Overcome Low Self-esteem : అతిగా భయపడుతున్నారా? అదేపనిగా ఆందోళన చెందుతున్నారా? అయితే ఆలోచించాల్సిందే.. మీరు మానసిక సమస్యతో బాధపడుతున్నట్టే.. మీపై మీకు ఎప్పుడైతే అపనమ్మకం ఏర్పడుతుందో ఇలాంటి భయమే మిమ్మల్ని అవహిస్తుంది. సమస్యను మరింత పెద్దదిగా చూపిస్తుంది. ప్రతి చిన్న సమస్యను చూసి భయపడుతున్నారంటే.. మీలో ఫొబియా తారా స్థాయికి చేరుకుందని అర్థం. మీలో ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలను గుర్తించారా? అయితే మీకు ఈ ఫోబియా సోకినట్టే. ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడూ వారిలో ఈ ఆందోళన, భయం చుట్టేస్తాయి. సరిగా ఆలోచించనివ్వవు. ధైర్యాన్ని కోల్పోతారు..
ప్రతి చిన్న సమస్యను భూతాద్దంలో పెట్టి చూస్తుంటారు. ఏ పనిచేసినా వారికి నచ్చదు. ఇతరులకు నచ్చినా చేసిన పనికి మెచ్చుకున్నా వారిలో ఏమాత్రం సాధించాననే భావన కలగదు. పక్కవారికి వారిపై ఉన్న విశ్వాసం వారిపై వారికి ఉండదు. అదే వారిలో పెద్ద సమస్య.. ఈ సమస్య నుంచి ఎప్పుడైతే బయటపడుతారో అప్పుడే వారిలో ఎక్కడలేని ధైర్యం, తెగువ అలవడుతాయి. మీపై మీకు ఇష్టం లేనప్పుడే మీపై మీకు అసహ్యం కలుగుతాయి. ఇలాంటి సమస్యను చాలామంది ఎదుర్కొంటుంటారు.. పైకి అందరిలా సాధారణ వ్యక్తిలా కనిపించినప్పటికీ లోోలోపల మాత్రం వారిలో అభద్రతాభావం కలిగి ఉంటారు.
ఎందుకు ఇలా జరుగుతుందంటే..
మీపై మీరు విశ్వాసం కోల్పోవడమే.. ప్రధాన కారణం.. ఈ సమస్య నుంచి బయటపడలేమా అంటే.. తప్పకుండా బయటపడొచ్చు.. అందుకు తమపై విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలు చేయాలి.. ఏ పనిచేస్తే తమలో ధైర్యంగా అనిపిస్తోందో అలాంటి పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. తమకు సాధ్యం కాదు అనే నెగటివ్ ఆలోచనలు ముందుగా మైండ్ లోనుంచి తీసేయాలి.. అప్పుడే వారిలో ఆ పనిని చేసేందుకు మనస్సును ప్రేరిపించడం సాధ్యపడుతుంది. తమపై తమకు నమ్మకం కలగాలి. అలాంటి పనులే చేయాలి. నేను చేయగలను అనే భావన వాారిలో కలగాలి.. తన శక్తిని తాను తెలుసుకోగలగాలి.. అప్పుడే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తద్వారా మిగతావారిలా అన్నింటా విజయాలను సాధించగలరు.
మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు :
తమ విషయంలో ఏది నెగటివ్ గా జరిగినా అది తమ కారణంగానే అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది వారిని మరింత కిందికి పడేస్తుంది. తమను తాము నిందించుకోవడం సాధ్యమైనంతవరకు మానుకోవాలి.. ఏ పని అయినా ఏ సమస్యతోనైనా ఒక రాత్రిలోనే విజయాలు రావు.. ఓటమితోనే ఏ విజయమైనా ప్రారంభం అవుతుంది. అలాంటి విజయాలే ఎక్కువగా అందరికి గుర్తుండిపోతాయి. మీపై మీరు విశ్వాసాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేయాలి.
అలాంటి ప్రేరణ కలిగించే పుస్తకాలు గానీ లేదా మీ రోల్ మోడల్ అయిన వారి వ్యక్తిగత జీవితాలను వారు సాధించిన లక్ష్యాలను గురించి తెలుసుకోవడం ద్వారా మీరు కూడా ఏం చేయగలరో ఎక్కడ తప్పుగా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. ఏదైనా చిన్న పనితో ప్రారంభించండి.. తొలి విజయం మీలో రెట్టింపు విశ్వాసాన్ని అందిస్తుంది. మరో పని పూర్తి చేసేందుకు ప్రేరణ ఇస్తుంది..
