
Adhika Sravana Masam 2023 in Telugu
Adhika Shravana Masam 2023 : అధికమాసం అంటే ఏంటి? అధికమాసంలో ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు? అధికమాసంలో ఎలాంటి దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సౌరమానం, చాంద్రమానం, ఈ రెండింటిని అసమానతలు తొలగించేందుకు వచ్చిన మాసాన్ని అధికమాసంగా పిలుస్తారు. తిధులలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులు సరిచేయటానికి వచ్చే మాసాన్ని అధికమాసం అంటారు. ఈ అధికమాసం అంటే.. విష్ణుమూర్తికి చాలా ఇష్టం. దీన్ని పురుషోత్తమ మాసం అంటారు. 2023వ సంవత్సరంలో ఈసారి అధిక శ్రావణమాసం వస్తోంది.
ఈ అధిక శ్రావణ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ‘ఓం పురుషోత్తమాయ నమః’ అనే నామాన్ని 21 సార్లు చదువుకోవాలి. మామూలు మాసానికి అధికమాసానికి ఉన్న తేడా ఏంటంటే.. మీరు అధికమాసంలో తీర్థయాత్రలు చేసిన పుణ్యక్షేత్ర సందర్శనం చేసిన నదీ స్నానాలు చేసినా మామూలు మాసాలలో చేసే దానికన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. అలాగే, అధికమాసంలో శివకేశవులను ధ్యానిస్తే చాలా మంచిది.
ఈశ్వరుని విష్ణుమూర్తిని అధికమాసంలో పూజించినా శివుడు విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే, అధికమాసంలో శుభ కార్యక్రమాలు చేయకూడదు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివేవీ కూడా అధికమాసంలో చేయకూడదు. అయితే, అధికమాసంలో పుట్టినరోజు చేసుకోవచ్చు. అధికమాసంలో పుట్టినరోజు వస్తే.. ఆ రోజు శివుడికి పంచామృతాలతో దేవాలయంలో అభిషేకం చేయించుకోవాలి. బెల్లం పొంగలి పరమేశ్వరుడికి దేవాలయాల్లో నివేదించి ఆ బెల్లం పొంగలి అందరికీ పంచిపెట్టాలి. మీరు కూడా తినాలి. అలా చేస్తే మీకు మంచి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. పుట్టినరోజు అధికమాసంలో వస్తే.. ఇలా చేయండి. నిండు నూరేళ్లు ఆయుర్దాయం పెరుగుతుంది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. అయితే, ఎవరైనా ఎప్పుడైనా సరే అధికమాసం వచ్చినప్పుడు ఎవరైనా మరణిస్తే.. వాళ్ళకి అధికమాసంలో పితృ కార్యాలు చేయాలి. మళ్లీ వచ్చే నిజమాసంలో కూడా పిత్రు కార్యాలు చేయాలి.
అదే, నిజమాసంలో ఎవరైనా మరణిస్తే.. అధికమాసంలో పితృ కార్యాలు చేయవలసిన అవసరం లేదు. నిజమాసంలో పితృ కార్యాలు చేస్తే సరిపోతుంది. అధికమాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈసారి 2023వ సంవత్సరంలో నిజ శ్రావణ మాసానికి ముందు అధిక శ్రావణమాసం వచ్చింది. అంటే.. శ్రావణమాసం అధికమాసంగా వచ్చింది. ఈ అధిక శ్రావణ మాసంలో ఎవరైనా గుమ్మడికాయ మంచి పండితుడికి దానం ఇస్తే.. కనుక 14 ఏళ్ల పాటు ఐశ్వర్యం కలుగుతుందట. ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే అధికమాసంలో గుమ్మడికాయ దానం ఇవ్వాలి. అది కూడా బంగారం కొంచెం ఉంచి గుమ్మడికాయ దానంగా ఇస్తే చాలా మంచిదట.
బంగారం ఇచ్చుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గుమ్మడికాయతో పాటు అరటి పండ్లు పెట్టి ఒక పండితుడికి మాసంలో దానం ఇవ్వాలి. 14 ఏళ్ల పాటు ఆర్థికంగా బావుంటుంది. మంచి ఐశ్వర్యం కలుగుతుంది. అధికమాసంలో పనస పండు దానం ఇస్తే.. దానివల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. కుటుంబ కలహాలు ఎక్కువ ఉన్న వాళ్ళు అధికమాసంలో పనస పండు దానంగా ఇవ్వాలి. అలాగే, అధికమాసంలో ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయంపాకం దానమిస్తే.. తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య గొడవలు ఉండవు. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు.
స్వయంపాకం అంటే.. ఒక పూటకు అవసరమైనటువంటి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు ఇవన్నీ ఇస్తే.. స్వయంపాకం అంటారు. పంతులుకు స్వయంపాకం దానమిస్తే.. తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య గొడవలు ఉండవు. సత్సంబందాలు పెరుగుతాయి. అలాగే, అధికమాసంలో అరిసెలు దానం ఇస్తే చాలా మంచిది. జీవితం మొత్తం అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలంటే అధికమాసంలో 33 అరిసెలు దానం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చి అధికమాసంలో అద్భుత ఫలితాలు పొందవచ్చు.
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.