రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగిపోతే ప్రాణాలకే ముప్పు

జీవనశైలిలో మార్పులు, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడమే కారణం 

చెడు కొలెస్ట్రాల్‌ వల్ల రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడుతుంటాయి. 

అధిక కొలెస్ట్రాల్‌ పెరిగితే.. హైపర్‌టెన్షన్‌, థైరాయిడ్‌, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, పక్షవాతం సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువ

అధిక కొలెస్ట్రాల్‌కు లక్షణాలు లేవు.. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేసుకోవడం చాలా అవసరం. 

పౌష్టిక ఆహారం, వ్యాయామం, రెగ్యులర్‌ చెకప్స్‌ ద్వారా అధిక కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. 

9 నుంచి 11 సంవత్సరాల మధ్య మొదటి కొలెస్ట్రాల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. 

ప్రతి రెండు ఏళ్లకు కొలెస్ట్రాల్‌ స్క్రీనింగ్‌‌‌‌ చేయించుకోవడం మంచిది.