Categories: Food RecipesLatest

Alasanda Vadalu : రాయలసీమ స్పెషల్ రెసిపీ… కరకరలాడే అలసంద వడలు, గారెలు మరింత టేస్టీగా రావాలంటే ఇలా చేయండి..!

Advertisement

Alasanda Vadalu :  రాయలసీమ స్పెషల్ వంటకం అలసంద వడలు… రాయలసీమ స్టయిల్లో కరకరలాడే అలసంద వడలు, అలసంద గారెలు మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్ లా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. నాటుకోడి పులుసు, చికెన్ కర్రీ, మటన్ పులుసు, సూపర్ కాంబినేషన్.. అలాగే పల్లి చట్నీ ఎర్ర కారంతో తింటే మళ్లీమళ్లీ తినాలి అనిపిస్తుంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలసంద వడలు పర్ఫెక్ట్ గా రావాలి అంటే.. పిండి ఈ విధంగా చేసుకోండి. అలసంద వడలు ఇలాచేస్తే టేస్టీగా క్రిప్సిగా ఉంటాయి. అలసందలు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. ఇంకెందుకు ఆలస్యం.. ఆంధ్రా స్టైల్ బొబ్బర్లు వడ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు.. అలసందలు 1/2 కేజీ,  నూనె, పచ్చిమిర్చి 2, ధనియాలు 1/2 స్పూన్, అల్లం ముక్కలు 1టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, ఉల్లిపాయలు 2, కొత్తిమీర,  ఉప్పు రుచికి తగినంత..   పసుపు1/2 స్పూన్, వంట సోడా…

తయారీ విధానం..  అలసందలను బొబ్బర్లు అని కూడా అంటారు. అలసందలను ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ లో బరకగా పట్టుకోవాలి. పిండి మెత్తగా చేస్తే ఆయిల్ పీల్చుకుంటుంది క్రిస్పీగా గారెలు రావు అందుకని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, 8 వెల్లుల్లి రెబ్బలు, అరటి స్పూన్ ధనియాలు, రెండు పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకోవాలి వెయ్యాలి. వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచాలి. గ్రైండ్ చేసిన అలసందల పిండిలో వేసుకోవాలి.

alasanda vadalu recipe in telugu

సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన కరివేపాకు రెండు రెమ్మలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఆప్షనల్.. వీటన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసి నూనె వేడి అయిన తర్వాత అరచేతిలో పిండిని తీసుకొని గారెల్లా చేస్తూ వేసుకోవాలి. గారెలను మీడియం ఫ్లేమ్ లో వేగనివ్వాలి. గారెలు సగం వేగిన తర్వాత తీసి పిండి మొత్తం అయిపోయిందాకా అలా చేసుకోవాలి సగం వేగిన గారెలను మళ్లీ వేడి నూనెలో ల్లో వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా రెండుసార్లు వేయించడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అంతే ఎంతో రుచికరమైన రాయలసీమ అలసంద గారెలు రెడీ..

ఎర్ర కారం చట్నీతయారీ విధానం.. ఎండు మిరపకాయలు 15, పెద్ద టమాటో ఒకటి, వెల్లుల్లి రెబ్బలు 10, కట్ చేసిన ఉల్లిపాయ, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ జార్ లో గ్రైండ్ చట్నీ గట్టిగా రాకుండా కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చట్నీ రెడీ…

Read Also : Aloo Paratha Recipe : నోరూరించే ఆలు పరోట.. ఇంట్లోనే ఇలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు.. పిల్లలు ఇష్టంగా తింటారు..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

2 days ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

2 days ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

2 days ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

3 days ago

Surya Bhagavan : ఆదివారమున ఇలా చేసి ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలో రవి బలం పెరిగి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగుపడతారు…

Surya Bhagavan : ఆదివారం సూర్యభగవానుడికి ప్రతిపాత్రమైన రోజు ఎవరికైనా జాతకంలో సూర్యుడు బలం వుంటే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు… Read More

1 week ago

Horoscope 2024 : మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?

Horoscope 2024 : మిథున రాశి ఫలితాలు శ్రీ క్రోధి నామ సంవత్సరం మేశాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు… Read More

1 week ago