Dark armpits : మీ చంకల్లో నలుపుగా ఉందా? ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? అయితే సమస్యే.. మీ సమస్యను సులభంగా తగ్గించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఎన్నో ప్రకృతిసిద్ధమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గ్లామర్ పరిశ్రమలో ఉండేవారికి ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. తమ అందమైన చర్మాన్ని ప్రదర్శించినప్పుడు చంకల్లో నలుపు చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఇలాంటి సమస్యను సులభంగా తగ్గించుకునేందుకు అనేక క్రీములు వాడుతుంటారు. ముఖ్యంగా మోడల్ అమ్మాయిలకు అయితే చాలా ఇబ్బందిగా ఉండొచ్చు.
చంకల్లో నలుపును పొగట్టుకునేందుకు లోషన్లు పెద్దగా పనిచేయవు. స్టీవ్ లెస్ ఫ్యాషన్ డ్రెసెస్ వేసుకోనేవారికి ఇంక చెప్పనక్కర్లేదు. చంకల్లో నలుపును తొలగించేందుకు రకరకాల క్రీములు, లోషన్స్ వాడేస్తుంటారు. కెమికల్ క్రిములతో చర్మం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. మీ సున్నితమైన చర్మాన్ని రక్షించుకోవాలంటే ఇలాంటి కెమికల్ క్రీమ్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే.. ఇవి చేసే మేలు కంటే మీ చర్మాన్ని పాడు చేస్తాయని గుర్తించాలి. పొడిచర్మంతో బాధపడేవారికి ఈ క్రీములు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. చంకల్లో వెంట్రుకలను ఎప్పటికప్పుడూ తొలగించుకోవాలి. స్నానం చేసే సమయంలో మీ చంకల్లో కూడా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. మీరు చర్మాన్ని పడే లోషన్లు, సబ్బులను మాత్రమే ఎంచుకోండి.
చాలామంది చంకల్లో దుర్వాసనను తగ్గించుకునేందుకు అదేపనిగా పర్ ఫ్యూమ్స్ స్ప్రే చేస్తుంటారు. అలా చేయొద్దు. అలా చేయడం ద్వారా మీ చెమట దుర్వాసనకు తోడు స్ప్రే వాసనతో మరింత దుర్వాసన రావొచ్చు. బయటకు కనిపించే శరీర భాగాలపై ఎండ తగలడం ద్వారా నలుపు మారుతుంది. కానీ, శరీరపు అంతర భాగాల మధ్యలో కూడా నలుపు ఏర్పడుతుంది. ఈ నలుపును సులభంగా చిట్కాలతో వెంటనే తొలగించుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా ప్రకృతిసిద్ధమైన నిమ్మ, చెరుకు రసం వంటితో తొందరగా తగ్గించుకోవచ్చు. అండర్ ఆర్మ్స్‌లో నల్లపు తొలగించాలంటే వంటింటిలో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. అవేంటో ఓసారి చూద్దాం..
చెరకు రసం, నిమ్మ మిశ్రమం :
రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా, రెండు టీ స్పూన్ల నిమ్మ రసం, రెండు టీ స్పూన్ల చెరకు రసాన్ని బాగా కలపండి. బబుల్స్ వచ్చే వరకు స్పూన్‌తో మిక్స్ చేయండి. మిశ్రమాన్ని చంకలకు బాగా పట్టించండి. పది నిమిషాల పాటు అలానే ఉంచుకోండి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. చర్మంపై ఉండే మృతకణాలను తొలగించే శక్తి బేకింగ్ సోడా, నిమ్మకాయ, చెరకులో గుణాలు ఉన్నాయి. చంకల్లో హెయిర్ తొలగించిన వెంటనే చేయకూడదంట. కొంతమంది చర్మతత్వానికి బేకింగ్ సోడా పడకపోవచ్చు. అందుకే ముందుగా లైట్‌గా రాసి చూడండి. చర్మం ఎర్రగా కందినట్టు అనిపిస్తే.. మిశ్రమాన్ని వాడొద్దు.
బ్రౌన్ షుగర్, నిమ్మ మిశ్రమం ..
రెండు టీస్పూన్ల బ్రౌన్ షుగర్ లేదా చక్కెరను గిన్నెలో పోయండి. నిమ్మ చెక్క జ్యూస్ తీసి బాగా కలిపేయండి. 15 నిమిషాల పాటు అలానే ఉంచిన తర్వాత ఈ మిశ్రమాన్ని మీ లోపలి శరీరా భాగానికి అప్లయ్ చేయండి. పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. బ్రౌన్ షుగర్, నిమ్మకాయ కలిపిన మిశ్రమంతో చంక్లలో బ్యాక్టీరియానూ నిర్మూలించడమే కాదు.. .నల్లదనాన్ని తొందరగా తగ్గించుకోవచ్చు.
పెరుగు, కలబంద మిశ్రమం :
ప్రతి రోజూ చంకల్లో పెరుగును అప్లయ్ చేసుకుంటే నలుపు రంగు సమస్య వెంటనే పోతుంది. మీ చర్మాన్ని చాలా సున్నితంగా మార్చగల శక్తి గడ్డ పెరుగులో విటమిన్ ఎ కు ఉంది. గడ్డ పెరుగులో లభించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మీ సున్నితమైన చర్మంపై దాగిన బ్యాక్టీరియాను నిర్మూలించగల గుణం ఉంటుంది. కలబంద ముక్కను కట్ చేసి జెల్ పదార్థాన్ని తీసుకుని చంకల్లో రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
బంగాళా దుంప, కీరా దోస పేస్ట్ :
కీరా దోసకాయను సన్న ముక్కలుగా తరగండి. ఆ ముక్కలతో చంకల్లో బాగా రుద్దండి. ప్రతిరోజూ స్నానానికి ముందు రుద్దడం చేస్తే అద్భుతమైన ఫలితం పొందవచ్చు. బంగాళాదుంప, కీరా దోస కాయలను పేస్ట్‌గా తయారు చేసుకోండి. చంకల్లో రాసుకుని పదిహేను నిమిషాల పాటు అలానే ఉంచిన తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో శుభ్రంగా కడిగేయండి.. వెంటనే మీ చంకల్లోని నలుపు మాయమై పోతుంది. నిమ్మకాయ గుజ్జుతో అండర్ ఆర్మ్స్‌ను క్లీన్ చేస్తే తెల్లగా అవుతుంది.
పసుపు, వేప మిశ్రమం :
పసుపు, వేపలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. 20 వేపాకులను తీసుకుని బాగా పేస్ట్‌లా నూరండి. అర చెంచా పసుపు కలిపి బాగా మిక్స్ చేసేయండి. మిశ్రమాన్ని చంకల్లో రాసి రుద్దండి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. అంతే నలుపు మటుమాయం. పచ్చి పాలులో టీస్పూన్ పసుపు వేసి కలిపి చంకల్లో రుద్దాలి. చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది. పసుపు, తేనె కలిపి రాసినా మంచి ఫలితం ఉంటుంది. పసుపు, వేప మిశ్రమం చర్మానికి చాలా మంచిది. మంచి టానిక్ లా పనిచేస్తుంది. అందమైన చర్మం కోసం ఈ రెండింటి మిశ్రమాన్ని వాడాలి.
Read Also : Work Tension : పనిఒత్తిడితోనే గుండెపోటు.. తస్మాత్ జాగ్రత్త!
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.