వాస్తుశాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడిని ఇళ్లలో పెట్టుకునే ముందర కొన్ని నియమాలు కంపల్సరీగా పాటించాలి.

ఆ నియమాలు పాటించకపోతే అశుభకరమని వాస్తు నిపుణులు చెప్తున్నారు.

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఇళ్లల్లో విఘ్నాలను తొలగించే గణనాథుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి.

గణనాథుడు కొలువు దీరిన ఇళ్లలో ఆనందం, శ్రేయస్సు పెంపొదించబడతాయి.

ఆ ప్రదేశంలో ఉన్న వ్యక్తుల జీవితాల్లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

అందుకే గణనాథుడిని విఘ్నరాయుడు అంటారట.

విఘ్నాలన్నిటినీ ఇట్టే తొలగించగల శక్తి గణపతికి ఉందని భక్తుల నమ్మకం.

ఇకపోతే చాలా మంది విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇస్తుంటారు.