మీ రోల్ మోడల్ ఎవరు? :
మీకు రోల్ మోడల్ ఎవరు.. ఎవరంటే బాగా ఇష్టపడతారు. వారు సాధించిన విజయాలను విన్నప్పుడు లేదా చదివినప్పుడు ఎలా మీరు ఫీలవుతుంటారు. అలాంటి స్పూర్తిని కలిగించే వారికి సంబంధించిన విషయాలను ఎక్కువగా చదువుతుండాలి. ఏదైనా పనిచేసే ముందు మీ రోల్ మోడల్ ను ఒకసారి ఊహించుకోండి.. మీ స్థానంలో వారే ఉంటే ఏం చేసేవారో అలాగే మీరూ ఆలోచించుకోండి.. అలానే ధైర్యంతో ముందుకు అడుగు వేయండి. అప్పుడు మీలో ఏదో ఒక పవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అదే మీ విజయానికి తొలిమెట్టుగా భావించాలి.
నెగటివ్ మాట్లాడేవారికి దూరంగా ఉండండి :
పాజిటివ్ వాతావరణంలోనే ఉండేందుకు ప్రయత్నించండి. ఎక్కువ సమయం ఆ వాతావరణంలోనే గడిపేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే.. పాజిటివ్ వ్యక్తులతోనే మాట్లాడండి.. నెగటివ్‌గా మాట్లాడే వ్యక్తులతో దూరంగా ఉండండి.. వారే మీలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు.. మీరు చేయగలిగే పనిని కూడా అడ్డుకుంటారు. వారి మాటలకు మీరు ప్రభావానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి మాటలు మీపై ఎక్కువగా పనిచేస్తాయి. మీరు చేసే పనిపై ఆసక్తి కోల్పోతారు.. విశ్వాసం కోల్పోతారు. నెగటివ్ మాటలకు.. నెగటివ్ వ్యక్తులకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు మానసిక నిపుణులు.
మీ ప్రయత్నం మీరు చేయండి :
మీ ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఏంటో మీకు తెలుస్తుంది. ఏ పని మొదలుపెట్టినా ఎవరో చెప్పారని వదిలేయొద్దు. నమ్మకంతో ముందుకు సాగండి.. అదే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మీరు చేసే పనిపైనే దృష్టిపెట్టండి. అదే విశ్వాసంతో పనిని ముందు పూర్తి చేయండి.. ఫలితం గురించి ఆలోచించొద్దు. మీరు చేసే పనిలో ఎలాంటి లోపం లేకుంటే ఫలితం దానింతట అదే వస్తుంది.. అదే మీ గెలుపుకు నాంది అవుతుంది. అదే స్పూర్తితో మరో ప్రయత్నం చేయండి.. ఎప్పటికప్పుడూ మీ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి.. మీలో ఎంతశక్తి ఉందో తెలుస్తుంది.
మీలో శక్తి మీకు తెలియాలంటే మీపై మీకు నమ్మకం, విశ్వాసం పెరగాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించేందుకు వీలుపడుతుంది. నమ్మకంతోనే ఏదైనా సాధించగలమని గుర్తించుకోవాలి. ప్రతిఒక్కరూ ఓటమితో తమ విజయాలను సాధిస్తారు. విజయాలకు ఓటములే నాందిగా తెలుసుకోవాలి. మీ ప్రయత్నాల్లో అనేక ఆటంకాలు రావొచ్చు. వాటిని ఎదురునిలిచి పోరాడినప్పుడే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలరని గుర్తించుకోవాలి. పెద్ద లక్ష్యాలతో పాటు చిన్న లక్ష్యాలను కూడా సెట్ చేసుకోండి. అందులో ఏది ముందుగా పూర్తి చేయాలో నిర్ణయించుకోండి. అప్పుడు మీకో క్లారిటీ వస్తుంది.
చిన్న లక్ష్యాల నుంచి మీ ప్రయత్నాలను మొదలుపెట్టొచ్చు. ఎందుకంటే తక్కువ సమయంలో తొందరగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. తద్వారా మీలో విజయం సాధించామనే ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అది మీలో పెద్ద లక్ష్యాలను సాధించగల శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. మీ లక్ష్యంపై మీకు అవగాహన ఉండాలి. అది ఎలా మొదలుపెట్టాలో ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో తెలియాలి. మధ్యలో అటుపోటులు ఎదురైతే నిరాశపడకూడదు. అదే స్థైర్యంతో ముందుకు సాగాలి. ఫలితం ఏదైనా సరే గెలుపే లక్ష్యంగా సాగాలి.
విమర్శలే ఆశీర్వాదాలు:
ఏదైనా ఒక పనిచేసేటప్పుడు విమర్శలు వస్తుంటాయి. చాలామంది ఆ విమర్శలకు భయపడి చేయాలనుకున్న పనిని మధ్యలోనే ఆపేస్తుంటారు. అలా చేయకూడదు. మీలో చేయాలనే తపనతో పాటు సంకల్పం బలంగా ఉండాలి. అప్పుడే మీ పనిలో విజయం సాధించగలరు. విమర్శకులు ఏమంటారోననే భయంతో పనిమీద ఏకాగ్రతను కోల్పోవద్దు. ఫలితం ఏదైనా సరే.. లక్ష్యం వైపే మీ పయనం సాగాలన్నది గుర్తించుకోవాలి. మీపై అపనమ్మకం కలిగినప్పుడే పక్కవాళ్లు ఏమనుకుంటారోననే ఆందోళన కనిపిస్తుంటుంది.
ఎప్పుడైతే మీపై మీరు ధైర్యంగా ఉంటారో అప్పుడు విమర్శకులు సైతం మీ విజయానికి దాసోహం అనాల్సిందే. మీ శక్తిని కూడగట్టుకోండి. మీ పట్టుదలే లక్ష్యంగా ముందుకు సాగండి. మీరు అనుకున్నది సాధించాలంటే కొంచమైనా తెగింపు ఉండాలి. అపజయాన్ని ఆస్వాధించగల నేర్పు ఉండాలి. విమర్శను ఎప్పుడైతే మీరు ఒక ప్రశంసగా స్వీకరిస్తారో అది కూాాడా మీకు మంచి ప్రేరణ అందిస్తుందని గుర్తించుకోని ముందుకు సాగండి.. ఇక మీదే విజయం.. మిమ్మలన్నీ ఇక ఎవరూ ఆపలేరంతే.
మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి..
నెగటివ్ ఆలోచనలను దరిచేరనివ్వొద్దు.. పాజిటివ్ ఆలోచనలతోనే ముందుకు సాగండి.. ఒకవేళ నెగటివ్ ఆలోచనలు వచ్చినా పనికి ఆటంకాలు ఎదురైనా వాటిని పాజిటివ్ ధోరణీలోనే ఆలోచించండి.. తద్వారా మీలో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. చేసే పనిపై నమ్మకాన్ని కలిగిస్తుంది.. ఇలా చేస్తే తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలరు.. నమ్మకంతో ముందుకు సాగండి.. నెగటివ్ ఆలోచనలే మనిషిని శక్తిహీనం చేస్తాయి. అవే మన అపజయాలకు కారణాలు అవుతుంటాయి.నెగటివ్ ఆలోచనలతో ఏ పనికూడా చేయకూడదు.
పాజిటివ్ ఆలోచనలతోనే పనిని ప్రారంభించాలి. పాజిటివ్ ఆలోచనలే మీ పనికి ఆటంకాలను కలగనివ్వకుండా ముందుకు సాగేలా చేస్తాయి. నెగటివ్ థింకింగ్ ఆలోచనలతో ఏ పని చేసినా అందులో ఎక్కువగా నెగటివిటీ చేరడం ద్వారా ఫలితం కూడా అలానే వస్తుందనేది అక్షర సత్యం.. పాజిటివ్ ఆలోచనలే మీ విజయానికి పెట్టుబడిగా భావించాలి. అదే మీకు శ్రీరామ రక్ష..
Read Also : Diabetes : ఇలాంటి విత్తనాలు తిన్నారంటే.. జీవితంలో షుగర్ రానేరాదు!
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.