Food Recipes

Mamidikaya Drumstick Egg Curry : మామిడికాయ, కోడిగుడ్డు, ములక్కాయ కూర.. ఇలా చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.. అంత టేస్టీగా ఉంటుంది!

Advertisement

Mamidikaya Drumstick Egg Curry :  పచ్చి మామిడికాయ, కోడిగుడ్డు, ములక్కాయ కూర (Egg Drumstick curry) ఎప్పుడైనా తిన్నారా? మామిడికాయ (Raw Mango Curry) ములక్కాయతో  (Drumstick) ఎన్నో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. అయితే, ఒకసారి కోడిగుడ్డుతో కాంబినేషన్ చేసి చూడండి.. చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణంగా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు ఈ రెసిపీ.. ఒక్కసారి చేస్తే ఈ కూరను మళ్లీ మళ్లీ చేయాలి అనుకుంటారు. ఈ కూర పుల్లపుల్లగా తీయతీయగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు.. మామిడికాయ-, ములక్కాడ-, కోడిగుడ్లు-3, ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-1, నూనె, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్-1 టేబుల్ స్పూన్, కరివేపాకు ఒకరెమ్మ, (జిలకర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు) పోపు గింజలు1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1టీ స్పూన్, ఎండుమిర్చి-2,

తయారీ విధానం.. ముందుగా మూడు కోడిగుడ్లు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ములక్కాడను ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత బంగినపల్లి మామిడికాయ తీసుకొని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత పోపు గింజలు, జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి మగ్గనివ్వాలి.

Mamidikaya Drumstick Egg Curry : ములక్కాడ పచ్చి మామిడికాయ కోడిగుడ్డు కూర..

mamidikaya drumstick egg curry in telugu

తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసి ఉడికించిన కోడిగుడ్లను మధ్య మధ్యలో గాట్లు పెట్టి ఆ తాలింపులో వేసి వేయించుకోవాలి. తర్వాత ములక్కాడ వేసి మూత పెట్టి కలర్ మారేంతవరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు (Munagakaya mamidikaya curry)  వేసి కలపాలి. ఈ ముక్కలు మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం ఉప్పు వేసి కలపాలి

మీడియం ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి కూర చిక్కటి గ్రేవీ వచ్చి నూనె పైకి తేలేంతవరకు ఉడికించాలి. టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. సన్నగా తరిమిన కొత్తిమీర పుదీనా కూర పై చల్లి కలిపి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కోడిగుడ్డులోకి ఉప్పు కారం పులుపు పోయి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన మామిడికాయ గుడ్డు ములక్కాయ కూర రెడీ…

Read Also :  Kobbari Mamidikaya Pachadi : కోనసీమ పచ్చి మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడి.. అన్నంలో కలిపి తింటే ఆ రుచే వేరబ్బా..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 weeks ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

3 weeks ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

3 weeks ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

5 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

5 months ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

5 months ago