పరమ శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన ఈ మాసంలో పూజలు చేయడం వల్ల మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటారు.

ఈ మాసంలో బంధుమిత్రులందరూ చక్కగా ఆనందంగా సమ్మేళనాలు జరుపుకోవడంతో పాటు వన భోజనాలకు వెళ్తుంటారు.

ఇకపోతే అందరూ కలిసి హ్యాపీగా వనభోజనాలకు వెళ్తుంటారు.

అందరు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తుంటారు. ఇలా ఈ చెట్టు కిందనే భోజనం చేయడానికి గల కారణాలు తెలుసా..

జనరల్‌గా ఉసిరికాయల వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

క్షమాగుణానికి ప్రతీకగా ఉసిరి చెట్టును పిలుస్తుంటారు. ధాత్రి చెట్టు అని కూడా ఉసిరిని పిలుస్తుంటారు.

ఈ చెట్టు లక్ష్మీ స్వరూపం కూడా. పురణాల ప్రకారం లక్ష్మీ దేవి ఎక్కడుంటే విష్ణుమూర్తి కూడా అక్కడే ఉంటాడు.

అందుకే మన పెద్దలు ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయాలని చెప్తుంటారు.