Health Tips

Calcium Deficiency : బాడీలో కాల్షియం తక్కువే కాదు.. ఎక్కువైనా ప్రమాదమేనంట.. ఎందుకో తెలుసా..

Advertisement

Calcium Deficiency : మానవ శరీరంలో ఎముకలే ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకోసం మనం తీసుకునే ఆహారంలో కాల్షియం మోతాదు సరిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఎముకలు ధృడత్వం కోల్పోయి అనారోగ్యం బారిన పడుతుంటారు. కాల్షియం సరైన మోతాదులో శరీరానికి అందకపోతే చిన్న ఏజ్‌లోనే కీళ్ల నొప్పుల వంటి సమస్యలు వస్తుంటాయి. సాధారణంతా కొందరికి తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన మేర కాల్షియం దొరకదు.

దీంతో వారు వైద్యుల సూచన మేరకు కాల్షియం మాత్రలు వాడుతుంటారు. అయితే, కాల్షియం టాబ్లెట్లు అధికంగా వాడటం వలన శరీరంలో దాని మోతాదు ఎక్కువై హాని చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడైనా మనిషి శరీరంలో కాల్షియం తక్కువైనా, ఎక్కువైనా చాలా ప్రమాదకరమరని, అందుకే వైద్యుల సూచన మేరకే ఎంత మేర కాల్షియం అవసరం ఉంటుందో అంతే మెయింటెన్ చేయాలంటున్నారు.

calcium deficiency health benefits in telugu

వైద్యులు ఏం చెబుతున్నారంటే.. పురుషులకు ప్రతీరోజు 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం అవసరం ఉంటుందని.. స్త్రీలకు మాత్రం 1200 నుంచి 1500 మి.గ్రా. కాల్షియం తీసుకోవాలన్నారు. ఇక పిల్లల విషయానికొస్తే 1300 నుంచి 2500 మి.గ్రా. కాల్షియం అవసరం ఏర్పడుతుందన్నారు. పైన చెప్పిన మోతాదులోనే కాల్షియం మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో కాల్షియం ఎక్కువైతే కిడ్నీలు వాటిని ఫిల్టర్‌ చేయలేవట.. దీంతో కిడ్నీల్లో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళే కాల్షియం మోతాదు కంటే ఎక్కువ పెరిగితే బీపీ కూడా ఎక్కువ అవుతుందట.. కాల్షియం ఓవర్ అయితే ఎముకలు బలంగా మారకపోగా పెళుసుగా తయారవుతాయి. దీని మూలాన ఏ చిన్న ప్రమాదం జరిగిన ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంది. కావున, కాల్షియం మాత్రలు వాడే వారు ఎప్పటికప్పుడు కాల్షియం చెక్ చేసుకోవాలి. లేకపోతే కాల్షియం ఫుడ్ తీసుకోవాలి. ఆకు కూరలు, కోడిగుడ్లు, పాలు, పెరుగు పదార్థాలు తరచూ తీసుకుంటే కాల్షియం సమస్యను నివారించవచ్చు.

Read Also : Knee Pains Tips : 7 రోజులు ఇలా చేస్తే చాలు.. కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్‌, కాల్షియం లోపానికి చెక్..

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago