
Lord Ganesha idol in House
Ganesha idol : భారతదేశం భక్తి భావనకు కేంద్రం అన్న సంగతి అన్న ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ఒక్కరు దేవుడిని పూజించే క్రమంలో, ఏ ఇతర వ్రతాలు, పనులు చేసినా మొదటగా పూజ చేసేది గణనాథుడు విఘ్నేశ్వరుడినే. విఘ్నేశ్వరుడికి పూజలు చేయడం ద్వారా విఘ్నాలు ఏమి రాకుండా ఆయన అడ్డు ఉంటారనేది భక్తుల నమ్మకం. ఇకపోతే చాలా మంది విఘ్నేశ్వరులను ఇళ్లలో పెట్టుకుని పూజలు చేస్తుంటారు. అయితే, గణనాథుడి విగ్రహాలను ఇళ్లలో పెట్టుకునే క్రమంలో ఈ వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవి ఏంటో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఈ నియమాలు తప్పనిసరి :
వాస్తుశాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడిని ఇళ్లలో పెట్టుకునే ముందర కొన్ని నియమాలు కంపల్సరీగా పాటించాలి. ఆ నియమాలు పాటించకపోతే అశుభకరమని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ అది ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఇళ్లల్లో విఘ్నాలను తొలగించే గణనాథుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి.
గణనాథుడు కొలువు దీరిన ఇళ్లలో ఆనందం, శ్రేయస్సు పెంపొదించబడతాయి. ఆ ప్రదేశంలో ఉన్న వ్యక్తుల జీవితాల్లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అందుకే గణనాథుడిని విఘ్నరాయుడు అంటారట. విఘ్నాలన్నిటినీ ఇట్టే తొలగించగల శక్తి గణపతికి ఉందని భక్తుల నమ్మకం. ఇకపోతే చాలా మంది విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇస్తుంటారు. అయితే, అలా గిఫ్ట్ గా ఇచ్చే క్రమంలోనూ కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
గిఫ్ట్ గా విగ్రహాన్ని తీసుకున్నారా? :
ఇంట్లో పెట్టుకోవడంతో పాటు గిఫ్ట్‌గా ఇచ్చే క్రమంలో కూడా ప్రతీ ఒక్కరు వాస్తు శాస్త్రం ప్రకారం ఈ నియమాలను పాటించాలి. వాటిని అస్సలు విస్మరించకూడదు. గణనాథుడి విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టొద్దు. ముఖ్యంగా గణనాథుడి ప్రతిమ లేదా విగ్రహాన్ని బాత్ రూమ్ గోడ వద్ద అస్సలు ఉంచకూడదు. ఇకపోతే బెడ్ రూమ్‌లో వినాయకుడి విగ్రహాన్ని అస్సలు పెట్టొద్దు. ఒకవేళ బెడ్ రూమ్‌లో కనుక గణనాథుడి విగ్రహాన్ని ఉంచితే దంపతుల మధ్య గొడవలు జరిగి, వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. వైఫ్, హస్బెండ్ మధ్య అనవసరమైన సమస్యలు రావడంతో పాటు ఒత్తిళ్లు బాగా పెరిగిపోతాయి.
పడక గదిలో విగ్రహం పెట్టరాదు :
కాబట్టి పడక గదిలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టొద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం నృత్యం చేస్తున్న వినాయకుడి విగ్రహం మరిచిపోయి కూడా ఇంట్లో పెట్టొద్దు. సాధారణంగా డ్యాన్సింగ్ గణేశా.. స్టైలిష్‌గా ఉందంటూ కొందరు అనుకుంటుంటారు. కానీ అటువంటి ప్రతిమలు లేదా విగ్రహాలు ఇంట్లో పెట్టొద్దు. ఇకపోతే అటువంటి నృత్య గణనాథులను గిఫ్ట్‌లుగా కూడా ఎవరికీ ఇవ్వొద్దు. డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న గణేశుడి విగ్రహాన్ని కనుక ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, గొడవలు జరుగుతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది.
డ్యాన్సింగ్ గణేశుడిని గిఫ్ట్ గా తీసుకోవచ్చా? :
ఇటువంటి డ్యాన్సింగ్ గణేశుడి కొలువు దీరిన ఇళ్లలో దంపతుల మధ్య గొడవలతో పాటు మొత్తం కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తలెత్తుతాయట. ఇకపోతే ఎవరికైనా అనుకోకుండా డ్యాన్సింగ్ గణేశుడి విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇస్తే కనుక వారి జీవితంలోనూ అసమ్మతి చెలరేగుతుందట. ఇకపోతే మ్యారేజ్ సందర్భంగా చాలా మంది తెలియక గణపతి విగ్రహం ఇవ్వాలను కోవడం మనం చూడొచ్చు. అలా వినాయకుడి విగ్రహం ఇవ్వడం ద్వారా అమ్మాయికి ఎటువంటి విఘ్నాలు రాబోవని అనుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకాం అమ్మాయి వివాహం సందర్భంలో గణనాథుడి విగ్రహాన్ని అస్సలు ఇవ్వొద్దట.
ఇందుకు కారణం కూడా ఉందండోయ్.. లక్ష్మి, వినాయకుడు ఎప్పుడు కలిసి ఉంటారు. అలా పెళ్లి తర్వాత ఆల్రెడీ అమ్మాయి వెళ్లిపోతుంది. ఇక వినాయకుడు కూడా వెళ్లిపోతే లక్ష్మీతో పాటు వినాయకుడు ఇద్దరు వెళ్తారు. ఫలితంగా ఇంటి నుంచి శ్రేయస్సు, సంతోషం వెళ్తాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో వినాయకుడి విగ్రహాన్ని అమ్మాయి మ్యారేజ్ సందర్భంగా ఇవ్వొద్దు.
అలా అయితే ఇంట్లో గణేశుడి విగ్రహం గానీ ఉంచిన యెడల ఇంటికి ఎడమవైపున మాత్రమే పెట్టి పూజించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అదే కుడివైపు పూజించడంలో ప్రత్యేక నియమాలను అననుసరించాల్సి ఉంటుంది. ఆ నియమాలు పాటించడం కుదరకపోవడం చేత ఎడమ వైపున శివుడి కుమారుడు అయిన గణనాథుడిని ప్రతిష్టించుకోవాలి.
పిల్లల కోసం వినాయకుడిని పూజించాలి :
ఇకపోతే పిల్లలు కావాలనుకునే దంపతులు వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిదే. తల్లిదండ్రులను గౌరవించే బిడ్డకు జన్మను ఇవ్వడం వినాయకుడిని పూజించడం ద్వారానే జరుగుతుందని భక్తుల విశ్వాసం. పిల్లలు కావాలనుకునే నవ దంపతులు వినాయకుడికి పూజలు చేయాలి. అది కూడా వారు తీసుకొచ్చిన వినాయకుడికి అయితే చాలా మంచిదని వాస్తు శాస్త్రం చెప్తోంది.
ఇకపోతే ఉద్యోగం లేదా వ్యాపారంలో కాని ఏదేని సమస్యలు ఉంటే కనుక వాటిని అధిగమించేందుకుగాను వినాయకుడి విగ్రహంతో పాటు ఫొటోను ఇంట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మీ సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. మీ విజయానికి నాంది పడుతుంది. అయితే, ఇక్కడ కూడా వినాయకుడిది నార్మల్ ప్రతిమ లేదా విగ్రహం తెచ్చుకోవాలి. డ్యాన్సింగ్ వినాయకుడి ఫొటో కాని ప్రతిమ కాని తీసుకురాకూడదు.
Read Also : First Night Milk Secret : ఫస్ట్‌నైట్ రోజు పాలే ఎందుకు తాగాలి.. అందులో ఉన్న సీక్రెట్ ఏంటి?
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.