Latest

Zodiac Signs : ఈ రాశుల వారు చాలా ఎమోషనల్.. ప్రతీ చిన్న విషయానికే కన్నీరు పెట్టుకుంటారట!

Advertisement

Zodiac Signs : మనిషి పుట్టుకతోనే అతనిపై రాశిఫలాలు, గ్రహాల ప్రభావం ఉంటుంది. అతను పెరిగి పెద్దాయ్యాక చాలా సందర్భాల్లో తన భవిష్యత్ గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం ఎంతటి కష్టాన్ని అయినా భరించేందుకు సిద్ధంగా ఉంటారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు గల కారణాలెంటో అన్వేషిస్తుంటాడు. ఎవరి వలన, ఎందుకోసం తనకు ఈ పరిస్థితి వచ్చిందని పదేపదే అంతర్మథనం చేసుకుంటుంటాడు. ఆ సమయంలో అతనికి ఉన్న ఏకైక మార్గం జ్యోతిష్యశాస్త్రం. దీని ఆధారంగా అతని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. గ్రహాల మూవ్‌మెంట్ ఏ విధంగా ఉంది. రాశుల ప్రభావం వ్యక్తుల మీద ఎలా ఉండబోతుందో ముందుగానే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.

ఆస్ట్రాలజీ ప్రకారం.. ప్రకారం జనాలు వారి రాశి చక్రం ఆధారంగానే ప్రవర్తిస్తుంటారు. నిర్దిష్టమైన లక్షణాలను కలిగి ఉంటారు. దేశంలో రాశుల సంఖ్యను, వాటి తత్వాల ప్రకారం నాలుగు రకాలుగా విభజిస్తారు. అగ్ని, వాయు, జల, భూ తత్వంగా పేర్కొంటారు. వీటిలో జలతత్వానికి చెందిన రాశుల వారు చాలా భావోద్వేగంతో ఉంటారని తెలిసింది. ఏదైనా బాధ అనిపిస్తే అస్సలు తట్టుకోలేరు. ప్రతీ విషయాన్ని మనస్సుకు దగ్గరగా తీసుకుంటారు. అందుకే వీరికి సులభంగా కన్నీళ్లు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మిగిలిన రాశుల వారు కూడా తమ బాధను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారట.. ఏదో ఒక విషయంలో ఈ రాశుల వారు హర్ట్ అవుతారట. కానీ తమ బాధను ఎవరికీ తెలియకుండా కవర్ చేసుకుంటారని తెలుస్తోంది. వీరు చాలా సెన్సిటివ్ కూడా అయి ఉండొచ్చు. తమకు నచ్చిన వారి పట్ల, ఇతరులను కష్టపెట్టడం ఇష్టం లేక ప్రతీది వీళ్లే భరిస్తున్నారని ఈ రాశులు స్పష్టం చేస్తున్నాయి.

Zodiac Signs _ These are the most emotional zodiac signs

ఈ రాశుల వారికి మగ, ఆడా అనే వ్యత్యాసం ఉండదు. ఎందుకంటే భావోద్వేగాల విషయంలో ఇద్దరూ ఒకటే. ఒకేలా స్పందిస్తారు. ఎంతలా అంటే.. ఒకానొక సందర్భంలో ఏదైనా సినిమా చూసినా, పుస్తకం చదివినా అందులో ఉండే డీప్ ఎమోషనల్స్‌కు బాగా కనెక్ట్ అయిపోతారు. తెలియకుండానే కన్నీటి జలపాతం పారుతుంది. ఈ రకంగా తమలోని ఆందోళనలు, ఒత్తిళ్లను దూరం చేసుకుంటారు. ఫలితంగా ఈ రాశుల వారికి మానసిక, ఆరోగ్య సమస్యలు పెద్దగా దరిచేరవని తెలుస్తోంది. బాగా ఏడిస్తే ఈ రాశుల వారి మనస్సు చాలా తేలిక అవుతుందని రాశి చక్రాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే జలతత్వాన్ని కలిగి ఉండి ప్రతీ చిన్నవిషయానికే భావోద్వేగానికి గురయ్యే రాశులు ఎంటో ఇప్పడు తెలుసుకుందాం.

