
Love Marriage vs Arranged Marriage Benefits
Arranged Marriage Benefits : పెద్దలు చేసే అరేంజెడ్ మ్యారేజ్‌పైన కొందరు యువతీ యువకులు ఆసక్తి చూపకపోవడం మనం చూడొచ్చు. వారు అలా చేయడానికి గల కారణాలు ఏంటంటే.. ముక్కు, ముఖం తెలియని వారు ఎవరినో మ్యారేజ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బుందులు ఎదురవుతాయో అని అనుమానపడుతుంటారు.
ఈ క్రమంలోనే అలా తెలియని వ్యక్తులను పెళ్లి చేసుకోవడం వల్ల కష్టాలు వస్తే ఎవరితో చెప్పుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో వారు తమకు నచ్చిన వ్యక్తులను ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంటారు. కానీ, పెద్దలు చేసే సంప్రదాయ అరేంజెడ్ మ్యారేజెస్‌లోనూ చాలా బెన్‌ఫిట్స్ ఉన్నాయి.
చాలా విషయాలు ఆలోచించిన తర్వాతే నిర్ణయం..
మన పూర్వీకులు చాలా కాలం కిందటి నుంచే ఈ పెద్దలు కుదుర్చిన పెళ్లిళ్ల వ్యవస్థ నడుస్తున్నది. అలా మ్యారేజ్ సిస్టమ్ అనేది పెద్దల నిర్ణయం మేరకు సాగుతున్నది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందర పెద్దలు అటు వారు ఇటు వారు అనగా వధువు, వరుడు తరఫు బంధువులు వారి పద్ధతులను గురించి వివరిస్తారు. ఈ క్రమంలోనే వధువుకు తగిన వరుడు, వరుడికి తగిన వధువు అవునా? కాదా? అనే విషయమై కూడా వారు అంచనా వేసుకుని ముందుకు సాగుతారు. ఒకవేళ ఏదేని ఇబ్బందులు వస్తే అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు సాగాలని సూచిస్తుంటారు.
అంచనాల్లేకుండా హ్యాపీ లైఫ్..
ఇక పెద్దలు కుదర్చిన పెళ్లి వ్యవస్థలో వధువు, వరుడి మధ్య అంతకు ముందు పరిచయం అయితే ఉండదు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పెళ్లి తర్వాత ఎటువంటి అంచనాలు ఉండబోవు. ఇద్దరూ ఓపికగా ఒకరి గురించి మరొకరు తెలుసుకుని ముందుకు సాగిపోయే చాన్సెస్ మెండుగా ఉంటాయి. వారి వ్యక్తిగత, వృత్తిగత పరిస్థితులు, జీవితం గురించి పెద్దగా అంచనాలు పెట్టుకోకపోవడం వల్ల వీరిద్దరు కూడా పెళ్లి తర్వాత ఆనందంగా గడిపేస్తారు.
అన్ని విషయాల గురించి ఆరా..
పెళ్లికి ముందర వధువు కాని వరుడు కాని అటు తరఫున వారి కుటుంబ సభ్యుల గురించి పూర్తిగా ఆరా తీస్తారు. పెళ్లికి ముందర పెద్దలు ఈ విషయాలపై స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పరుచుకున్న తర్వాతనే ముందుకు సాగుతారు. ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత వధువు, వరుడి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు, గొడవలు రాకుండా ముందే క్లారిఫై చేసుకుంటారు.
పెళ్లి అనగానే అటు ఏడు తరాలు… ఇటు ఏడు తరాలు చూడాలంటారు. అప్పుడే పెళ్లిళ్లు కుదుర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే.. ఒక తరం కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అలాంటి వారితో వియ్యం అందితే ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించి అమ్మాయిని ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. అయితే ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లోనే ఎక్కువగా బంధాలు బలంగా ఉంటున్నాయనేది అక్షర సత్యం..
ఏ సమస్య వచ్చినా అటు పెద్దలు.. ఇటు పెద్దలు కలిసి కూర్చొని వారి సమస్యను పరిష్కరించే అవకాశం ఉండటమే.. అదే ప్రేమపెళ్లిళ్లల్లో జంటలదే నిర్ణయం.. వారికి సర్ధిచెప్పి సమస్యను పరిష్కరించేవారు ఉండరు. అందుకే తొందరగా విడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రేమపెళ్లి చేసుకున్నవారిలో అర్థం చేసుకుని సర్దుపోతూ సమస్యలను పరిష్కరించుకుంటే అనోన్యంగా జీవించవచ్చు.
Read Also : Lemon Coffee Benefits : నిమ్మకాయ కాఫీతో ఇన్ని ప్రయోజనాలా? రుచిలోనే కాదు ఆరోగ్యానికి ది బెస్ట్!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.