Instant Breakfast Recipes : ఇనిస్టెంట్ బ్రేక్ ఫాస్ట్… 2 బంగాళదుంపలు పల్లీలతో కొత్తగా ఈ టిఫిన్ చేసి పెట్టారంటే పిల్లలు వద్దన్నా మొత్తం ఖాళీ చేస్తారు ఎంతో ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి? మరమరాల ప్లేస్ లో అటుకులు, వేడివేడి అన్నం, మిగిలిన అన్నం తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు.. మరమరాలు 2 కప్పు, బంగాళదుంప -2, ఉల్లిగడ్డ-1, పల్లీలు1/2 కప్పు, పచ్చిమిర్చి -2, నూనె, జీలకర్ర- 2 టీ స్పూన్, ఆవాలు – 1టీ స్పూన్, పచ్చిశనగపప్పు1 టీ స్పూన్, ఉప్పు, కొత్తిమీర, ఎండుమిర్చి – 6, ఎండు కొబ్బరి (సగం), వెల్లుల్లి రెబ్బలు-5.
తయారీ విధానం… ముందుగా పల్లీలను బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. ఆ తర్వాత బంగాళా దుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేయాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒకరెమ్మ కరివేపాకు, రెండు ఎండు మిర్చి ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసి కలపాలి.
బంగాళదుంపలను డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరమరాలను శుభ్రంగా నీళ్లలో ముంచి కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత తీయాలి. మరమరాలలో ఉన్న నీళ్లు పిండి.. (మరమరాలు వాటర్ పీల్చుకోకుండా చూసుకోవాలి. బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన పల్లీల పొడిని వేసి తరవాత లో ఫ్లేమ్ లో ఉంచి ఒక నిమిషం పాటు మసాలా (పల్లీల కారం పొడి) ముక్కలు కు పట్టేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరమరాలు వేసి కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఎంతో రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ రెడీ..
Read Also : Instant Breakfast Recipes : 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్ల గురించి మీకు తెలుసా?
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.