Food Recipes

Jonna Ambali : జొన్న అంబలి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలుసా? ఎలాంటి రోగాలైనా దరిచేరవు..!

Advertisement

Jonna Ambali :  జొన్నలతో అంబలి తయారు చేసుకొని తాగడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ అంబలి తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే ఈ అంబలి తాగడం వల్ల చక్కటి ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ అంబలి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఈ అంబలి తాగడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి, శరీరంలో వేడి తగ్గుతుంది.

ఇప్పుడు జొన్న అంబలి తయారీ విధానం.. ముందుగా స్టవ్ వెలిగించి, ఒక గిన్నె రైస్ కప్పుతో ఐదు కప్పుల నీళ్లు పోయాలి బాగా మరిగే వరకు ఉంచాలి. మరొక గిన్నె తీసుకొని ఒక కప్పు జొన్న పిండి పోయాలి అందులో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని పలచగా కలుపుకోవడం కోసం మరొక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. మరిగే నీళ్లలో కలిపి పెట్టుకున్న జొన్న పిండిని పోయాలి. ఇప్పుడు అడుగు అంటకుండా, ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి.. కొద్దిసేపు తర్వాత చిక్కబడుతుంది. ఈ అంబలి జొన్న పిండితో కాకుండా జొన్న రవ్వతో కూడా చేసుకోవచ్చు.. రాగి పిండితో కూడా చేసుకోవచ్చు.. చిరుధాన్యాల పిండితో కూడా చేసుకోవచ్చు..

ఈ అంబానీ ఉదయాన్నే తాగాలి అంటే రాత్రి ఉడికించి పెట్టుకోవాలి. సాయంత్రం తాగాలంటే దాన్ని ఉడికించి పెట్టుకోవాలి.. అంబలి ఐదు నిమిషాలు ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు కలపాలి.. అంతే ఎంతో రుచికరమైన అంబలి తయారీ.. ఇప్పుడు ఈ అంబలిని మట్టి పాత్రలో పోయాలి.. రాత్రంతా పులవనిచ్చిన తర్వాత మరుసటి రోజు అంబలి కొంచెం గట్టిగా, జున్నుల తయారవుతుంది.

అంబలిని బాగా కలపాలి. ఇప్పుడు అందులో ఆఫ్ లీటర్ మజ్జిగ పోయాలి. ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలపాలి.. రుచికి సరిపడా అంత ఉప్పు వేసి కలపాలి. జొన్న అంబలి రెడీ.. వేసవికాలం వచ్చింది కదా.. ఆలస్యం ఎందుకు జొన్న అంబలి చేసుకొని తాగుదామా మరి.. మధ్య మధ్యలో ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా రుచికరంగా ఉంటుంది. శరీరానికి ఈ అంబలి చాలా చలవ చేస్తుంది. మట్టి పాత్రలో అంబలిని పోసి 8 గంటల వరకు నానబెట్టిన తర్వాత తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Read Also : Reverse Diabetes Diet : టైప్-2 డయాబెటిస్ పూర్తిగా తగ్గించే అద్భుతమైన డైట్.. నెల రోజుల్లోనే షుగర్ నార్మల్‌కు వచ్చేస్తుంది..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago