Fitness

5 Best Yoga Poses : గర్భాశయ ఆరోగ్యం కోసం ఎలాంటి యోగాసనాలు వేయాలి? నిపుణులు ఏం చెప్తున్నారు?

Advertisement

5 Best Yoga Poses : ఇటీవల కాలంలో సంతానలేమి పెరిగిపోవడం మనం గమనించొచ్చు. ఈ క్రమంలోనే సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి. అయితే, సంతాన లేమికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి అనే తెలుస్తోంది. ఆహారపు అలవాట్లు, ఉద్యోగంలో ఒత్తిళ్లు ఇతర కారణాలు కూడా ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ఇకపోతే చాలా మంది ప్రెగ్నెన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుండటమో లేదా వైద్యులు చెప్పిన సూచనలు పాటించకపోవడంతో ప్రెగ్నెన్సీ మిస్ క్యారీ అవుతున్నది. ఈ నేపథ్యంలో గర్భాశయ ఆరోగ్యం కోసం మహిళలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భాశయ ఆరోగ్యం కోసం వారు ఆసనాలు వేయడంతో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.

best yoga poses to increase fertility

ఫైబ్రాయిడ్స్‌ను తగ్గించుకోవచ్చు :
మాతృత్వం భగవంతుడు ప్రసాదించిన అరుదైన వరం. కాగా ప్రతీ మహిళ తల్లి కావాలని అనుకుంటుంది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆరాటపడుతుంటుంది. అయితే, గర్భం దాల్చిన తర్వాత, ముందర కూడా గర్భాశయం పాత్ర కీలకమైనదని చెప్పొచ్చు. నెలసరి ఇబ్బందులు, ఇన్ఫెక్షన్స్ ఇతర సమస్యలు రాకుండా ఉండాలంటే మహిళలు గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాల్షియం సమృద్ధిగా ఉండే మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. తద్వారా ఎముకల పెరుగుదలకు, దృఢత్వానికి హెల్ప్ అవుతుంది. ఫైబ్రాయిడ్స్‌ను తగ్గించేందుకు కూడా ఆ ప్రొడక్ట్స్ సాయపడతాయి.

విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవాలి :
విటమిన్ డి కోసం కాసేపు మార్నింగ్ టైంలో సూర్యరశ్మిలో నిలబడాలి. ఇకపోతే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే నట్స్ తీసుకోవాలి. ఇవి గర్భాశయ కేన్సర్‌ను అడ్డుకోవడంతో పాటు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో జనం విటమిన్ సి పుష్కలంగా ఉండే ఫ్రూట్స్‌ను బాగా తీసుకుంటున్నారు. అయితే, గర్భిణులు సైతం విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవాలి. నారింజ, నిమ్మ, క్యాబేజీ, జామ, కివీ, క్యాప్సికం ఇతర విటమిన్ సి ఫ్రూట్స్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది.

best yoga poses to increase fertility

అలా కంపల్సరీగా విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకుంటే కనుక గర్భాశయ ఇన్ఫెక్షన్స్ అసల మీ దరి చేరవు. ఆహార పదార్థాలు కూడా అంతకుమందు తిన్న మాదిరిగా తింటే కుదరదు. కొంచెం మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడికి చాలా దూరంగా ఉండాలి. ధ్యానం, యోగాతో పాటు చిన్న చిన్న వ్యాయాలు చేయాలి. యోగా ఆసనాలు కూడా వేయాలి. యోగా ఆసనాల ద్వారా శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. దాంతో పాటు శరీరం దృఢంగా మారుతుంది. గుండె సంబంధిత సమస్యలు ధూరమవుతాయి. ఇతర ఆరోగ్య సమస్యలు దరి చేరవు.

best yoga poses to increase fertility

అయితే, గర్భాశయ ఆరోగ్యం కోసం చేసే ఆసనాలు ఇన్‌స్ట్రక్టర్స్ సమయక్షంలో చేయడమే మంచిది. ధండాసన వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఈ ఆసనం ప్రతీ రోజు చేయడం వల్ల శరీరంలోని ప్రతీ అవయవానికి రక్తం చేరుతుంది. ఈ ఆసనంలో సాధారణంగా కూర్చుని రెండు కాళ్లు చాపుకోవాలి. భూమ్మీద నిటారుగా కూర్చొని చేతులు భూమి మీద పెట్టి కాళ్లు చాపుకుని కూర్చోవాలి. ఈ ఆసనం ద్వారా రక్త ప్రసరణ ప్రతీ బాడీ పార్ట్‌కు జరుగుతుంది.

ఈ ఆసనంతో గర్భాశయం దృఢత్వం :
గర్భాశయం దృఢత్వం కోసం మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఆసనం బాగా ఉపయోగపడుతుంది.ఈ యోగాసనం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేగాకుండా బ్లడ్ సర్కులేషన్ ఫాస్ట్‌గా అవుతుంది. ఈ ఆసనం పేరు బద్ధకోణాసనం. ఈ ఆసనం వేయడం ద్వారా మహిళల అండాశయాలు, గర్భాశయం దృఢంగా మారుతాయి. అండాశయ లోపాలు సవరించబడటంతో పాటు వాటికి బలం చేకూరి దృఢంగా మారుతుంది అండాశయం. ఇకపోతే తరచూ గర్భస్రావాలు అయ్యే వారికి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. ఇక ఆసనం వేయడం కూడా చాలా సింపుల్.

మొదలు భూమ్మీద ప్రశాంతంగా కూర్చొవాలి. ఆ తర్వాత రెండు కాళ్లు దగ్గరకు మలచుకుని అరికాళ్లు రెండు కలిసేట్లుగా కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత రెండు చేతులను రెండు అరికాళ్లపైన పెట్టుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల గర్భాశయం, అండాశయం హెల్త్ బాగుంటుంది. విపరీత కర్ణి ఆసనం కూడా గర్భాశయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే, ఈ ఆసనం చేసే ముందర మీరు చేయగలరో లేదో అంచనా వేసుకున్నాకే చేయడం బెటర్.

మంచి రక్తప్రసరణకు ఉత్తమ ఆసనం :
ఈ ఆసనం కొంచెం క్లిష్టమైనది. గోడకు నిటారుగా కాళ్లు చాపాల్సి ఉంటుంది. అందుకు మీ పిరుదులను దిండుపై ఉంచి కాళ్లను నిటారుగా వాల్‌ను తాకించాలి. అనంతరం నడుము, భుజాలు, తల మొత్తం బాడీ నేలపై ఉంచాలి. రెండు చేతులను మీ తలకు రెండువైపులా పెట్టుకుని రిలాక్షడ్ స్థితిలో ఉండేలా చూసుకోవాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాసను వదులుతూ ఉండాలి.. ఇలా చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముందుకు కూర్చి అనే భంగిమ ఆసనం కూడా మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడే ఆసనం. ఒక కాలు వెనక్కు, మరొక కాలు ముందుకు పెట్టి ముందు పెట్టిన అరికాలు భాగాన్ని రెండు చేతులా పట్టుకుని ముందరకు వంగాలి. ఇలా చేయడం ద్వారా బాడీలోని అన్ని పార్ట్స్‌కు బ్లడ్ సప్లై అవుతుంది. దాంతో పాటు పెల్విక్ ఏరియాకు బ్లడ్ సప్లై అవుతుంది.

best yoga poses to increase fertility

పద్మాసనంతో వంధ్యత్వం దూరం :
ఇకపోతే పద్మాసనం గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. యోని ముద్రలో ఈ ఆసనం చేయడం ద్వారా మహిళల వంధ్యత్వ సమస్యలు పరిష్కరించబడుతాయి. ఇక పద్మాసనం ఎలా వేయాలంటే.. ఎడమ పాదాన్ని కుడి తొడపై, కుడి పాదాన్ని ఎడమ తొడపై పెట్టి ఉంచాలి. అనంతరం వెన్నెముక నిటారుగా ఉంచి రెండు చేతుల చివరి వేళ్లను కలపాలి. ఈ యోగాసానంలో రెండు చేతులను నాభి దగ్గరగా తీసుకొచ్చి కళ్లు మూసుకోవాలి. అలా ప్రశాంతంగా కొద్దిసేపు విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఈ సమయంలో చేతులను కేవలం నాభివద్దే ఉంచాలి. పొట్టను తాకనీయరాదు. ఇలా ఐదు నిమిషాలు చేయగలిగితే గర్భాయ లోపాలన్ని సరిచేయబడుతాయి. నాడులన్నీ ఉత్తేజితమై సమస్యలు ఆటోమేటిక్‌గా వాటంతట అవే పరిష్కరించబడతాయి.

Read Also : Pregnant Easy Delivery Asanas : ఈ ఆసనాలు వేస్తే.. డెలివరీ ఈజీ అవుతుందట..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago