
sravana masam lakshmi pooja vidhanam in telugu
Lakshmi Pooja : లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణమాసంలో లక్ష్మీ కటాక్షం వెంటనే కలగాలంటే లక్ష్మీదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం తన భర్త నక్షత్రం శ్రవణా నక్షత్రం కాబట్టి శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మరి ఈ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే వెంటనే మిమల్ని అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలుసుకుని లక్ష్మీదేవి పుట్టుకను బట్టి లక్ష్మీదేవిని పూజిస్తే వెంటనే మీ ఇంట్లోకి ప్రవేశించి నట్టింట్లో కూర్చొని ఆనందతాండవం చేస్తూ మిమ్మల్ని అనుగ్రహించి అష్టలక్ష్మిలను గ్రహాన్ని ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి ఒక్కొక్క మన్మంతరంలో ఒక్కొక్క రకంగా పుట్టిందని పద్మ పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు మనకి వైవస్వత మనవంతర నడుస్తోంది.
ఈ వైవస్వత మనవంతరంలో లక్ష్మీదేవి ఎలా పుట్టిందంటే పాలసముద్ర నుంచి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవిని అభిషేకిస్తుంటే లక్ష్మీదేవి అలా ఆవిర్భవించిందని పద్మ పురాణంలో చెప్పారు ఈ మనవంతరంలో లక్ష్మీదేవి పాలసముద్ర నుంచి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తుంటే పుట్టింది కాబట్టి ఆ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోని శ్రావణమాసంలో కచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో లోపలవైపే ఏర్పాటు చేసుకోవాలి దాన్నే గజలక్ష్మి దేవి ఫోటో అంటారు శ్రావణమాసం రాంగానే ఏ ఇంట్లో అయితే గజలక్ష్మి దేవి ఫోటో గుమ్మం పై భాగంలో లోపలి వైపు పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి వచ్చి ఆనంద్ నాట్యం చేస్తుంది.
అంతేకాదు మీ ఇంట్లో బీరువాకి గజలక్ష్మి దేవి రూపును అతికించుకోండి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి రూపును శ్రావణమాసంలో బీరువాక అతికించుకుంటే మీ బీరువాలో స్థిర లక్ష్మి ఉంటుంది డబ్బు ఖర్చు కాదు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే లక్ష్మీదేవి ఒక్కొక్క మన్మంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని పద్మ పురాణంలో చెప్పారు మనమంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టింది అగ్ని నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణమాసంలో ప్రతిరోజు ఆగ్నేయ దీపం పెట్టండి మీ ఇంట్లో హాల్లో గాని ఏ గదిలో అయినా సరే ఆగ్నేయంలో ఒక దీపం వెలిగేలాగా శ్రావణమాసంలో చూసుకోండి కనీసం ఒక గంట సేపు వెలిగేలాగా చూసుకోండి ఏ ఇంట్లో అయితే శ్రావణ మాసంలో ప్రతిరోజు కనీసం గంటసేపు ఆగ్నేయ మూల దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ధనలక్ష్మి ఆనందతాండవం చేస్తుంది.
అలాగే లక్ష్మీదేవి చాక్షవా అనే మనవంతరంలో పద్మ నించి పుట్టిందని పద్మ పురాణంలో చెప్పారు లక్ష్మీదేవి పద్మాన్నించి పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటో కి పద్మ పుష్పాలతో పూజ చేయండి ఎక్కువ పద్మ పుష్పాలు దొరకపోయినా ఒక్క పద్మ పుష్పమైన సరే లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఓం పద్మప్రియే నమః అని 21 సార్లు చదువుకోండి స్థిరంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే మనవంతరంలో నీళ్ల నుంచి పుట్టిందని పద్మ పురాణంలో చెప్పారు కాబట్టి లక్ష్మీదేవి నీళ్ళ నుంచి పుట్టింది అంటే నీళ్లంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరి ఇంట్లో అయినా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే శ్రావణమాసంలో రోజు ఆ విగ్రహానికి నేలతో అభిషేకం చేయండి అందులోనూ లక్ష్మీదేవికి వట్టివేళ్లంటే చాలా ఇష్టం మనకు వట్టివేళ్ళు అని దొరుకుతాయి లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనవి ఆ వట్టివేల్లు కొన్ని నీళ్లల్లో కలిపి శ్రావణమాసంలో ఆ వట్టివేళ్ళు కలిపిన నీళ్లు లక్ష్మీదేవి విగ్రహం మీద పోయండిమీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.
అలాగే లక్ష్మీదేవి రైవత అనే మనవంతరంలో మారేడు చెట్టు నుంచి పుట్టిందని పద్మ పురాణంలో చెప్పారు చాలా సంవత్సరాల లక్ష్మీదేవి మారేడు చెట్టు కింద తపస్సు చేసి రైతు అనే మనమంతరంలో మారేడు చెట్టు రూపంలోకి మారిపోయింది ఆ తర్వాత మారేడు చెట్టు నుంచే లక్ష్మీదేవి పుట్టిందని రైవత మనమందరంలో చెప్పారు మారేడు నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో మారేడు దళాలు తీసుకుని వాటి గంధం రాసి గంధం రాసిన మారేడు దళాల లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ ఓం బిల్వ నిలయాయై నమః అని 21 సార్లు చదువుకోండి తరతరాలకు తరగని ఆస్తిపాస్తులు లక్ష్మీదేవి మీకు అనుగ్రహింప చేస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలుసుకొని దాన్నిబట్టి పూజించిన వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆ ఇంట్లో ఆనంద నాట్యం చేస్తుంది.
Read Also : Lakshmi Devi : లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు కనిపించే 4 సంకేతాలు ఇవే..!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.