Lord Shiva Pooja with Ummetha Flower in telugu
Lord Shiva Pooja : పుష్పాలకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అని అనుకుంటే పుష్పం యొక్క ముఖ్యతత్వాన్ని అనేక పురాణ గ్రంధాలు పేర్కొన్నాయి పుష్ప మాలే వశీర్ బ్రహ్మహ మద్యచే కేశవః పుష్పగ్రతః మహాదేవ నాయ నమః సర్వదేవ స్థితాదులై పుష్పం మొదట్లో బ్రహ్మ పుష్పం మధ్యమంలో కేశవుడు పుష్పపు కోణాలలో మహాదేవుడు నివసిస్తుంటారు పుష్ప దళాలలో సర్వ దేవతలు ఉంటారని ప్రతీతి నిజానికి ఉమ్మెత్త పువ్వులు అంటే శివునికి ఎంతో ఇష్టం ఒకే ఒక ఉమ్మెత్త పువ్వును శివుని వద్ద ఉంచి మనం కనుక వేడుకుంటే భక్తులకు మోక్షంతో పాటు అన్ని వరాలు సిద్ధిస్తాయి అందుకే శివుడికి కొన్ని ఇష్టమైన పువ్వులతో ప్రత్యేకంగా పూజలు చేస్తారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఉమ్మెత్త పువ్వు అంతేకాదు కేరళలోని శివుని ఆలయాల్లో ఉన్నత పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా రోజు జరుగుతుంది. నిజానికి పెళ్లి కాని వారు పెళ్లి అయిన వారికి మాంగల్య భాగ్యం లభించాలంటే శివునికి ఉమ్మెత్త పువ్వులతో ఖచ్చితంగా పూజ చేయాలి.
అంతేకాకుండా ఉమ్మెత్త పువ్వులతో తయారుచేసిన మాలను శివునికి అర్పించడం ద్వారా కోరుకున్న కోరికలు మన కళ్ళముందే నెరవేరుతాయి. మనం శివుడికి పూజ చేసే ముందు కచ్చితంగా వినాయకుడికి పూజ చేయాలి. వినాయకుడికి ఉమ్మెత్త పువ్వులంటే భలే ఇష్టం పూజ చేస్తున్నప్పుడు వినాయకుడికి ఉమ్మెత్త పువ్వులు సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే దుర్గాదేవిని ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే దరిద్రం దానంతట అదే తొలిగిపోతుంది ఇంకా నవరాత్రి రోజుల్లో ఏడో రోజు సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు కచ్చితంగా ఆరోజు ఉమ్మెత్త పువ్వుతో పూజిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి.
అంతేకాదు సరస్వతి దేవి ముందు రంగోలి వేసి పూజిస్తే సర్వపాపాలు హరించి అనేక లాభాలు కలుగుతాయి సరస్వతి దేవి కటాక్షం కూడా ఉంటుంది అలాగే ప్రదోషకాలంలో శివుడిని అర్చిస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు ఈ ఉమ్మెత్త పువ్వుతో పూజిస్తే ఆ దోషం తొలగిపోతుంది. సర్ప దోషంతో పాటు ఇతర దోషాలు తలగాలంటే ప్రదోష సమయంలో శివుడిని అర్పించాలి. మాసానికి రెండుసార్లు ప్రదోషం వస్తుంది. అంటే అమావాస్యకు పౌర్ణమికి ఒక్కరోజు ముందు ప్రదోషం వస్తుందన్నమాట అలాంటి సమయాలలో శివుడిని దేవతలు స్తుతిస్తారు విశ్వాసం అంతేకాదు అలాంటి సమయంలో శివుడిని ఉమ్మెత్తతో పూజించి దర్శించుకుంటే శివుడి అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం కూడా ఒకేసారి తప్పకుండా లభిస్తుంది.
ముఖ్యంగా ప్రజ దోషం రోజున సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల సమయంలో నందీశ్వరుని కచ్చితంగా పూజించాలి. అంతేకాదు ప్రత్యేకించి ఈ రోజున వ్రతం ఆచరించి సాయంత్రం 6 గంటల తర్వాత భోజనం చేసే వారికి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ధనం పరంగాను మీకు ఎంతో మేలు చేకూరుతుంది నిజానికి శివుడు అభిషేక ప్రియుడు అందుకే ఆ రోజున ఆయనకు పాలాభిషేకం చేయిస్తే చాలా మంచిది. అంతేకాదు బిల్వపత్రాలు కొబ్బరి బొండం నీటితో అభిషేకం చేయిస్తే మనకున్న ఇతి బాధలు తొలగిపోతాయి.
అంతేకాకుండా ఇదే రోజున కనుక మనం ఉమ్మెత్త పువ్వులతో శివునికి అర్చన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఏ డేటు జన్మల పాటు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి బ్రహ్మ హత్యా దోషం కూడా తొలగిపోతుంది వీటితో పాటుగా మరి ముఖ్యంగా శనివారం పూట వచ్చే ప్రదోషాల్లో ఈశ్వరుని కనుక ధ్యానిస్తే ఇతి బాధలు అష్ట కష్టాలు తొలగిపోతాయి శని దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా శివుడికి మామిడిపండ్ల రసంతో స్వామికి అభిషేకం చేయడం వలన ధన ధాన్యాలు కూడా చేకూరుతాయి జీవితంలో ధన ధాన్యాలకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోవాలంటే మామిడి రసంతో శివుడికి అభిషేకం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు పురాణ గ్రంథాలు వక్కనిస్తున్నాయి ఈ విధంగా చేయడం వలన మీకున్న దోషాలు అన్ని తొలగిపోయి సకల సంపదలు కలిసి వస్తాయి.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.