Covid-19 Updates

Covid-19 Vaccine : టీకా వేయించుకోలేదా.. తోటివారికి ముప్పు తప్పదు.. షాకింగ్ నిజాలు!

Advertisement

Covid-19 Vaccine prevent from spread infection : టీకా వేయించుకోలేదా.. తోటివారికి ముప్పు తప్పదట.. షాకింగ్ నిజాలు బయటపెట్టారు నిపుణులు. కరోనా కట్టడి చేయాలంటే అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే వారితో పాటు తోటివారికి కూడా ముప్పేనని హెచ్చరిస్తున్నారు. టీకా వేయించుకోవాలంటే చాలామందిలో ఇప్పటికి అపోహలు, అనుమానాలు ఉన్నాయి. టీకా వేసుకుంటే ఏమౌతుందోనన్న భయం వెంటాడుతోంది. దాంతో చాలామంది టీకా వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. టీకా కొరత కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. టీకా పట్ల నిర్లక్ష్యం కూడా పూర్తి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగడం లేదని అంటున్నారు విశ్లేషకులు. కొత్త కరోనా వేరియంట్లకు బాధిత వ్యక్తి శరీరమే కావడం కారణమని చెబుతున్నారు. వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లోని ప్రొఫెసర్ డాక్టర్ విలియం షాఫ్ఫ్నేర్.. వ్యాక్సిన్ తీసుకోని వారు వైరస్‌ వేరియంట్లకు వాహకంగా మారుతున్నారని తెలిపారు.

టీకా తీసుకోవడం తప్పనిసరి :
వ్యాక్సిన్ తీసుకోని చోట.. వైరస్ వృద్ది చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. వైరస్ వేరియంట్ మ్యూటేషన్ అయితే.. మరింత వేగంగా వ్యాపింగలదని హెచ్చరిస్తున్నారు. మ్యూటేషన్లు వైరస్‌ను బలహీనపరుస్తాయి. అందుకే వైరస్ వంటి మహమ్మారులు విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ సెకండ్ వేవ్ తర్వాత మూడో వేవ్ వస్తుందనే ఆందోళనల నేపథ్యంలో పెద్దలతో పాటు చిన్నపిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి పెద్దలకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. చిన్నపిల్లలకు మాత్రం కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అతి త్వరలో పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత బయెటెక్ ఫార్మా సంస్థ చిన్నపిల్లల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. భారత డ్రగ్ రెగ్యులేటరీ కంట్రోల్ నుంచి ఆమోదం లభిస్తే.. భారతదేశంలో కోవాగ్జిన్ పిల్లల్లో అత్యవసర సమయంలో వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంటుంది.

fully vaccinated or not then may cause spread infection to others shocking facts

త్వరలో చిన్నారులకు కరోనా టీకా :
చిన్నారుల్లో కరోనావైరస్ ప్రభావం అధికంగా ఉండే ప్రమాదం ఉంది. ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పెద్దలతో పోలిస్తే చిన్నపిల్లల్లో అనారోగ్య సమస్యలు అధికంగా వచ్చే ముప్పు లేకపోలేదు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో రెండేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. 18ఏళ్ల పైబడిన వయస్సు వారి నుంచి వృద్ధుల వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.

కరోనా మొదటి డోసు వేసుకున్నాక చాలామంది రెండో డోసు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. అలా ఎప్పటికి చేయకూడదు. మొదటి డోసుతో పాటు రెండో డోసు వేసుకుంటేనే టీకా పనిచేస్తుందనే విషయం మరిచిపోవద్దు. మీకు కేటాయించిన కరోనా వ్యాక్సిన్ దాని పరిమితకాలం బట్టి డోసుల మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ప్రకారమే వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింట్లో డోసుల మధ్య గ్యాప్ కూడా వేర్వేరుగా ఉంటుంది.

Covid-19 Vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే ఏమౌతుందో తెలుసా?

కోవిషీల్డ్ అయితే 84 రోజుల మధ్య రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. అదే.. కోవాగ్జిన్ అయితే 30 రోజుల గ్యాప్ మధ్య డోసు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ అందరూ వేయించుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయొచ్చు. కరోనా నియంత్రణలో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా మాత్రమే కరోనాను నియంత్రించగలమని అందరూ గుర్తించాలి. కరోనాను పూర్తిగా నిర్మూలించలేము కానీ, వ్యాప్తిని మాత్రం నియంత్రించగలము.. అది మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది.

కరోనా టీకాపై అపోహలొద్దు :
ఇప్పటికీ చాలామందిలో కరోనా వ్యాక్సిన్ అంటే అపోహ ఉంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడేవారు లేకపోలేదు. ఎవరికో టీకా తర్వాత అనారోగ్యానికి గురయ్యారని తెలిసి వారు కూడా టీకా వేయించుకునేందుకు అనవసరంగా భయపడిపోతుంటారు. నిజానికి కరోనా టీకా వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని గుర్తించాలి. కాకపోతే.. టీకా మొదటి డోసు తీసుకున్న సమయంలో ఎక్కువ శాతం జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి. సాధారణ పెరాసెట్మాల్ మాత్రతో సమస్యను తగ్గించుకోవచ్చు. కొంచెం డిహైడ్రేషన్ అనిపిస్తుంది. ఎక్కువగా నీళ్లు తాగాలి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. రెండు మూడు రోజుల్లో జ్వరం, నొప్పులు వాటింతట అవే వెళ్లిపోతాయి. దీనికి మీరు ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ట్రీట్ మెంట్ కోసం పరిగెత్తినా వ్యాక్సిన్ సంబంధిత అనారోగ్యంంగా గుర్తిస్తే వైద్యం చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే.. వ్యాక్సిన్ వేయించుకున్నాక ఇతర మందులు, ట్రీట్ మెంట్ చేయించుకోరాదు.

యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయంటే :
కరోనా వ్యాక్సిన్ అనేది దీర్ఘకాలం యాంటీబాడీలను ఉత్పత్తి చేయలేదు. కొంతకాలమే యాంటీబాడీలు శరీరంలో ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా యాంటీబాడీలు మాయమైపోతాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాము కదా.. ఇక కరోనా రాదులే అనుకుంటే పొరపాటే.. కరోనావైరస్  వాక్సిన్ వేయించుకోనివారిలోనే కాదు.. వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ వ్యాపిస్తుంది. కాకపోతే.. టీకా తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అదే టీకా తీసుకోని వారిలో అయితే ప్రాణపాయం ఉంది. వారిపై వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది? ఏయే అవయవాలపై ప్రభావం చూపిస్తుందో చెప్పలేం.. కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయొచ్చు.

Read Also : Ayurveda Diet Tips : అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago