పుట్ట గొడుగులు శిలింధ్రాల జాతులకు చెందిన మొక్కలు.. చెత్తకుప్పల్లో, పాడుపడిన ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతుంటాయి.

తరచూ అనారోగ్యంతో బాధపడేవారు, అధిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడేవారు పుట్టగొడుకులను తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

పుట్టగొడుగులను తరచూ తీసుకుంటే శరీరానికి సరిపడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వెజిటేరియన్ ప్రియులు పుట్టగొడుగులను ఇష్టంగా తింటారు. ఇందులో అధికంగా యాంటీ ఇన్‏ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి.

అవి శరీరంలో కలిగే వాపులను నియంత్రిస్తాయి. అదే విధంగా ఒబెసిటీ (అధిక బరువు), గుండె జబ్బులు,. డయాబెటిస్ వంటి రోగాలను దరిచేరనివ్వదు.

పుట్టగొడుగులు తింటే మానసిక ఒత్తిడి, ఆందోళనలు దూరం అవుతాయి.

మష్రూమ్స్ తరచూ తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయన్నారు.

ఇందులో నిరోధక ఇన్ఫ్లమేటరీ అమైనో యాసిడ్స్ ఎక్కువగా కనిపిస్తాయన్నారు.

వీటిని ఎక్కువగా తినడం వలన ఎర్గోథియోనిన్ అనేది విడుదలై ఒత్తిడిని తగ్గిస్తుందన్నారు.