
Cheating Partner Revenge : మీ పార్టనర్ చీట్ చేస్తున్నారనే అనుమానం వచ్చిందా? వారి ప్రవర్తనలో తేడా అనిపిస్తోందా? పార్టనర్ పై రీవెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నారా? కాస్తా ఆగండి..
మీరు అదే తప్పు చేయొద్దు. ఒకవేళ మీ పార్టనర్ చేసిన తప్పు మీరు కూడా చేస్తే దాంపత్య జీవితంలో అనేక సమస్యలకు దారితీస్తుంది. పార్టనర్ మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? రీవెంజ్ తీర్చుకోవాలనే బలంగా ఫీలవుతున్నారా? ముందు ఒక విషయం గుర్తించుకోండి.
మిమ్మల్నీ చీట్ చేస్తున్న పార్టనర్ ను గట్టిగా నిలదీయాలంటే మీరు ప్రశ్నించే స్థితిలో ఉండాలి. అదే తప్పు మీరు కూడా చేస్తే.. వారిని మీరు ప్రశ్నించలేరు.. నిలదీయలేరు.. పైగా వారు కూడా మిమ్మల్నీ ఎదురు ప్రశ్నిస్తారు. నేను చేశానని నన్ను అంటున్నావు.. మరీ నువ్వు చేసింది ఏంటి… అని పైగా వారే మిమ్మల్ని నిలదీస్తారు. తప్పును ప్రశ్నించేది బోయి అదే తప్పుతో మీరు తలదించుకున పరిస్థితి ఎదురవుతుంది.
రీవెంజ్ భావన మంచిది కాదు :
అందుకే మీరు రీవెంజ్ తీర్చుకోవాలనే భావన పక్కనే పెట్టేయండి. వారి తప్పును వారికి గుర్తుచేసి మీకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. వారి తప్పును తెలియజేయండి. అలా కాదని వారిలానే మీరు ప్రయత్నిస్తే.. ఇబ్బందులు పడేది మీరే.. తద్వారా మరింత మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఫలితంగా లేనిపోని అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మీ పార్టనర్ చేసని తప్పును సమర్థించుకుంటూ మీ తప్పును పదేపదే ఎత్తిచూపుతుంటారు. అప్పుడు మీపై మీకే కోపం వస్తుంది. చిటికిమాటికి చిరాకుపడిపోతుంటారు. నేనూ మోసపోయాను.. అది తలచుకుని నేనూ మోసం చేశాననే భావన మిమ్మిల్ని పట్టిపీడుస్తుంది. ఇది మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుంది. తల్లిదండ్రుల ప్రవర్తనతో చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే వారి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
మీ పార్టనర్ పై ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా మీ మనస్సు అయిన గాయం తగ్గదు. అది ఎప్పుడూ మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. మీ పార్టనర్ తో ఆగిపోదు. ఇతర కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్నీ ఎదురు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. మానసికంగా ప్రశాంతతను కోల్పోతారు. ఒకరిని చూసి ఒకరు పోటీపడి చీటింగ్ చేసుకుంటే అది మీ జీవితాన్ని దెబ్బతీస్తుంది. సామాజికంగా ఇద్దరు కలిసి జీవిస్తున్నట్టుగా ఉంటారు తప్ప ఎవరి జీవితం వారిది అన్నట్టుగా ఉంటుంది. ఇలా జీవితాంతం ఉండాల్సిందేనా? అంటే.. మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి.
కలిసి ఉండాలా? లేదా విడిపోవాలా?
అది కలిసి ఉండాలా? లేదా విడిపోవాలా? అని తేల్చుకోండి. సాధ్యమైనంతవరకు బాంధవ్యాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించండి.. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మంచిగా కలిసి ఉండేందుకు ప్రయత్నించండి. అవసరమైతే పెద్దల ప్రమేయంతో సమస్యను పరిష్కరించుకోండి. అయినా పరిస్థితి మారకుంటే చివరిగా విడిపోవడం వంటి నిర్ణయం తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఏ నిర్ణయం తీసుకున్న ముందు మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలోపెట్టుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.
అది మీ జీవితంతో పాటు పిల్లల జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మోసం చేస్తున్నది భర్త లేదా భార్య అయినా ఇరువురు తమ తప్పులను తెలుసుకుని ఇకపై అలాంటి తప్పులకు తావులేకుండా అనోన్యంగా కలిసి ఉండేందుకు ప్రయత్నించడం కుటుంబానికి, పిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మరిచిపోవద్దని సూచిస్తున్నారు నిపుణులు.
దంపతుల్లో ఎవరైనా తప్పులు చేయడం సహజమే. అయితే ఆ తప్పును సరిదిద్దుకోవడం అనేది అసలైనది. కానీ, చాలామంది తమ తప్పును సరిదిద్దుకునేందుకు ఇష్టపడరు. పైగా తమ తప్పు ఏమి లేదని సమర్థించుకుంటారు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య గొడవలకు దారితీస్తుంది. తెలిసో తెలియకో భాగస్వామి తప్పు చేసినప్పుడు క్షమించగలగాలి. అయితే వారు చేసిన తప్పు తీవ్రతను బట్టి వారిని మందలించాలి. పద్ధతి మార్చుకోవాలని చెప్పాలి.
సాధ్యమైనంత వరకు వైవాహిక బంధాన్ని కొనసాగించే దిశగా అడుగులు వేయాలి. ఒకవేళ పిల్లలు ఉంటే వారి జీవితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. చాలామంది జంటలు తమ పిల్లల కోసం ఇష్టం లేని సంసార బంధాన్ని కొనసాగించేవారు ఉన్నారు. కేవలం పిల్లలకు తల్లిదండ్రుల లోటు ఉండకూడదనే ఉద్దేశంతో తమ జీవితాన్ని ఏదోలా నెట్టుకొచ్చేస్తుంటారు. ఒకరకంగా ఈ విధానం పిల్లల భవిష్యత్తు దృష్టా మంచిదే అని చెప్పవచ్చు.
కక్ష సాధింపు సరికాదు :
తమ భాగస్వామి తప్పు చేసిందని వారిపై ఎలాగైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటారు. వాురు చేసిన తప్పే తాము చేసి వారికి తగిన బుద్ధి చెప్పాలని భావిస్తుంటారు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. వారు చేసిన తప్పు మీరు చేస్తే వారికి మీకు ఏమి తేడా ఉంటుంది చెప్పండి. అందుకే తప్పును క్షమించే గుణం కలిగి ఉండాలి. వారి తప్పును సామరస్యంగా చెప్పేందుకు ప్రయత్నించాలి. వారిలో మార్పుును తీసుకురాగలిగాలి. బంధాన్ని కొనసాగించాలి అని ఇద్దరు గట్టిగా భావించినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
ఇద్దరిలో ఏ ఒక్కరూ అందుకు సిద్ధంగా లేకపోయినా ఆ బంధం ఎక్కువకాలం నిలబడదు. మూడుమూళ్ల బంధం.. నూరేళ్ల బంధంగా మారాలంటే ఇద్దరి అభిప్రాయాలు కలవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. తప్పులను ఎత్తిచూపే బదులు.. ఆ తప్పులను సరిదిద్దడం.. క్షమాగుణం కలిగి ఉండటం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఏదిఏమైనా ఇద్దరి భాగస్వాముల పరస్పర అంగీకారంతోనే బంధం నూరేళ్లు నిలబడుతుందనడం అక్షర సత్యం.
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.