Entertainment

Couple Relationship Tips : దాంపత్య జీవితాన్ని దెబ్బతీసే విషయాలు ఏంటి? గొడవలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Advertisement

Couple Relationship Tips : రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వినిపించిన మాదిరిగా ఇద్దరు వ్యక్తులు కలిసి ముందుకు సాగుతునే దాంపత్య జీవితం ముందుకు సాగుతుంది. నూరేళ్ల పాటు దాంపత్యం కొనసాగాలంటే ఆలు, మగలు కలిసి మెలిసి ఉండాలి. అలా వారు ఏళ్ల పాటు కొనసాగాలంటే వారిని కలిపి ఉంచే అంశాలు బోలెడు ఉంటాయి.

ఎన్నో అంశాలు వారిద్దరిని ప్రభావితం చేస్తుంటాయి. ఇద్దరూ మానసికంగా, శారీరకంగా కలిసి మెలిసి ఉండగలిగితేనే వారి జీవితం ఇంకా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో దాంపత్య జీవితాన్ని దెబ్బ తీసే అంశాలేంటి.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాంపత్య జీవితం కలకాలం కొనసాగుతుందనే అంశాలపై ప్రత్యేక కథనం.

ఈగోలు పక్కనపెట్టేయండి :
మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యే భార్యా భర్తల మధ్య పరస్పర అవగాహన చాలా ముఖ్యం. ఒకరినొరకు అర్థం చేసుకుని అభిప్రాయాలను గౌరవించుకోవాలి. ఏదేని విషయమైనా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకోవాలి. పెళ్లైన కొత్తలో ఉన్న ముచ్చటలు తర్వాత ఉండబోవని అనుకోకూడదు. ప్రతీ విషయమై భార్యా భర్తలు చర్చించుకోవడం ద్వారా వారి మధ్య అన్యోన్యత ఇంకా పెరుగుతుంటుంది. అయితే, సాధరాణంగా చాలా వరకు భార్యా భర్తల్లో ఈగో క్లాషెస్ వస్తుంటాయి.

couple relationship tip without dispute in india

ఒకరి కోసం మరొకరు మూవ్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆ సమయంలో ఎవరూ కూడా తగ్గకపోతే సమస్య ఇంకా జఠిలమవుతుంటుంది. కాబట్టి భార్యా భర్తల్లో ఎవరో ఒకరు ఏ విషయమై చర్చించుకుంటున్నారో దాని గురించి వివరించుకోవాలి. ఈగోలు పక్కనపెట్టేసి ఒకరి కోసం మరొకరు ముందుకు రావాలి. ఒకరికొరు మనసెరిగి ముందుకు సాగాలి. అలా సాగినపుడే మీ వైవాహిక జీవితం చాలా కాలం నిలబడగలుగుతుంది.

ఒకరినొకరు అర్థం చేసుకోవాలి :
వైవాహిక బంధంలో స్పర్థలు రాకుండా ఉండాలంటే సర్దుకుపోయే లక్షణాలను కలిగి ఉండాలి. ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకుని పరిస్థితులకు తగ్గట్లు మెదలాలి. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా చెప్పుకోవాలి. ప్రతీ ఒక్క విషయం పంచుకుని అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటే ఇంకా మంచిది. దంపతులిద్దరు కూడా సమాన ధోరణితో వ్యవహరించాలి. సాధారణంగా ఈ విషయంలో చాలా మంది మధ్య గొడవలు వస్తుంటాయి.

తమ పుట్టింట వారిని బాగా చూడటం లేదని భార్య, తమ కుటుంబ సభ్యులను బాగా చూడటం లేదని భర్త అనుకుంటు ఉంటారు. అలా కాకుండా ఇద్దరూ అనగా భార్యా భర్తలు సరైన అవగాహన కుదుర్చుకుని అటు తరఫు బంధువులను, ఇటు తరఫు బంధువులను సమానంగా చూడగలగాలి. అలా ఆ ధోరణితో చూస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. ఇక పడక గదికి వెళ్లినపుడు శృంగారం మాత్రమే చేయాలి. ఆ టైంలో ఆఫీసు, కుటుంబ సభ్యులు, ఇతర విషయాలు డిస్కస్ చేయరాదు.

how to resolve conflict in a relationship

ఎవరో ఒకరు సైలెంట్ అయితే బెటర్ :
ఇకపోతే దంపతులకు ఇతర చాలా విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. అంత మాత్రాన ఆవేశంలో అస్సలే నిర్ణయాలు తీసుకోవద్దు. అలా చేయడం వల్ల గొడవలు ఇంకా పెద్దవవుతాయి. ఈ నేపథ్యంలో గొడవలు జరగకుండా ఉండటానికిగాను దంపతుల్లో ఎవరో ఒకరు గొడవ ( couple relationship tips) జరుగుతున్నపుడు సైలెంట్‌గా ఉండటం బెటర్. అలా మీరు ఆ విషయాన్ని కొద్ది సేపు వాయిదా వేసి ఆ తర్వాత ప్రశాంతంగా చర్చించుకుంటే బాగుంటుంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం మీకే చేటు చేస్తుందన్న సంగతి గుర్తించాలి. ఇద్దరి ఇష్టాఇష్టాలకు తగ్గట్లు వ్యవహారం చేసుకోవాలి. ఎవరికో ఒకరికి నచ్చింది చేస్తే నడవదు.

భాగస్వామిని మోసం చేయరాదు :
ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ గౌరవం. అనగా పెళ్లి అయిన తర్వాత నుంచి భార్యా భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎలాంటి సీక్రెట్స్, అనుమానాలకు అవకాశం లేకుండా అన్నిటినీ పంచుకుంటే ఆదర్శ దంపతులుగా వారు నిలుస్తారు. ఇక వివాహ వ్యవస్థను నిలబెట్టే నమ్మకం, విశ్వాసం ఒకరి పట్ల మరొకరు కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భాగస్వామిని మోసం చేయరాదు.

అనుమానానికి చోటు ఇవ్వొద్దు :
అనుమానం అనే దాన్ని అసలు దరిదాపుల్లోకి రానీయొద్దు. ఎందుకంటే అనుమానం అనేది పెనుభూతం లాంటిది. అది ఒకసారి వచ్చిందంటే చాలు.. పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టేసి భార్యా భర్తలను విడదీసేంత వరకు వెళ్తుంది. ఇకపోతే భార్యా భర్తల మధ్య గొడవలు అనేవి అస్సలు రాకుండా ఉండబోవు. గొడవలు జరగడం అనేది కామన్ ఎలాగో అలాగే పరిష్కారాలు కూడా కామన్‌గా ఉండేలా చూసుకోవాలి.

3 helpful conflict resolution strategies for couples

ఇకపోతే ఒకోసారి గొడవ చాలా పెద్దది అయి ఆవేశంలో భార్యా భర్తల్లో ఎవరో ఒకరు నోరు జారే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే వారు వెంటనే రియలైజ్ అయి సారీ చెప్పడం మంచిది. సారీ చెప్పకుండా అలానే ఉంటే సమస్య మరింత ఎక్కువైపోతుంది. ఈగోలకు పోకుండా సారీచెప్పి సమస్యను సాల్వ్ చేసుకునేందుకు ముందుకు రావాలి.

భార్యభర్తల మధ్య బుజ్జగింపులు ఉండాలి :
అయితే, భార్యా భర్తల మధ్య బుజ్జగింపులు కూడా ఉండాలి. ఏదేని విషయమై గొడవ జరిగినపుడు సారీ చెప్పడంతో పాటు బుజ్జగింపులు కూడా చేస్తుండాలి. అలా చేయడం కూడా ఒక రకంగా భాగస్వామికి ప్రేమ తెలపడం లాంటిదనే గుర్తించాలి. ఇక పురుషులతో పోల్చితే స్త్రీలు కొంచెం సెన్సిటివ్‌గా ఉంటారు. వారిని ఏదేని విషయంతో తొందరపడి ఏమైనా అంటే వెంటనే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాలి. వారు మనం మంచిగా చూసుకున్నా రోజుల కంటే కూడా ఏదైనా అన్న రోజునే బాగా గుర్తుపెట్టుకునే అవకాశాలుంటాయి. కాబట్టి భార్యా భర్తలు పలు విషయాల్లో స్పష్టతతో ముందుకు సాగితేనే వారి వైవాహిక జీవితం ఇంకా ముందుకు సాగిపోతుంది.

Read Also : Coriander Seeds Benefits : ధనియాల్లో ఎన్నో ఔషధ గుణాలు.. ఆరోగ్యం మీ చేతుల్లోనే..? ఉపయోగాలు తెలుసుకోండిలా..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago