
Effective Home Remedies For Grey Hair in Telugu
Remedies For Grey Hair : మీ జుట్టు తెల్లపడిందా? కంగారు పడకండి.. తెల్ల జుట్టు వచ్చిందని తెగ బాధపడిపోతుంటారు. నిజానికి యుక్త వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. చాలామంది ఈ తెల్లజుట్టు పెద్ద సమస్యగా మారి వేధిస్తోంది. జుట్టు బాగా రాలిపోయి చిన్న వయస్సులోనే బట్టతల వచ్చేస్తోంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదా? అయితే ఈ వంటింటి చిట్కాలను ఓసారి ట్రై చేయండి..
మీ జుట్టు మునపటిలా ఎంతో అందంగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్య అధికంగా ఉన్నవాళ్లూ షాంపులు వాడొద్దు.. వాతావరణ కాలుష్యం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మహిళలు ఎక్కువమంది ఈ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన జుట్టు కోసం మంచి ఆహారం తీసుకోవాలి. ఈ వంటింటి చిట్కాలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.. అలాగే జుట్టు రాలే సమస్య నుంచి కూడా తొందరగా బయటపడొచ్చు..
మీ జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగాలంటే.. అలోవేరా జెల్ వాడొచ్చు.. అలాగే ఈ-విటమిన్ కాప్సిల్స్ కూడా తీసుకోవాలి. విటమిన్ ఈ ద్వారా జుట్టు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే కొబ్బరినూనె, ఆముదం కూడా పట్టిస్తుండాలి. బాగా మర్దన చేస్తుండాలి. ఇలా కొన్నిరోజులు చేస్తుంటే త్వరలోనే మంచి ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. అలోవెరా జెల్ జుట్టుకు బాగా పట్టించాలి. పది నిమిషాలు పాటు మర్దనా చేయాలి.
ఈ-విటమిన్ కాప్సిల్ ఆయిల్‌ని తీసుకుని ఒక స్పూన్ ఆముదం, రెండు స్పూన్ల కొబ్బరి నూనె బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నికొద్దిగా వేడి నీరు కూడా చేర్చాలి. తలకు బాగా పట్టించి పది నిమిషాల వరకు మర్దనా చేయాలి. మధ్యలో గ్యాప్ ఇచ్చి మరోసారి చేయాలి. గంట సేపు తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి నాలుగు నుంచి ఐదు సార్లు చేయాలి..
అప్పుడు మీ జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. ఒత్తిడి వల్ల కూడా చుట్టు రాలిపోతుంది. అలాగే తెల్లబడుతుంది. చుండ్రు సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యల నివారణకు వంటింట్లో దొరికే అద్భుతమైన చిట్కాలను ఓసారి ట్రై చేసి చూడండి..
చుండ్రు నివారించాలంటే.. ఒక స్పూన్ మెంతి పోడి, ఒక స్పూన్ కుంకుడుకాయ పొడి, ఒక స్పూన్ పుల్లటి పెరుగును తీసుకోవాలి.. బాగా కలిసేంతవరకు మిశ్రమాన్ని కలపాలి. గంటసేపు బాగా నానబెట్టాలి. అప్పుడే తలకు ప్యాక్‌లా వేసుకోవాలి. అలా ముప్పావు పావు గంట ఉంచాలి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తలలో ఉండే చుండ్రు షాంపూలతో పెద్దగా ఫలితం ఉండదు.. ఈ మిశ్రమం అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది..
ఇక మూడోది.. తెల్ల జుట్టుని నల్లగా మార్చే అద్భుతమైన రెమడీ.. ఇందుకు మీరు చేయాల్సిందిల్ల.. నాలుగు స్పూన్ల కుంకుడుకాయ పొడి, నాలుగు స్పూన్ల ఉసిరిపోడి, నాలుగు స్పూన్ల శీకాయపొడి.. వీటిన్నింటిని బాగా కలిపాలి. రాత్రంతా బాగా నానబెట్టాలి. ఆ తర్వాత ఉదయాన్నే ఈ మిశ్రమానికి నాలుగు స్పూన్ల గోరింట పొడిని కూడా కలిపాలి.
ఆ తర్వాత మరో మూడు గంటల పాటు నానబెట్టాలి. బాగా కలియబెట్టి ఆ మిశ్రమాన్ని మీ తలకు బాగా పట్టించాలి. వారంలో ఒకసారి ఇలా చేస్తుంటే క్రమంగా మీ తెల్లజుట్టు నల్లగా మారుతుంది. మీరు కూడా పై వంటింటి చిట్కాలను ఓసారి ప్రయత్నించండి.
Read Also : Seasonal Allergies : సీజనల్ అలర్జీలను తగ్గించే అద్భుతమైన వంటింటి చిట్కాలు..!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.