
Omicron COVID variant Symptoms
Omicron Symptoms : ప్రపంచంలో మరో కొత్త కొవిడ్ వేరియంట్ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్ (B.1.1.529) అనే ఈ కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు. నవంబర్ 25న ఈ డేంజరస్ ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించారు. ఇది డెల్టా కన్నా మూడు రెట్లు ప్రమాదకరమైనదని, అత్యంత వేగంగా వ్యాప్తి చెందగలదని అంటున్నారు. డేంజరస్ వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం హెచ్చరించింది. ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ 15వరకు దేశాలు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిన ముప్పై మంది బాధితులను దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొయెట్టీ పరీక్షించారు. బాధితుల్లో కనిపించే లక్షణాలు చాలా తేలకైనవిగా పేర్కొన్నారు.
ఆస్పత్రులకు వెళ్లాల్సిన పనిలేదని ఇంటి దగ్గరే చక్కగా చికిత్స అందించవచ్చునని ఆమె తెలిపారు. సౌతాఫ్రికా వ్యాక్సిన్ కమిటీలో సభ్యురాలైన కొయెట్టీ.. కొత్త వేరియంట్ వ్యాప్తిని ముందుగానే అంచనా వేసినవారిలో ఒకరు. డెల్టా వేరియంట్ కన్నా వేర్వేరు లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. బాధితుల్లో కొంతమందిలో లక్షణాలు కూడా వేరుగా ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఎవరికి కూడా తీవ్రమైన లక్షణాలు లేవని, కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ బాధిత వ్యక్తుల్లో తీవ్రమైన ఒళ్లనొపపులతో పాటు తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినట్టు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు
వైరల్ ఇన్ఫెక్షన్ మాాదిరి లక్షణాలు :
ఈ లక్షణాలు మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ తరహాలో ఉన్నాయని తెలిపారు. కొన్నివారాల పాటు అక్కడి ప్రాంతంలో కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ అందరికి పరీక్షలు చేయించారు. ఇప్పటికే వైరస్ సోకినవారితో పాటు సంబంధిత కుటుంబ సభ్యులకు కూడా వేరియంట్ వ్యాపించినట్టు గుర్తించారు. ఇలాంటి లక్షణాలతో చాలామంది పేషెంట్లు వచ్చారని తెలిపారు. ప్రతిరోజు చాలామంది కొవిడ్ బాధితులు వస్తున్నారని పేర్కొన్నారు. అందరిలోనూ వైరస్ స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. వారందరికి ఇంటి దగ్గరే ఉంచి చికిత్స అందించినట్టు పేర్కొన్నారు. మరికొంతమందిలో వాసన తెలియకపోవడం, రుచి చూడలేకపోవడం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఏమి లేవన్నారు.
కొవిడ్ కొత్త వేరియంట్ గుర్తించడంపై WHO ప్రకటనలో వెల్లడించింది. ఇతర వేరియంట్ల మాదిరిగానే PCR టెస్టుల ద్వారా గుర్తించవచ్చునని పేర్కొంది. పరీక్షల ఫలితాల విషయంలో ఒమిక్రాన్ వేరియంట్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరుగుతున్నట్టు తెలిపింది. వేరియంట్ వ్యాప్తితో పాటు దాని వేగం ఎలా ఉంటుంది.. వ్యాధి లక్షణాల తీవ్రతపై కూడా అనేక పరిశోధనలు చేస్తున్నారని పేర్కొంది.
ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఇతర వేరియంట్ లక్షణాలకు భిన్నంగా ఉంటాయో లేదో పూర్తి సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. ఇదివరకే కరోనా బారినపడివారు మళ్లీ ఈ ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని WHO హెచ్చరించింది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకర వేరియంట్ అని WHO వెల్లడించింది. ఆల్ఫా, గామా, బీటా కొవిడ్ వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించింది. డెల్టా వేరియంట్ ఇప్పటికే ఆ జాబితాలో చేరింది. ఇప్పటికే పలు విదేశాలకు ఒమిక్రాన్ విస్తరించింది.
ఒమిక్రాన్ లక్షణాలు ఇవే :
వైరస్ సోకినవారిలో స్పష్టమైన లక్షణాలేవు. డెల్టా మాదిరిగా ఓమిక్రాన్ వ్యాపించిన వారిలో లక్షణాలు బయటపడ్డాయి. కండరాల నొప్పులతో పాటు 1 నుంచి 2 రోజుల వరకు ఉంటాయి. తలనొప్పి, ఛాతీ నొప్పితో పాటు గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
శరీరంలో నొప్పులతో పాటు తలనొప్పి సమస్యలు అధికం. వ్యాక్సిన్ వేసుకోనివారిలో ఒమిక్రాన్ వేరియంట్ అధిక ముప్పు.
Read Also : Diabetics Insulin : ‘డయాబెటీస్’ రోగులు టైంకు ఇన్సులిన్ తీసుకోకపోతే ఏమవుతుంది.. ముప్పు తప్పదా..?
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.