Covid-19 Updates

Covid Symptoms In Children : చిన్నపిల్లల్లో కరోనా ప్రారంభ లక్షణాలతో జాగ్రత్త…!

Advertisement

Covid Symptoms In Children : చిన్నారుల్లో కరోనా ప్రారంభ లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసా? తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? సాధారణంగా పిల్లల్లో కరోనా ప్రారంభ లక్షణాలను ఇలా గుర్తించవచ్చునని అంటున్నారు పిల్లల వైద్య నిపుణులు. మూడో వేవ్ పిల్లలకు ప్రాణాంతకమనే ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లల్లో కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నట్టుగా అనిపిస్తే.. వైద్యసలహా మేరకు వెంటనే చికిత్స అందించాలని సూచిస్తున్నారు.

తల్లిదండ్రులు పిల్లల్లో అనారోగ్య సమస్యలను గుర్తించాలి. కొంతమంది పిల్లల్లో గొంతునిప్పి, దగ్గు రావొచ్చు. కరోనా కారణంగా తీవ్ర నిరంతర దగ్గు, గొంతు నొప్పి, ఎగువ శ్వాసకోశ వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముక్కు కూడా కారుతుంది.. పిల్లల్లో వాసన కూడా కోల్పోయే లక్షణం కూడా ఉండొచ్చు. ఈ లక్షణాలు సాధారణ జలుబు, ఫ్లూ మాదిరిగానే కనిపిస్తాయి. అసలు కరోనా లక్షణాలో కాదో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఇదే గందరగోళానికి గురిచేస్తుంది.
Overcome Low self-esteem : అతిగా భయపడుతున్నారా? మీకు ఆ సమస్య ఉన్నట్టే?

కొంతమంది పిల్లల్లో అలసట, కండరాల నొప్పిగా ఉండటం, ఎర్రటి కళ్ళు, చర్మంపై దద్దుర్లు, విరేచనాలు, కడుపులో నొప్పి, జ్వరం, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యసాయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కరోనా తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన చిట్కాలను కూడా పాటించవచ్చు.

కరోనా మనతోటే ఉంది :
కరోనావైరస్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోయిందిలే అనుకోవద్దు. వైరస్ పూర్తిగా పోలేదు. వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది అంతే.. కరోనా థర్డ్ వేవ్ వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇది వర్షాకాలం సీజన్.. అనేక రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ముఖ్యంగా జలుబు, జ్వరాలు, వైరల్ ఫీవర్, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ స్థాయిలో ఉంటుంది. పిల్లలను సాధ్యమైనంతవరకు బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లోనే శుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. కరోనా లక్షణాలను మొదట గుర్తించడం చాలా కష్టమనేది గుర్తించాలి.

చంటి పిల్లల్లో కరోనా ప్రారంభ లక్షణాలు సాధారణ జలుబు మాదిరిగానే ఉండొచ్చు. ముక్కు కారడం, తుమ్ములు, అలర్జీ సమస్యలు, చర్మంపై దద్దర్లు వంటివి కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలను చూస్తే సాధారణ వ్యాధుల మాదిరిగా కనిపించవచ్చు. కరోనా పరిస్థితుల్లో పిల్లల ఆరోగ్యం పట్ల ఎంతమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. చాలామందిలో వాసన సామర్థ్యాన్ని కోల్పోతారు. రుచి కూడా తెలియదని అంటుంటారు. అప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వారిని ఇతరులతో కలవనివ్వకుండా ఐసోలేషన్ ఉండేలా చూసుకోవాలి.

కరోనా ప్రారంభ లక్షణాలివే :
పిల్లల్లో కరోనా ప్రారంభ లక్షణాల్లో జ్వరం, గొంతునొప్పితో పాటు ఇతర చర్మ సమస్యలు కూడా ఉండవచ్చు. పిల్లల చేతులను శుభ్రంగా కడగాలి. ఆడుకునేందుకు బయటకు వెళ్లనివ్వొద్దు. చిన్నపిల్లలు స్కూలుకి వెళ్లితే మరి ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపిస్తే వారికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు శుభ్రత పట్ల అవగాహన ఉండదు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో పిల్లలను స్కూలుకు పంపించాల్సి వస్తే.. పాఠశాల పరిసర ప్రాంతాల్లో వారితోపాటు సామాజికదూరం, తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలి.

టాక్సిక్ షాక్ సిండ్రోమ్ లక్షణాల మాదిరిగా :
ఈ కేసుల్లో పిల్లల్లో తీవ్రమైన జ్వరంతో పాటు రక్తపోటు పడిపోవడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం, నల్లటి మచ్చలు ఏర్పడటం, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమంది చిన్నారుల్లో జీర్ణకోశ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. చిన్నారుల్లో వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి, గుండెల్లో మంటగా అనిపించడం, బ్లడ్ టెస్టులో కరోనా లక్షణాలు ఉంటున్నాయి. వైరస్‌తో పోరాడి శరీరం అలిసిపోయినట్టుగా కరోనా లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కేసులను అత్యవసరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

కరోనాతో పిల్లల్లో కొంతమంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చాలామందిలో కరోనా బాధితులు తక్కువగా ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెప్టిక్ షాక్.. సమస్య కారణంగా చర్మంపై దద్దులు వ్యాపిస్తాయి. చూసేందుకు ఈ సమస్య టాక్సిక్ షాక్ సిండ్రోమ్ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ వ్యాధి గుండె, రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారితో పాటు కరోనా సోకిన చిన్నారులకు ఈ వ్యాధి తొందరగా సోకే ప్రమాదం ఉంది. అదృష్టవశాత్తూ ఈ లక్షణాలతో బాధపడుతూ ఐసీయూలో చికిత్స తీసుకునేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని నిపుణులు నజీమా పఠాన్ సూచిస్తున్నారు.

కరోనా లక్షణాలు కనిపిస్తే..
కరోనావైరస్ లక్షణాలను చూసి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కరోనా లక్షణాలు పిల్లల్లో కనిపించినా లేదా అనుమానంగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. కరోనా చిన్న పిల్లలకు సోకుతోంది. పెద్దలతో పోలిస్తే.. చిన్నపిల్లలపై కరోనా ప్రభావం తక్కువగా ఉందనే చెప్పాలి. చిన్నారులు ఆరోగ్యంగా లేకుంటే కరోనా కావచ్చు. లేదంటే ఇతర అనారోగ్య సమస్య కావొచ్చు. కరోనాతోనా ఏదైనా వైరస్ సమస్యలతో బాధపడుతున్నారో గుర్తించాలి. కరోనా ప్రారంభ లక్షణాల్లో అరుదైన వ్యాధి లక్షణాలు ఇలా ఉండొచ్చు.

ఒళ్లు మొత్తం పాలిపోయినట్టుగా మారుతుంది. నల్లటి మచ్చలు పుట్టుకొస్తాయి. శరీరం చల్లగా మారుతుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. శ్వాస తీసుకోవడంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. గొంతులో నొప్పితో పాటు బొంగరుగా మారుతుంది. శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. చిన్నారుల పెదవుల భాగంలో నీలిరంగు రింగులు ఏర్పడతాయి. కొన్నిసార్లు పిల్లల్లో ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయోమయం, నీరసంగా అనిపిస్తుంది.

పిల్లల్లో కనిపించే సాధారణ లక్షణాల్లో తీవ్ర జ్వరంతో పాటు పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, రుచి, వాసన కోల్పోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. సెకండ్ వేవ్‌లో కనిపిస్తున్న ఇతర లక్షణాల్లో విరేచనాలు, వాంతులు, సృహ కోల్పోవడం, తలనొప్పి, కళ్లు ఎర్రబడటం, చర్మంపై దద్దుర్లు, నీలం రంగులోకి బొటనవేలు మారడం, వేలు గోర్లు వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. చిన్నపిల్లలు తల్లికి దగ్గరగా ఉంటారు. పిల్లల నుంచి తల్లిదండ్రులకు కరోనా సోకే అవకాశం ఉంటుంది.

కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే.. తల్లిదండ్రులు కూడా టెస్ట్ చేయించుకోవాలి. చిన్నపిల్లలకు కరోనా చికిత్స అవసరం ఉండకపోవచ్చు. పిల్లలకు టెస్ట్ తప్పనిసరి కాదు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే కరోనా టెస్టు తప్పనిసరిగా చేయాలి. ఫ్యామిలీలో ఒకరికి కరోనా సోకినా పిల్లలకు తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయనక్కర్లేదు. పిల్లలు బయటకు వెళ్లినట్టయితే వారినుంచి ఇతరులకు వ్యాపించొచ్చు. కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించాలని వివరించారు.

కరోనా లక్షణాల్లో జ్వరం ఉంటే తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి. కరోనా వైరస్ సోకినట్టయితే చిన్న పిల్లల్లో వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్టు కనిపిస్తే ఇంట్లోనే ఉంచేందుకు ప్రయత్నించండి. జ్వరంగా ఎప్పుడెప్పుడు ఎంత ఉందో రాసిపెట్టుకోండి. ఆక్సిజన్ లెవల్స్, విరేచనాలు, పల్స్ రేట్, వాంతులు వంటి లక్షణాలు ఏమున్నాయో గుర్తుపెట్టుకోండి. ప్రతి 8 గంటలకు ఒకసారి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చార్టులో నమోదు చేయాలి. ఆక్సిజన్ స్థాయిల్లో 94 కన్నా దిగువకు పడిపోతే వైద్యున్ని సంప్రదించాలి.

కరోనా పిల్లలకు సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులకు మసాజ్ లేదా స్నానం చేసేందుకు వచ్చే ఆయాల నుంచి కూడా వారికి కరోనా సోకే ప్రమాదం ఉంది. సాధ్యమైనంతవరకు తల్లులే తమ పిల్లలకు స్నానం చేయించడం ఉత్తమం. చిన్నపిల్లలకు వినియోగించే దువ్వెనలు, లోషన్లు, సబ్బులు సపరేటుగా వాడండి.. పెద్దవాళ్లు వాడే వాటికి దూరంగా ఉంచాలి. డైపర్లు, బట్టలు మార్చే సమయంలో మీ చేతులను శుభ్రపరుచుకోవాలి. పిల్లలు ఆడుకునే బొమ్మలను సైతం శానిటైజ్ చేస్తుండాలి. పిల్లల ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటూనే అవసరమనప్పుడు వైద్యున్ని సలహాలు, సూచలను కూడా తీసుకుంటుండాలి. విటమిన్లు, పిల్స్, సిరప్స్, ప్రోటీన్లు వంటి పిల్లలకు ఇవ్వరాదు.

కరోనా సోకిన అనంతరం అరుదుగా కనిపించే వ్యాధి లక్షణాలు ఇలా ఉండొచ్చు.. రెండు నుంచి 4 వారాల లోపు ఈ లక్షణాలు కనిపించవచ్చు. చిన్నారుల శరీరంలో పాజిటివ్ యాంటీబాడీలు ఉత్పత్తి అయి ఉంటాయి. దాంతో శరీరం అతిగా స్పందించే అవకాశం ఉంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ ఎక్కువగా స్పందించడం ద్వారానే ఈ తరహా లక్షణాలు బయటకు కనిపిస్తాయి. ఈ సిండ్రోమ్ తాలూకూ లక్షణాలు పిల్లల్లో అరుదుగానే ఉంటాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందనక్కర్లేదు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ దాని ప్రభావం వెంటనే తగ్గదని గుర్తించాలి.

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago