Health Tips

Hair Growth Tips : వారంలోనే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఈ టిప్స్ పాటించండి.. చాలు..!

Advertisement

Hair Growth Tips  : ఆడ, మగ అని తేడా లేకుండా అందరికీ కేశాలు చాలా ముఖ్యమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కురుల వల్ల ప్రతీ ఒక్కరు అందంగా కనబడతారు. ఈ క్రమంలోనే అందరు కేశాల పట్ల అత్యంత జాగ్రత్తలు వహిస్తుంటారు. మరీ ముఖ్యంగా యువతీ యువకులు అయితే జుట్టును జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయితే, మారిన జీవనశైలి వల్ల చాలా మంది‌లో జుట్టు రాలిపోవడం సహజమైంద. అంత త్వరగా జుట్టు పెరగడం లేదు. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బలవర్ధకమైన పోషకాహార లోపం. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఏయే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మెంతులతో జుట్టు ఆరోగ్యం :
ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరిలో పొడవాటి ఒత్తైన జుట్టు ఉన్న వారు కొంచెం అరుదుగానే ఉన్నారని చెప్పొచ్చు. చాలా మందికి హెయిర్ లాస్ అనేది కామన్ అయిపోయింది. ఇకపోతే ఉన్న కురులను అలా ఉంచుకుంటున్నారు అంతే. ఈ క్రమంలో జుట్టు త్వరగా పెరగడానికి ఈ పద్ధతులు పాటించాలి. జుట్టు పెరిగేందుకుగాను మెంతులు చాలా ఉపయోగపడతాయి. మెంతులు చుండ్రును కూడా తొలగిస్తాయి. ఇందుకుగాను మీరు ఏం చేయాలంటే మెంతులను ద్రవంగా మార్చుకోవాలి. ఎలాగంటే. రెండు చెంచల ఆలివ్, కొబ్బరి, ఆముదం నూనెకు రెండు చెంచల మెంతి గింజలు యాడ్ చేయాలి. అలా వాటిని ఓ పాత్రలో పోసి మరిగించాలి.

ఆ తర్వాత మెంతులను వడకట్టి నూనెను మాత్రమే తీసుకోవాలి. ఆ ఆయిల్‌ను తలకు రాసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి. తద్వారా మంచి ఫలితముంటుంది. ఈ ఆయిల్‌ను మీ హెడ్‌పై రాత్రి పూట రాసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కడిగేస్తే చాలు.. మీ కేశాల పెరుగుదల ఉంటుంది. నెలకు రెండు సార్లు లేదా ప్రతీ వారం ఇలా చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

గ్రీన్ టీ తాగితే జుట్టు పెరుగుతుంది :
కరోనా మహమ్మారి వల్ల నుంచి జనాలు మంచి పోషకాలున్న ఆహారపదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడుతుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే జనాలు నార్మల్ టీ కంటే గ్రీన్ టై వైపునకు మొగ్గు చూపుతున్నారు. గ్రీన్ టీ వల్ల హెల్త్‌కు చాలా మంచి జరుగుతుందని జనం బాగా నమ్ముతున్నారు కూడా. ఈ గ్రీన్ టీ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలికల్స్ హెయిర్ పెరుగుదలతో పాటు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సాయపడతాయి.

అయితే, ఇందుకుగాను గ్రీన్ టీని ఆయిల్‌గా మార్చుకోవాల్సి ఉంటుంది. గ్లాసెడు గ్రీన్ టీని గోరువెచ్చగా మారిన తర్వాత మీ వెంట్రుకల కుదుళ్లకు తాకేలా మంచిగా నీట్‌గా మసాజ్ చేసుకోవాలి. మీ హెడ్ అంతా కూడా గ్రీన్ టీ చేరిపోయేలా చూసుకోండి.. అలా మీ హెడ్ అంతా గ్రీన్ టీ ఉంచుకున్న తర్వాత కనీసం గంట పాటు ఉండాలి. ఇంకొంచెం ఎక్కువ టైమ్ ఉన్నా ఏం ప్రాబ్లమ్ ఉండబోదు.

ఉల్లిపాయ రసంతో జుట్టుకు పోషణ :
అలా గ్రీన్ టీని మసాజ్ రూపంలో చేసుకున్న తర్వాత మంచి నీటితో తలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మంత్‌లో టూ టైమ్స్ చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇక సహజ సిద్ధమైన ఉల్లి వల్ల అనేక రోగాలు మన దరి చేరవు అన్న సంగతి అందరికీ తెలిసిందే. పచ్చి ఉల్లిని మనం ఇప్పటికీ ఆరగిస్తుంటాం. కాగా, ఈ ఉల్లిపాయ రసం వల్ల హెయిర్ హెల్దీనెస్‌తో పాటు గ్రోత్ కూడా ఉంటుంది.

హెయిర్ లాస్‌ను నివారించడమే కాదు. కుదుళ్ల నుంచి హెయిర్ గ్రోత్‌ను ప్రేరేపిస్తుంది ఈ ఉల్లిపాయ రసం. ఇకపోతే ఉల్లిపాయ రసం తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒక పెద్ద ఉల్లిపాయ పొట్టు తీసి దానిని చిన్న చిన్న ముక్కలుగా తరిమి చూర్ణం అయ్యేలా చూడండి. ఆ ద్రవరూపంలో ఉన్న ఉల్లిపాయల రసాన్ని వడకట్టి మీ తలకు రుద్దుకోండి.

అయితే, ఈ ఉల్లిపాయ రసం రుద్దుకునే క్రమంలో వాసన బాగా వస్తుంటుంది. అయితే, దానని సహించాలి. దాని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు. ఆ ఉల్లిపాయల రసాన్ని తలకు అప్లై చేసుకుని ఓ పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. అలా చేయడం వల్లే మీకు హాయిగా ఉంటుంది. ఈ క్రమంలోనే జుట్లును మసాజ్ తర్వాత ఓ పదిహేను నిమిషాల నుంచి ఇరవై, ఇరవైదు నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి.

అలా మీరు జుట్టుకు ఉల్లిపాయల రసాన్ని అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. ప్రతీ వారానికి ఒకసారి ఇలా చేస్తే కనుక మీ హెయిర్ ఇంకా హెల్దీగా తయారవుతుంది. ఆహార పదార్థాలు కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ క్రమంలో కురుల పెరుగుదలకు ఉపయోగపడే పాలకూర, క్యారెట్, బీన్స్, బచ్చలికూర తినాలి. వీటితో పాటు బాదం వంటి పొడి పండ్లు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తినాలి.

పండ్లతో జుట్టుకు మేలు :
ఇక సీజనల్ ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. దానిమ్మ, అరటి, ఆరెంజ్, చిలగడదుంప తినొచ్చు. గుడ్లు, చేపలు తినాలి. పోషకాలు సమృద్ధిగా ఉండే పండ్లను వేటిని కూడా వదల కూడదు. అన్నిటినీ సమపాళ్లలో తినాలి. అలా చేయడం వల్ల మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇకపోతే మద్యం ఎక్కువగా తాగడం వల్ల హెయిర్ లాస్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలో మద్యం తాగకపోవడం ఆరోగ్యానికి, కురులకు మంచిది.

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago