Guru Purnima 2023 : మీ ఇల్లు కనక వర్షంతో నిండిపోవాలంటే.. ఈ ఆకు తినాల్సిందే.. ఒక గంటలో మంచి శుభవార్తలను వింటారు. జులై 3న వచ్చిన ఈ గురు పౌర్ణమిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. హిందూ శాస్త్రం ప్రకారం.. ఆషాడ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. ఈరోజు వ్యాసమహాముని జన్మదినం. ఈరోజును మహా పర్వదినంగా అనాదికాలం నుంచి భావిస్తూ ఉన్నారు. ఈరోజు గురు భగవానున్ని వ్యాసమహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరతాయని నమ్మకం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది. అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురుశిష్య సంబంధాలు చాలా అరుదు. గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆది గురువైన మహాశివుడు ఆషాడ పవనమినాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తోంది.
ఆషాడంలో గురుపౌర్ణమి రోజున దత్తాత్రేయడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్తుంది. దశ మహాముని ఈ రోజున సత్యవతి సంతనులకు జన్మించాడని అంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను సామ అధర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. అయితే, పురాణాల కాలం నుంచి కూడా నేటి వరకు గురువు అనగానే వ్యాసమహర్షినే మొదటగా పూజిస్తారు. ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించడమే కాదు.. పండుగలాగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా అనవాయతీగా వస్తోంది. ఇలా గురు భగవానున్ని స్మరించుకుని గురుపూర్ణిమనాడు పూజలు చేస్తే.. తమకు సకల సంపదలు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతూ ఉంటారు. గురు పౌర్ణమి చాతుర్మాస్య దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు.
ఈ ఏడాది గురు పూర్ణిమ జులై 3 సోమవారం రోజున వస్తుంది. ఎంతో విశిష్టత ఉన్న ఈ గురు పౌర్ణమి రోజున ఏ ఆకు తింటే గంటలో మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుందో తెలుసా? పౌర్ణమి రోజు పూర్ణచంద్ర బలంతో చంద్రుడు ఉంటాడు. పూర్ణచంద్ర బలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనసు రకరకాలుగా మారుతుంది. ఇదే సమయంలో సముద్రం ఆటుపోటుకు గురి అవుతూ ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజున చంద్రుడు ప్రభావం మన శరీరంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సైన్స్ ప్రకారం కూడా నిరూపితమైంది. పౌర్ణమి రోజు సముద్రం ఎంత అలజడిగా ఉంటుందో మన మనసు కూడా కొంత అలజడికి గురి అవుతూ ఉంటుందిని శాస్త్ర పండితులు చెబుతున్నారు.
మన విజయాలకు కారణం మన ఆలోచనలే. మరి ఈ పౌర్ణమి రోజున అంటే ఈ ఆషాడ పౌర్ణమి రోజున మన మనసు పరిపరి విధాలుగా మారకుండా నిలకడగా ఉండటం కోసం ఈ ఒక్క ఆకును తింటే చాలు.. మీ మనసు నిలకడగా ఉంటుంది. మీకు మీ జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అంతేకాదు ఒక గంటలోనే మీరు మంచి శుభవార్తలను వింటారు. డబ్బును పొందుతారు. ఈ ఆకును మీరు ఈ గురు పౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలో తినాలి. ఈసారి గురు పౌర్ణమి సోమవారం వచ్చింది. సోమవారంలో రాహుకాలం అనేది ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు ఈ ఆకును తింటే.. చంద్రుడి చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అంతేకాదు ఈ ఆకును తినటం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి.
గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే ఒక తమలపాకును తీసుకుని దానిపై చిన్న బెల్లం ముక్కను పెట్టి ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు ఉంచండి. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేసుకుంటారు. ఈ ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు పెట్టి పూజ. కూడా చేయండి. తమలపాకు బెల్లం కలిపి తినడం వల్ల మీ శరీరం ఉత్తేజం చెందుతుంది. అంతేకాదు, తమలపాకు తినటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు పటాపంచలైపోతాయి.
జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. గురు పౌర్ణమి రోజున ఈ తమలపాకు బెల్లంతో పాటుగా ఇంకొక పదార్థం తినడం వల్ల కూడా చంద్రుడి చెడు ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. ఆదివారం రాత్రి సెనగలను నానబెట్టి వాటిని సోమవారం వండి నైవేద్యంగా శివుడికిని నివేధించిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ శనగలను తినకుండా బయట వారికి ప్రసాదంగా పంచిపెట్టండి. సోమవారం శనగలను శివుడికి నివేదనగా సమర్పిస్తే.. మీ కోరికలు నెరవేరుతాయి. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకును తినటం వల్ల మంచి ఆరోగ్యాలతో పాటు మానసిక తృప్తి కూడా చెందుతారు. ఈ ఆకు మనసు అదుపు తప్పకుండా చేస్తుంది. మీ ఆలోచనలు నిలకడగా ఉంచుతుంది.
ఈ సోమవారం రోజున రాహుకాలం ప్రారంభం కాకముందే పూజను పూర్తి చేసుకోండి. అలాగే, రాహుకాలం ప్రారంభమైన తరువాత తమలపాకు బెల్లాన్ని తిని మీ ఆలోచనలను మరింత మెరుగుపరుచుకోండి. అలాగే శివుడికి శనగలను సమర్పించి ఇంట్లోని వారందరూ కూడా శనగలను తినకుండా ప్రసాదంగా బయటి వారికి పంచిపెట్టండి. తమలపాకు బెల్లాన్ని పిల్లలకు తినిపించడం మరీ మంచిది. మీరు మాత్రం ఇంట్లో దేవుడికి నివేదించిన శనగలను మాత్రం తినకండి. అలాగే గురు పౌర్ణమి రోజు సాయంత్రం అస్సలు మర్చిపోకుండా పౌర్ణమి ఘడియల్లో ఇలా చేయండి. అప్పుడు మీకు చంద్రుడు అనుగ్రహం కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా శ్రేయస్సుతో ఉంటారు. గురు పౌర్ణమి సాయంత్రం పౌర్ణమి గడియల్లో ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో చిన్న ముక్క బెల్లం వేసి 5 లేదా 6 యాలకులను వేయండి. ఆ గ్లాసులు చంద్ర కిరణాలు పడే ప్లేస్‌లో అంటే.. ఇంటి డాబాపై పెట్టండి.
కొంతసేపైన తర్వాత ఆ పాలను త్రాగండి. ఇలా గురుపౌర్ణమి రోజున చేయటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు అంచలంచలుగా వృద్ధి చెందుతుంది. అంతేకాదు, చంద్రకిరణాలు పడిన ఈ పాలు త్రాగటం వల్ల మీకు అపారమైన శక్తి కూడా వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు ఉదయం రాహుకాలంలో తమలపాకు బెల్లం తినాలి. అలాగే సాయంత్రం పౌర్ణమి గడియాల్లో పాలల్లో యాలుకలు వేలాన్ని వేసి త్రాగాలి. ఇలా చేస్తే.. మీకు ఉన్న సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. అతి ముఖ్యంగా ఈ రోజున రాహుకాలంలో తమలపాకు బెల్లం తినడం వల్ల మీరు గంటలో శుభవార్తను వింటారు. లేదా మీరు డబ్బును పొందుకుంటారు. గురు పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఆయురారోగ్యాలతో పాటు సిరిసంపదలు కూడా చేకూరతాయి. మర్చిపోకుండా జులై మూడున వచ్చే గురుపౌర్ణమి రోజున రాహుకాలంలో తమలపాకు బెల్లాన్ని కలిపి తిని సంపదలను ఆయురారోగ్యాలను మీ సొంతం చేసుకోండి.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.