
Papaya Health Benefits
Papaya Health Benefits : కరోనా ప్రపంచాన్ని గడగడలాండించిన రోగం. దాదాపు మూడు సంవత్సరాలుగా అది ప్రపంచంలో ఎందరినో ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడిప్పుడే వాటి నుంచి అన్ని దేశాలు బయటపడుతున్నాయి. చాలా దేశాలు వ్యాక్సిన్‌లు తయారు చేసుకున్నాయి.
చేసుకోని దేశాలు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడమో, లేక విరాళంగా స్వీకరించడమో చేస్తున్నాయి. మొత్తానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పుడు అన్ని దేశాల్లో శరవేగంగా జరుగుతోంది. కొన్ని దేశాలు 100 శాతం వ్యాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేశాయి. కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం కాదు.
వ్యాక్సిన్ అందుబాటులోకి రాకముందు చాలా మంది కరోనాను జయించారు. దానికి కారణం మంచి పోష్టికాహారం తీసుకోవడం, అప్పటికే అందుబాటులో ఉన్న మందులు వాడటం. కరోనా దాడి చేసిందంటే అది ముఖ్యంగా రోగ నిరోదక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది.
మన రోగనిరోదక శక్తి స్ట్రాంగ్‌గా ఉంటే కరోనా ఏం చేయలేదు. అయితే రోగ నిరోదక శక్తిని బలంగా ఉంచడంలో బొప్పాయి చాలా కీలకంగా పని చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సీ రోగనిరోదక శక్తి పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్ కూడా పెరుగుతాయి.
మార్కెట్‌లో విరివిగా, చవకగా లభించే పళ్లలో బొప్పాయి ఒకటి. దీంతో పాటు క్యారెట్, కాప్సికం, బ్రకోలీ, టమాట, పాలకూర, క్యాబేజీ, బీట్ రూట్, బాదం, వల్ నట్స్, పాలు, ఉడకబెట్టిన గుడ్లు, గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం టీ తరచూ తీసుకోవడం వల్ల కరోనాతో పాటు ఇతర రోగాలను కూడా దూరంగా పెట్టొచ్చు. రోగ నిరోదక శక్తి బలంగా ఉంటే రోగాలు దరిచేరవు. దానిని పెంచుకోవాలంటే పైన సూచించిన పదార్థాలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి.
కరోనా నుంచి బయటపడేందుకు ప్రతిఒక్కరూ ఆరోగ్యపరంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో సహజసిద్ధమైన పోషకాలు కలిగిన ఆహారపదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కరోనా పుణ్యామని అందరిలో ఆరోగ్యంపై శ్రద్ధ ఏర్పడింది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు.
కరోనా నుంచి బయటపడాలంటే బొప్పాయి పండు కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది. తెల్ల రక్త కణాలు తక్కువగా ఉన్నవాళ్లు ఈ బొప్పాయి తీసుకుంటే తొందరగా రికవరీ అవుతారు. బొప్పాయిలో తెల్లరక్తకణాలను పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
యాంటీ యాక్సిడెంట్లు, పైబర్ కంటెంట్, పీచు, నీటిశాతం ఎక్కువగా ఉండటంతో శరీరానికి కాావాల్సినంత నీరు దొరకుతుంది. ఎప్పుడూ శరీరం హైడ్రేడ్ గా ఉండేందుకు సహకరిస్తుంది. తెల్లరక్త కణాలు పడిపోయినప్పుడు శరీరం శక్తిని కోల్పోతుంది.
కరోనా సోకినవారిలో నీరసం పెరగడానికి కారణం రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడమే.. అందుకే బొప్పాయి పండును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తొందరగా కరోనా నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఒక్క బొప్పాయి పండు మాత్రమే కాదు.. అనేక రకాల ఇతర పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కరోనాతో రోగనిరోధక శక్తి కోల్పోయినవారు బొప్పాయి ముక్కలను తినడం బోలెడు పోషక లవణాలను పొందవచ్చు. తద్వారా తొందరగా కరోనా నుంచి కోలుకోవచ్చు. డెంగ్యూ వంటి ఇతర విషజ్వరాలకు కూడా బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది.
Read Also : Vajradanti Plant Benefits : వజ్రదంతిలో అద్భుత ఔషధాలు.. పంటిడాక్టర్‌తో పనిలేదిక.. దంత సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే..!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.