
Vastu Tips to remove Dosh clash between Couples
Vastu Remedies For Couple Quarrel : మన ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలని అందరం కోరుకుంటాం. ఎదుటివారితో, చుట్టుపక్కనవారితో ఎలాంటి విభేదాలు, గొడవలు ఉండొద్దని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన చుట్టుపక్కలనో, లేక మన ఇంట్లోనో రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీని వల్ల చికాకు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక మదన పడుతుంటాం. కొన్ని సమయాల్లో కారణం లేకున్నా కోపం వస్తుంది.
వీటన్నికి కారణం ఏంటా అని సందేహపడుతుంటాం. కొందరు మానసిక ఒత్తిడులు కారణమని చెబుతుంటారు. కానీ వాస్తుకు సంబంధించిన విషయాల్లో సైతం ఇలాంటి ఘటనలు సంభవిస్తుంటాయి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? వీటి నుంచి ఎలా ఉపశమనం పొందాలి? వీటన్నింటి గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయాలను ఇప్పడు మనం తెలుసుకుందాం.
అందరితో గొడవలా.. వాస్తు దోషం కావొచ్చు :
తెలిసిన వారితో, చుట్టాలతో, దోస్తులతో పదే పదే గొడవలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం. అదేంటో మనకు అర్థం కాదు. ఉన్నట్టుండి దూరం కావడం, మన అనుకున్న వాళ్లతో అనేక సార్లు విభేదాలు రావడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతాం. ఎటువంటి గొడవలు, మాటలు లేకుండా ఊరికెనే కోపం వస్తూ ఉంటుంది. దీని కారణంగా తెలిసో తెలియకో పొరపాట్లనేవి జరుగుతుంటాయి.
Oral Diabetes : నోటిలో ఇలాంటి లక్షణాలు ఉంటే.. డయాబెటిస్ వచ్చినట్టేనా?
మనకు ఇష్టమైన వారు, మిత్రులు, చుట్టాలతో మంచిగా రిలేషన్ పెంచుకోవాలనుకుంటే వారికి మనం ఇచ్చే గిఫ్టుల విషయంలో జాగ్రత్తలు అవసరమనే చెప్పాలి. గుర్తులేకనో, మర్చిపోయో రుమాల్ గానీ, పర్ఫ్యూమ్ బాటిల్‌ను గానీ బహుమతిగా ఇవ్వొద్దు. ఇదే కాక మనకిష్టమైన వారు, చుట్టాలు, దోస్తులకు సంబంధించిన రుమాల్ సైతం మనం ఉపయోగించకూడదు. ఒక వేళ ఉపయోగిస్తే గొడవలు, విభేదాలు పెరుగుతాయి. దీని వల్ల మనలో అసంతృప్తి పెరుగుతుంది. ఇక ఇంటి విషయానికి వస్తే.. మనం ఇంట్లోకి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్నా.. మెయిన్ డోర్ ద్వారానే.
మీ ఇంట్లో ఇలా ఉంటే గొడవలే :
ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని మురికిగా, అపరిశుభ్రంగా ఉంచొద్దు. ఒక వేళ ఇంటి మెయిన్ డోర్ వద్ద మురికి లేదా అపరిశుభ్ర వాతావరణం ఉంటే గొడవలు తలెత్తే చాన్స్ ఉంటుంది. వివాదాలు ఎక్కువయ్యే అవకాశాలు సైతం మెండుగా ఉంటాయి. తెలియకుండానే గొడవలు మొదలవుతాయి. అవి సద్దుమనగడానికి ఎక్కువ సమయం సైతం పట్టొచ్చు. లేదా సద్దుమనగక పోవచ్చు. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించడం ఎంతగానో అవసరం. ఎప్పటికప్పుడు మెయిన్ డోర్ వద్ద ఉన్న మురికిని, అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగిస్తూనే ఉండాలి.
Best Age for Pregnancy : ఏ వయస్సులో పిల్లలను కనాలి? 30ఏళ్ల తర్వాత సంతానం కలుగుతుందా? సైన్స్ ఏం చెబుతోంది!
