Krishna Janmashtami 2023 : శ్రావణమాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి తిధిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. అయితే, ఈ కృష్ణాష్టమి పర్వదినం రెండు రకాలుగా జరుపుకుంటారు. అందులో ఒకటి.. స్మార్త కృష్ణాష్టమి.. రెండవది వైష్ణవ కృష్ణాష్టమి. ఈ వైష్ణవ కృష్ణాష్టమినే గోకులాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు స్మార్త కృష్ణాష్టమి. ఈ సందర్భంగా గృహంలో శ్రీకృష్ణ పరమాత్మను ప్రత్యేకంగా పూజించడం ద్వారా సకల శుభాలు పొందవచ్చు.
తలస్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో కృష్ణుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ బాలకృష్ణుడి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. వెండి ప్రమిదలు, ఆవు నెయ్యి పోసి 6 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ ఆరు వత్తులు నవగ్రహాల్లో శుక్రుడికి సంకేతంగా చెబుతారు. శ్రీకృష్ణ పరమాత్మ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందిస్తాడని సంకేతంగా 6 వత్తుల దీపాన్ని వెలిగించాలి.
కృష్ణుడికి నీలం రంగు పూలంటే చాలా ఇష్టం. శ్రీకృష్ణ పరమాత్మ అష్టోత్తరం 108 నామాలు చదువుతూ నీలం రంగు పుష్పాలతో పూజ చేయాలి. అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటూ నీలం రంగు పుష్పాలతో పూజ చేయండి. పూజ చేసే వాళ్ళు నీలం రంగు వస్త్రాలు ధరించి పూజ చేయండి. అలాగే, కృష్ణుడి ప్రీతి కోసం పాలు పెరుగు, వెన్నపటిక, బెల్లం నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే.. కృష్ణుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్లు బయట పడాలంటే అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలంటే ఈ స్మార్త కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ పరమాత్మకు అటుకులు నైవేద్యంగా సమర్పించాలి.
ఆ తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్లు కృష్ణుడి పూజలు చేయాలి. కొన్ని నెమలికలు ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలీకలు ధనం దాచుకునే బీరువాలో దాచి పెట్టుకోవాలి. అలాగే కృష్ణతత్వాన్ని కూడా అర్థం చేసుకుంటే.. కృష్ణుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ నల్లటి కుండలో తెల్లటి వెన్నను తింటూ ఉండేవాడు.. నల్లటి కుండ అజ్ఞానానికి సంకేతం.. తెల్లటి వెన్న జ్ఞానానికి సంకేతం.. అంటే అజ్ఞానాన్ని వీడి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పటానికి సంకేతంగా చెబుతారు.
అలాగే, గోపాలకులతో పందెం కట్టి శ్రీకృష్ణ పరమాత్మ యమునా నదిలో ఈదుతూ ఉండేవాడు. పరమార్థం ఏంటంటే.. సంసారం అనేటటువంటి సాగరంలో ప్రతి ఒక్కరూ కూడా ఈదుతూ కష్టాలను దాటుకుంటూ మోక్షం గమ్యాన్ని చేరాలని అద్భుతమైన సందేశాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. అలాగే గోపికలు కడవలతో నీళ్లు తీసుకుని వెళుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ కడవలను రాళ్లతో కొట్టేవాడు. వెంటనే కడవల్లో నుంచి నీళ్లు ధారగా కారిపోతూ ఉండేవి. ఈ కృష్ణ లీలలో ఉన్న అంతరార్థం ఏంటంటే.. అక్కడ వారి శరీరానికి సంకేతం అందులో నుంచి కారుతున్నటువంటి నీళ్లు అహంకారానికి సంకేతంగా చెబుతారు. శరీరంలో అహంకారాన్ని పూర్తిగా తొలగిపోయినప్పుడే.. పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది.
శ్రీకృష్ణ పరమాత్మ నెమలి ఈకలను ధరిస్తాడు. అంతరార్థం ఏంటంటే.. కామం తెలియని నిర్మల ప్రాణి నెమలి. అహంకారము లేనటువంటి ప్రాణి నెమలి.. 16వేల మంది గోపికలతో తనకు ఉన్నటువంటి సంబంధం అనేటటువంటిది ప్రేమపూర్వకమైనది, భక్తి పూర్వకమైనది మాత్రమేనని చెప్పటానికి సంకేతంగా చెబుతారు. నెమలి తత్వానికి సంకేతంగా నెమలిపించాలను శ్రీకృష్ణ పరమాత్మ ధరిస్తాడు. పిల్లన గ్రోవి లోపల చూస్తే.. మొత్తం ఖాళీగా ఉంటుంది అంటే.. శరీర భావన విడిచిపెట్టి ఆత్మసాక్షాత్కారం ప్రతి ఒక్కరూ పొందాలని పిల్లనగ్రోవిని ధరించి అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు.
కృష్ణ లీలను అర్థం చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్లయితే కృష్ణుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రధానంగా స్మార్త కృష్ణాష్టమి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకుంటే శ్రీకృష్ణుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. శక్తివంతమైన శ్లోకం నమః కృష్ణయ్య శివాయ బ్రహ్మణే అనంతమూర్తి యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గతః ఈ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధనచేశాక చదువుకుంటే.. కృష్ణుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.