగా నిర్ధారించలేం. మనకు ఉన్న నమ్మకాలను బట్టి ఉంటాయి. కొన్నిసార్లు అదే నమ్మకాలు బలంగా నెరవేరినప్పుడు తిథుల వల్లే ఇలా జరిగాయోని భావిస్తుంటారు. అదే మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం కష్టమే.
మంచి, చెడు అనేది మన నమ్మకాలు ఆధారంగా చెబుతంటారు. అంతేకానీ, నమ్మకాలకు వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంటుందనేది మరిచిపోతుంటారు. ఏదిఏమైనా తిథుల ప్రకారమే అన్ని జరిగితే అప్పుడు లైఫ్ లో అందరికి ఒకేలా ఎందుకు జరుగదు. ఒక్కొక్కరి జాతకం బట్టి వారికి ఒక్కో సమస్య ఉండొచ్చు. వారి జాతకంలో బలంగా ఉంటే.. తిథుల వల్ల ఎలాంటి నష్టాలు జరగకపోవచ్చు. అదే వారి జాతకంలో బలంగా లేకపోతే.. ఏ తిథి అయినా మంచి లేదా చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు.
Read Also : Tamalapaku : ‘ధనలక్ష్మీ’ కరుణించడం లేదా..? తమలపాకుతో ఈ పరిహారం చేయండి.. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు!
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.