
Yoga Poses Could Help Heal Your Pimples Acne Fast
Yoga for Pimples Acne : మెటిమలు, యోగాసనాలు, ముఖంపై మచ్చలు చర్మాన్ని, ముఖ్యంగా ముఖాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచుకునేందుకు, మొటిమలను తగ్గించుకునేందుకు చాలా మంది క్రీమ్స్, మేకప్ వంటివి ఎక్కువగా వాడతారు. ఇవే కాకుండా మోగా సైతం చర్మానికి ఎంతో సహాయపడుతుంది. అందుకు సంబంధించిన వాటిలో కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం.
ఈ ఆసనాల వల్ల ప్రయోజనం :
చర్మానికి సహాయపడే ఆసనాల్లో మొదటిది హలాసనం.. ముందుగా వెల్లకిలా పడుకొని అరచేతులను భూమిపై ఉంచాలి. అనంతరం కాళ్లను 90 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. చేతులను నేల మీదే అలాగే ఉంచి పాదాలను తల వెనక్కి తీసుకెళ్లి నేల మీద ఆనించాలి. లుంబాగో, మెడనొప్పి, హైబీపీ, స్పాండిలైటిస్ ఉన్న వారు ఈ ఆసనం వేయొద్దు. ఇందులో మరొకటి సర్వాంగాసనం.. వెల్లకిలా పడుకొని అరిచేతులను నేలపై ఉంచాలి.
కాళ్లను స్లోగా పైకెత్తి పాదాలను ఆకాశం వైపు ఉంచాలి. అనంతరం నెమ్మదిగా, పెల్విస్, వీపుని సైతం నేల మీద నుంచి పైకి లేపాలి. వీపుకి అరిచేతులతో సపోర్టు ఇవ్వండి. భుజాల నుంచి అరికాళ్ళ వరకూ తిన్నగా ఉండేట్లు చూడాలి. మెడనొప్పి, గర్భిణులు, పీరియడ్స్‌లో ఇబ్బంది ఉన్న వారు ఈ ఆసనం వేయొద్దు. మరొకటి శీర్షాసనం.. మోచేతులను నేలపై ఉంచి, అరి చేతులను ఒకదానితో మరొకటి పట్టుకోవాలి.
అరచేతులు, మోచేతులతో నేలపై ట్రయాంగిల్‌గా చేయాలి. తర్వాత నేలపై తలను ఉంచాలి. అరచేతులతో తలకి సపోర్లు ఇవ్వాలి. బ్యాక్ నిటారుగా ఉంచి నెమ్మదిగా ఒకదాని తర్వాత మరో కాలు పైకెత్తాలి. కాళ్లను ఒకదానితో మరొకటి జాయిన్ చేసి.. కాలి వేళ్లు నేలని చూస్తున్నట్టు ఉంచాలి. మెడనొప్పి, స్పాండిలైటిస్, హైబీపీ, లుంబాగో ఉన్న వారు ఈ ఆసనం వేయొద్దు. వీటితో పాటు పాదహస్తాసనం, కాకాసనం సైతం చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
పండ్లు, కూరగాయలు తీసుకోవడం మస్ట్ :
ఆసనాలు వేయడంతో పాటు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం, వత్తిడికి దూరంగా ఉండటం, రోజుకు సుమారు 8 గంటల పాటు నిద్ర పోవడం వంటి ఆలవాట్లు సైతం చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. వీటిని కేవలం హెల్త్ ఎక్స్‌పర్ట్స్, పలు అధ్యయనాలకు అనుసరించి ఈ పద్దతులు తెలిపాము. ఇవి కేవలం అవగాహనను కల్పించేందుకే. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.
Read Also : Papaya Health Benefits :కరోనా వస్తే బొప్పాయి తీసుకుంటే ఎంత త్వరగా కోలుకుంటామో తెలుసా ?
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.