మురికి ఉండకుండా ఎప్పటికప్పడు జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పైకప్పు మీద గ్యాసు లేదా జంకు వస్తువులను ఉంచితే.. దీని వల్ల వ్యక్తిగతమైన రిలేషన్స్‌పై ప్రభావం పడుతుంది. దీని వల్ల ఫ్యామిలీలో ఉన్న గొడవలు, విభేదాలు దూరమౌతాయి. చుట్టాలు, దోస్తులకు సంబంధించిన రిలేషన్‌లో సైతం గొడవలకు, విభేదాల వల్ల కలిగే అశాంతికి ఉపశమనయం దొరుకుతుంది. మిత్రులతో ఉన్న గొడవలు సద్దుమనుగుతాయి.
ఈ సమస్యలు ఉంటే వాస్తు దోషమే :
కొన్ని సమయాల్లో ఎలాంటి దోషం కనిపించకపోయినా.. ఇల్లు మారాక కారణం లేకుండానే గొడవలు, అనారోగ్యం, చికాకులు, ప్రవర్తన మారడం లాంటి జరుగుతుంటాయి. జాతకం ప్రకారం ఎటువంటి దోషాలు లేనటువంటి టైంలోనూ ఇలాంటివి జరుగుతుంటే ఆ ఇంటివాస్తులో దోషం ఉన్నట్టు గ్రహించక తప్పదు. సూసైడ్ చేసుకునే ప్రయత్నం, ఫ్యామిలీ గొడవలు, రోగాలు రావడం తదితర విషయాలు గమనిస్తే ఇంట్లో దోషం ఉందని గ్రహించాలి. ఇంటిపై కాకులు, గబ్బిలాలు ఎక్కువగా రావడం, మన ఇంటి చుట్టూనే కాకులు తిరగడం చేయడం సైతం వాస్తు దోషానికి సూచికలు. మన ఇంట్లో పెంచుకునే కుక్కసైతం ఎప్పుడూ ఒకే దిక్కుకు తిరుగుతూ అరవడం సైతం దీని కిందికే వస్తుంది.
వారసత్వ ఇళ్లలో వాస్తు దోషాలా :
తరతరాల నుంచి వచ్చిన ఇండ్లను చికాకు కారణాల వల్ల వదిలి వెళ్లలేము. అలాంటి సమయంలో జ్యోతిష్యం, వాస్తు విషయంలో అనుభవం ఉన్న వారికి చూపించి, లోపాలు గుర్తించి వాటికి తగిన చర్యలు చేపట్టడం చేయాలి. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కొనాలనుకున్నా ముందే జాగ్రత్తలు తీసుకుంటే తరువాత ఎలాంటి ఇబ్బందులు పడనవసరం లేదు. కానీ అనేక మంది ఇల్లు కొన్నాకో, స్థలం కొన్నాకో వాటికి ఎమైనా దోషాలు ఉన్నయేమో అని వాస్తుకు సంబంధించిన పండితులను సంప్రదిస్తారు. ఇది కరెక్ట్ కాదు.
ఇల్లు కొనే ముందు చెక్ చేసుకోండి :
ఏదైనా ఇంటి పని మొదలుపెట్టాలన్నా.. పాత ఇంటిని రీ మాడల్ చేయాలన్నా.. స్థలం కొనుగోలు చేయాలన్నా ముందు జ్యోతిష్యానికి, వాస్తుకు సంబంధించిన అనుభవం ఉన్న నిపుణులను సంప్రదించడం ఎంతో అవసరం. మనం కొనుగోలు చేసే ఇంటికి గానీ, స్థలానికి గానీ వస్తు దోషాలు ఉంటే ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే కొనుగోలు చేసిన తర్వాత దోషాలున్నట్టు తెలిస్తే ఇబ్బందులు పడక తప్పదు. అలాంటి వాటిని ముందే దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. కొందరు వాస్తును పట్టించుకోరు.
అలాంటి వారే ఎక్కువగా నచ్చిన స్థలాలు, ఇండ్లను కొనుగోలు చేస్తారు. తీరా సమస్యలు ఎదుర్కొన్నాక వాటి నుంచి బయటపడటానికి అనేక దారులు అన్వేషిస్తారు. అజాగ్రత్తతో కొనుగోలు చేసి ఇబ్బందులు పడటం కంటే ముందే జాగ్రత్త పడటం అని చెబుతున్నారు జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు. మీరు సైతం ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని ముందుస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత జీవితం ప్రశాంతంగా కొనసాగుతుందని సూచిస్తున్నారు.
Early Pregnancy Health Tips : ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఈ విషయంలో జర జాగ్రత్త!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.