మ‌న పూర్వీకులు యాల‌కుల‌ను ఆయుర్వేదంలో వాడేవారు.

ఆధునిక జీవ‌న శైలిలో చాలా మంది రుగ్మ‌త‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు.

వారిలోని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు యాల‌కులు ఆయుర్వేదంగా ప‌ని చేస్తాయి.

యాల‌కుల‌తో ఎక్క‌వగా ఔష‌ధ గుణాలు క‌లిగి ఉంటాయి. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయి.

యాల‌కులు ఎక్క‌వ‌గా మ‌న ప‌క్క‌నే ఉన్న దేశాలు భూటాన్‌, నేపాల్‌, ఇండోనేషియాతో పాటు భార‌త్‌లో ల‌భిస్తాయి.

యాల‌కుల‌ను వంట‌కాల‌లో ఉప‌యోగిస్తారు. సాధార‌ణంగా ఇవి అంద‌రి ఇంట్లో ఉంటాయి.

వంటింట్లో లభించే యాల‌కుల్లోని గుణాలు ఆహారాన్ని జీర్ణం చేయగల శక్తితో పాటు జీర్ణ‌శ‌క్తిని బాగా మెరుగుప‌రుస్తాయి.

అంతేకాకుండా యాసిడ్ రిఫ్లిక్స్ పొగొడుతుంది. యాల‌కుల‌లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం ఉంటుంది.