ఇళ్లల్లో పూజ చేసేటపుడు ధూపం వేస్తారు. వారు అలా ఎందుకు చేస్తున్నారా అని కొంత మందికి అనుమానం వస్తుంది.

కానీ ధూపం వేయడం వలన చాలా ఉపయోగాలున్నాయి.

ఈ ధూపం కనుక వేయకపోతే మనం చేసిన పూజ ప్రయోజనాన్ని ఇవ్వదని చాలా మంది విశ్వసిస్తారు.

అందుకోసమే పూజ లో తప్పనిసరిగా ధూపం వేస్తారు. అంతే కాకుండా ఈ ధూపం కూడా మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది.

బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాల కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి. కావున ఈ ధూపం కొనుగోలు చేయడం చాలా ఈజీ.

ఈ ధూపాన్ని ఇంట్లో వేయడం వలన మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుందని చాలా మంది నమ్మకం.

వాస్తు దోషాలతో చాలా మంది అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు.

ఈ ధూపాన్ని గనుక వేస్తే వాస్తు దోషాలు కూడా తగ్గుతాయని అనేక మంది చెబుతారు.