తమలపాకు.. దీనికి చాలా శ్రేష్టమైనదిగా చెబుతుంటారు. దేవుడి దగ్గర ఈ ఆకులను ఎక్కువగా వాడుతుంటారు.

పూజలు, వ్రతాలు, వాయినాలు ఇచ్చేటప్పుడు, జీర్ణ సంబంధిత వ్యాధులకు, ఆయుర్వేద మెడిసిన్‌లో కూడా తమలపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

కొందరికీ పాన్ (కిల్లీ) తినడం అలవాటుగా ఉంటుంది.

భోజనం చేశాక కిల్లీ వేసుకోకపోతే వారికి కడుపు నిండినట్టు అనిపించదని కొందరు చెబుతుంటారు.

మరికొందరు జర్దా, టోబాకోను తమలపాకుతో కలిపి తీసుకుంటారు. తమలపాకుతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దేవుళ్ల పూజ విషయానికొస్తే హనుమంతుడికి తమలపాకులను మాల వేస్తుంటారు.

తమలపాకుల దండ అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతిపాత్రమైనదని పూజారులు చెబుతుంటారు.

ఇది తాంబూలంగా కూడా స్వీకరిస్తారు. ఈ ఆకుల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి.