
Omicron Alert : Danger Omicron New Variant Virus Most Infectious in Kids, Be Careful Parents about Children
Omicron Virus Alert : ఒమిక్రాన్ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా బెంబేలిత్తిస్తోంది. దక్షిణాఫ్రికా వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వైరస్ చాలా ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది మన దేశంలో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ కంటే చాలా ప్రమాదకారి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తుండగా కొందరికి పాజిటివ్ అని వస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ పేరు వింటేనే గజగజ వణుకుతున్నారు. మొన్నటివరకు ఒమిక్రాన్ పెద్దవారిలో, వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం వస్తుందని వైద్యులు వెల్లడించారు.
తాజాగా ఒమిక్రాన్ గురించి మరో కొత్త విషయం వెలుగుచూసింది. ఈ వేరియంట్ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా పిల్లలపైనే ప్రభావం చూపుతోందని ఆ దేశ వైద్యులు WHOకు సమాచారం అందించారు. చిన్నారుల్లో రెండు సంవత్సరాల వయస్సు నుంచి ఎక్కువ వయస్సు కలిగిన చిన్నారులే అధికంగా ఆస్పత్రుల్లో చేరుతున్నారని వైద్యాధికారులు పేర్కొన్నారు. అయితే, వారిలో సాధారణ, మధ్యస్థ స్థాయి కొవిడ్ లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని డాక్టర్లు రిపోర్టు ద్వారా తేల్చారు. ముఖ్యంగా యూరప్‌లోని చిన్నారులే ఈ వైరస్ బారిన పడుతున్నారు. వీరిలో 5 నుంచి 14 ఏళ్లలోపు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారు. అందువల్లే పేరెంట్స్ తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
ఇంకో విషయం ఏంటంటే.. ఇండియాలో వెలుగుచూసిన డెల్టా వైరస్‌తో పోలిస్తే ఒమిక్రాన్ పెద్ద డేంజర్ ఏమీ కాదని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ పేరెంట్స్ మాత్రం తమ పిల్లల ఆరోగ్యంపై ఓ లుక్ వేసి ఉండాల్సిందిగా చెబుతున్నారు. ఇకపోతే ఒమిక్రాన్ వైరస్ ప్రస్తుతం 57 దేశాల్లో స్వైర విహారం చేస్తోంది. యూకే నుంచి వచ్చిన 366 మంది రోడ్డు ప్రమాదంలో బారినపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి గురించి తెలియాలంటే.. సౌతాఫ్రికాలో 228, జింబాబ్వే 50, అమెరికాలో 40 కేసులు ఉండగా.. ఇండియాలో నేటికి 23 మంది ఒమిక్రాన్ వైరస్ బారిన పడ్డారు. ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు కూడా సాధారణ వైరస్ మాదిరిగానే ఉంటాయని అంటున్నారు. చికెన్ గున్యా తరహాలో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా పిల్లల విషయంలో వైరస్ ప్రభావం నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు.
Read Also : Omicron Symptoms : ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఏమిటి?.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.