
Adhik Sravana Masam 2023
Adhika Shravana Masam 2023 : ఈ ఏడాదిలో అధిక శ్రావణ మాసం వచ్చింది. ఈ అధిక మాసం రావడంతో ప్రత్యేక మాస నియమాలను చేయాల్సి ఉంటుంది. ఈ మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తే.. మంచి ఫలితాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం. అధికమాసం అంటే ఏమిటి.. ఈ అధికమాసంలో మనం ఏం చేయాలి? ఏం చేస్తే.. సమస్త పనులలో విజయం సాధించగలమంటే.. అధికమాసంలో తప్పనిసరిగా పాటించవలసిన పనులలో ప్రధానమైనది.
భక్తిప్రపత్తులతో భక్తి కార్యక్రమాలను వినడం, చూడడం, భక్తి భావాన్ని మనసులో పెంచుకోవడం చేయాలి. అంతేకాదు.. పరమాత్ముడి అనుగ్రహాన్ని పట్టేసుకోవాలి. అంటే.. సులభమైన మార్గం భక్తిని మనసు నిండా నింపుకోవడమే.. పరమాత్ముడిని మనసులో నిలుపుకొని ఇష్ట దైవ నామాన్ని స్మరించుకోవడమే.. ఇష్టదేవాన్ని స్మరించుకుంటూ మౌనవ్రతం ఉపవాస వ్రతం, పదిమందికి సాయం చేయడం, ప్రశాంతంగా జీవితాన్ని గడపడం, ఒక మంత్రాన్ని స్వీకరించి నిరంతరం జపం చేయడం అనే 4 విధానాలలో స్వామిని స్మరించుకోవాలి.
భక్తిని మనసులో నిలుపుకోవాలని కూడా మన సంప్రదాయం చెబుతుంది. వారాధిపతి బుధవారం నుంచి కూడబెట్టుకుంటూ వచ్చినటువంటి కర్మ విశేషం మనం చేసిన కర్మలకు అనుకూలంగా పుణ్యమైతే మంచి జన్మ కలుగుతుంది. పాపం అయితే.. కొంచెం దుఃఖశాదికరమైనటువంటి జన్మని పొందుతాం. జన్మ ఉత్తమమైనప్పటికీ మానసిక స్థితి కష్టంగా ఉన్నది అంటే.. పూర్వ జన్మలో ఏదో మనం పాపం చేసి ఉంటామని గ్రహించాలి. అదే జంతు జీవనం మనకు లభిస్తే.. అది కూడా కొంత పుణ్య విశేషమే కానీ, జ్ఞానం కలిగి ఉన్నటువంటి మానవజన్మ ఉత్తమమైనది. మానవ జన్మ లభించినప్పుడు దుఃఖం కలిగింది అంటే.. చేసిన కర్మ తీవ్రమై ఉంటుంది అని అర్థం చేసుకోవాలి.
అలాంటి కర్మ విభాగ సంబంధమైన జ్ఞానాన్ని పెంచుకొని చేసే పనులలో ఇకనుంచి అయినా మంచి పనులు చేయాలి. భగవాన్ నామాన్ని స్వీకరించి ఆ నామాన్ని పదే పదే జపం చేసే నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ జపాలను కూడా ఒక రోజులో 1440 నిమిషాల కాలం ఉంటుంది. 24 గంటలలో గంటకు 60 నిమిషాలు చొప్పున ఒకరోజున ఉండేటటువంటి 1440 నిమిషాల కాలంలో మనం తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసను నిమిషానికి 72 సార్లు చేస్తుంటాం.
ఇందులో 72 అంటే.. మళ్లీ 144 ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలను ఇలా గమనిస్తే 1440 నిమిషాలు పూర్తి అవుతాయి. ఆ 1440 అనే ప్రమాణాన్ని స్వీకరించి ఇష్టదైవ నామాన్ని జపం చేస్తూ ఉండాలి. ‘ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ’ శ్రీమాత్రే నమః’ గణపతి యే నమః అని ఏదైనా దైవ నామాన్ని స్మరించుకోవడం చేయాలి. ఇలా చేయడం ద్వారా దైవానుగ్రహం కలిగి అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చు.
Read Also : Remedy For Attract Money : మీ ఇంట్లో సకల సంపదలు కలగాలంటే గుమ్మానికి ఈ తోరణం కట్టాల్సిందే..!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.