​తులరాశి :
ఈ రాశి కలిగిన ఆడ, మగ వాయుతత్వాన్ని కలిగి ఉంటారు. అయినప్పటికీ భావోద్వేగాల విషయంలో ఇద్దరు సమానం. బాధ అనిపిస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేరట. బాధ అనిపిస్తే విపరీతంగా ఏడ్చేస్తారు. తమ అభిప్రాయం చెప్పే సందర్భాల్లో కూడా ఎదుటివారు ఏమైనా అనుకుంటారేమో అని లోలోపల మదనపడుతుంటారు. ఫలితంగా చాలా సందర్భాల్లో వీరిని ఇరు వైపులా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ రాశుల వారికి ప్రేమ, అప్యాయతలు పంచే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతీ విషయాన్ని భావోద్వేగంతోనే ఆలోచిస్తారని తెలుస్తోంది. తమకు నచ్చిన వారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. వారు లేకపోతే అసలు ఉండలేరు. వారి కోసం ఎంతటి బాధను అయినా భరించడానికి వీరు సిద్ధంగా ఉంటారు. కానీ మోసం చేస్తున్నారని తెలిస్తే దేనికైనా వీరు తెగిస్తారట. ఎంత ప్రేమ చూపిస్తారో.. వారి కోసం బాధను కూడా అంతే మొత్తంలో భరిస్తారట..

​మీనరాశి :
సెన్సిటివ్ వ్యక్తుల జాబితాలోకి వస్తున్న వారిలో మీనరాశి వారు కూడా ఉన్నారు. అయితే వీరు కర్కాటక రాశి వారిలాగా కాకుండా భావోద్వేగాలను కొద్దిగా నియంత్రించుకోగలరని తెలుస్తోంది. అయితే, వీరిలో అంతర్మథనం మాత్రం అధికంగా ఉంటుందని జ్యోతిశ్యశాస్త్రం చెబుతోంది. వీరు కూడా బయటకు తమ బాధనకు కనిపించకుండా లోలోపల ఫీలవుతుంటారు. కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా ఏడ్చేస్తుంటారు. అంతేకాకుండా, వీరి కళ్లేదుట అన్యాయం జరుగుతుంటే అస్సలు సహించలేరు. మొదట చాలా బాధపడుతారని, ఆ తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు వెనుకాముందు అవుతారట. వీరి నిర్ణయాన్ని ఎవరన్న కాదంటే కూడా తెగ ఫీలవుతారని తెలుస్తోంది. తమకు నచ్చింది చేస్తామని గట్టిగా చెప్పలేక, ఎదుటి వారిని బాధపెట్టలేక ఎప్పుడూ లోలోపల మదన పడుతుంటారని తెలిసింది.

కర్కాటక రాశి :
ఈ రాశి సింబల్ అయిన పీత లాగానే వీరు ప్రతీ విషయానికి ఆందోళనకు గురవుతుంటారు. చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వారు. గొడవలు, వాదలనకు చాలా దూరంగా ఉంటుంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ ప్రశాంతతను కోరుకుంటారు. వీరితో జీవితం పంచుకునే వారు, స్నేహితులు కూడా తమలాగానే ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. వీరిలాగే మనస్తత్వం కలిగిన వారు వీరితో ఉండటం వలన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటారు. ఒత్తిళ్లకు దూరంగా ఉంటారు. మానసికంగా చాలా ప్రశాంతతను పొందుతారు. తమకు నచ్చిన వారు, అర్థం చేసుకునే వారు దొరికితే వారితో కుటుంబ బంధాన్ని బలంగా ఏర్పరచుకుంటారు. తమకు నచ్చిన వారు దూరం అవుతున్నారని తెలిసినా, వారు తమను అర్థం చేసుకోకపోయినా, వీరి మధ్య ఏ చిన్న వాదన, గొడవ జరిగినా ఏడుపుతోనే సమాధానం చెబుతుంటారు. వద్దన్న ఏడుపు తన్నుకుంటూ వచ్చేస్తుంది. అంతేకాకుండా, ఈ రాశి కలిగిన వారు ఎమోషన్‌ను నియంత్రించుకోవడంలో ఎల్లప్పుడూ ఫెయిల్ అవుతుంటారు.

Read Also : Zodiac Signs : ఈ రాశులవారు బై బర్త్ లీడర్స్.. మీ రాశి వుందో చూసుకోండి..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago