WHO – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Mon, 05 Jun 2023 08:37:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png WHO – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Omicron Virus Alert : ఒమిక్రాన్ డేంజర్.. పిల్లల్లో వేగంగా వ్యాప్తి.. పేరెంట్స్ బీ కేర్ ఫుల్ https://mearogyam.com/coronavirus-updates/omicron-virus-alert-danger-omicron-new-variant-virus-most-infectious-in-kids-be-careful-parents-about-children.html https://mearogyam.com/coronavirus-updates/omicron-virus-alert-danger-omicron-new-variant-virus-most-infectious-in-kids-be-careful-parents-about-children.html#respond Mon, 13 Dec 2021 07:53:54 +0000 https://mearogyam.com/?p=1496 Omicron Virus Alert : ఒమిక్రాన్ డేంజర్.. పిల్లల్లో వేగంగా వ్యాప్తి.. పేరెంట్స్ బీ కేర్ ఫుల్
MeArogyam Health News Telugu - MeArogyam.com

Omicron Virus Alert : ఒమిక్రాన్ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా బెంబేలిత్తిస్తోంది. దక్షిణాఫ్రికా వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వైరస్ చాలా ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది మన దేశంలో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ కంటే చాలా ప్రమాదకారి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తుండగా కొందరికి పాజిటివ్ అని వస్తోంది. […]

The post Omicron Virus Alert : ఒమిక్రాన్ డేంజర్.. పిల్లల్లో వేగంగా వ్యాప్తి.. పేరెంట్స్ బీ కేర్ ఫుల్ appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Omicron Virus Alert : ఒమిక్రాన్ డేంజర్.. పిల్లల్లో వేగంగా వ్యాప్తి.. పేరెంట్స్ బీ కేర్ ఫుల్
MeArogyam Health News Telugu - MeArogyam.com

Omicron Virus Alert : ఒమిక్రాన్ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా బెంబేలిత్తిస్తోంది. దక్షిణాఫ్రికా వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వైరస్ చాలా ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది మన దేశంలో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ కంటే చాలా ప్రమాదకారి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తుండగా కొందరికి పాజిటివ్ అని వస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ పేరు వింటేనే గజగజ వణుకుతున్నారు. మొన్నటివరకు ఒమిక్రాన్ పెద్దవారిలో, వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం వస్తుందని వైద్యులు వెల్లడించారు.

తాజాగా ఒమిక్రాన్ గురించి మరో కొత్త విషయం వెలుగుచూసింది. ఈ వేరియంట్ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా పిల్లలపైనే ప్రభావం చూపుతోందని ఆ దేశ వైద్యులు WHOకు సమాచారం అందించారు. చిన్నారుల్లో రెండు సంవత్సరాల వయస్సు నుంచి ఎక్కువ వయస్సు కలిగిన చిన్నారులే అధికంగా ఆస్పత్రుల్లో చేరుతున్నారని వైద్యాధికారులు పేర్కొన్నారు. అయితే, వారిలో సాధారణ, మధ్యస్థ స్థాయి కొవిడ్ లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని డాక్టర్లు రిపోర్టు ద్వారా తేల్చారు. ముఖ్యంగా యూరప్‌లోని చిన్నారులే ఈ వైరస్ బారిన పడుతున్నారు. వీరిలో 5 నుంచి 14 ఏళ్లలోపు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారు. అందువల్లే పేరెంట్స్ తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

ఇంకో విషయం ఏంటంటే.. ఇండియాలో వెలుగుచూసిన డెల్టా వైరస్‌తో పోలిస్తే ఒమిక్రాన్ పెద్ద డేంజర్ ఏమీ కాదని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ పేరెంట్స్ మాత్రం తమ పిల్లల ఆరోగ్యంపై ఓ లుక్ వేసి ఉండాల్సిందిగా చెబుతున్నారు. ఇకపోతే ఒమిక్రాన్ వైరస్ ప్రస్తుతం 57 దేశాల్లో స్వైర విహారం చేస్తోంది. యూకే నుంచి వచ్చిన 366 మంది రోడ్డు ప్రమాదంలో బారినపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి గురించి తెలియాలంటే.. సౌతాఫ్రికాలో 228, జింబాబ్వే 50, అమెరికాలో 40 కేసులు ఉండగా.. ఇండియాలో నేటికి 23 మంది ఒమిక్రాన్ వైరస్ బారిన పడ్డారు. ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు కూడా సాధారణ వైరస్ మాదిరిగానే ఉంటాయని అంటున్నారు. చికెన్ గున్యా తరహాలో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా పిల్లల విషయంలో వైరస్ ప్రభావం నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు.

Read Also : Omicron Symptoms : ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఏమిటి?.. ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలి?

The post Omicron Virus Alert : ఒమిక్రాన్ డేంజర్.. పిల్లల్లో వేగంగా వ్యాప్తి.. పేరెంట్స్ బీ కేర్ ఫుల్ appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/coronavirus-updates/omicron-virus-alert-danger-omicron-new-variant-virus-most-infectious-in-kids-be-careful-parents-about-children.html/feed 0
Covaxin Vaccine : కొవాగ్జిన్‌ వేసుకున్న వారికి గుడ్ న్యూస్.. ఏంటంటే? https://mearogyam.com/coronavirus-updates/covaxin-approval-covaxin-shots-indian-travellers-can-go-australia-who-have-received-covaxin-shots.html https://mearogyam.com/coronavirus-updates/covaxin-approval-covaxin-shots-indian-travellers-can-go-australia-who-have-received-covaxin-shots.html#respond Tue, 02 Nov 2021 17:34:23 +0000 https://mearogyam.com/?p=1224 Covaxin Vaccine : కొవాగ్జిన్‌ వేసుకున్న వారికి గుడ్ న్యూస్.. ఏంటంటే?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Covaxin : క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త‌దేశానికి ఓ పెద్ద శాపంగా మారింది. దీని ప్ర‌భావానికి మ‌న దేశం మీద ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆంక్ష‌లు పెడుతున్నాయి. చాలా వ‌ర‌కు మ‌న దేశం నుంచి ఇత‌ర దేశాల‌కు వెళ్లే వారికి అయితే క‌ఠిన‌మైన ఆంక్ష‌ల ఉన్నాయి. దుబాయ్‌, ఒమ‌న్‌, లండ‌న్‌, ర‌ష్యా, ఆస్ట్రేలియా, జ‌పాన్, సింగ‌పూర్ లాంటి దేశాలు మ‌న దేశం నుంచి వెళ్లే వారిపై చాలా ర‌కాల రూల్స్ పెట్టేశాయి. మ‌న దేశంలో సెకండ్ వేవ్ […]

The post Covaxin Vaccine : కొవాగ్జిన్‌ వేసుకున్న వారికి గుడ్ న్యూస్.. ఏంటంటే? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Covaxin Vaccine : కొవాగ్జిన్‌ వేసుకున్న వారికి గుడ్ న్యూస్.. ఏంటంటే?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Covaxin : క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త‌దేశానికి ఓ పెద్ద శాపంగా మారింది. దీని ప్ర‌భావానికి మ‌న దేశం మీద ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆంక్ష‌లు పెడుతున్నాయి. చాలా వ‌ర‌కు మ‌న దేశం నుంచి ఇత‌ర దేశాల‌కు వెళ్లే వారికి అయితే క‌ఠిన‌మైన ఆంక్ష‌ల ఉన్నాయి. దుబాయ్‌, ఒమ‌న్‌, లండ‌న్‌, ర‌ష్యా, ఆస్ట్రేలియా, జ‌పాన్, సింగ‌పూర్ లాంటి దేశాలు మ‌న దేశం నుంచి వెళ్లే వారిపై చాలా ర‌కాల రూల్స్ పెట్టేశాయి. మ‌న దేశంలో సెకండ్ వేవ్ సృష్టించిన విధ్వంసానికి కొత్త వేరియంట్ లు కూడా పుట్టుకొచ్చాయి. దీని దెబ్బ‌కు మ‌న దేశం అత‌లాకుత‌లం అయిపోయింది.

అయితే దీన్నిఅరిక‌ట్టేందుకు మ‌న దేశంలో ఇప్ప‌టికే రెండు ర‌కాల టీకాలు అందుబాటులోకి వ‌చ్చేశాయి. అవే కొవాగ్జిన్‌, కొవీషీల్డ్‌. వీటిపై కూడా కొన్ని దేశాలు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశాయి. ఎందుకంటే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వీటికి అన్ని ర‌కాల ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో వీటిపై ఆయా దేశాలు కొన్ని ర‌కాల ఆంక్ష‌లు పెట్టేశాయి. వీటిని రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఆ దేశంలో క్వారంటైన్ ఆంక్ష‌లు పెట్టేసింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా దేశం ఓ గుడ్ న్యూస్ చెప్పిది. కొవాగ్జిన్ టీకాను అధికారికంగా గుర్తించింది. ఈ టీకా తీసుకున్న వారిని నేరుగా అనుమ‌తిస్తామ‌ని చెప్పేసింది.

ఇప్ప‌టి దాకా త‌మ దేశంలో ఈ టీకా తీసుకున్న వారిమీద ఉన్న‌టువంటి ఆంక్షలను సడలిస్తూ భారత్ బయోటెక్ కంపెనీ డెవ‌ల‌ప్ చేసిన‌టువంటి కొవాగ్జిన్ టీకా మీద త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని ఈ టీకాలు తీసుకున్న వారు నేరుగా త‌మ దేశంలోకి రావొచ్చ‌ని తెలిపింది. ఈ వార్త ఆ దేశానికి వెళ్లే వారికి ఓ పెద్ద రిలీప్ అనే చెప్పాలి. ఎందుకంటే మ‌న దేశంలో చాలామంది కొవాగ్జిన్ తీసుకున్న వారే ఉన్నారు. కాగా 18 నుంచి 60 ఏళ్ల వారు ఈ టీకాలు తీసుకుంటే వారికి ఈ ప్ర‌తిపాద‌న వర్తిస్తుందని ప్ర‌క‌టించింది ఆస్ట్రేలియా దేశం.

కోవాగ్జిన్ టీకాకు కొన్ని దేశాల్లో గుర్తింపు లేకపోవడంతో ఆ దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేయడంతో ఆ దేశానికి భారతీయ ప్రయాణికులతో పాటు ఇతర దేశాల ప్రయాణికులు క్యూ కట్టేస్తున్నారు. కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. ఒకవేళ సింగిల్ డోసు మాత్రమే వేసుకుని ఉంటే.. వారిని ఆస్ట్రేలియా అనుమతించే పరిస్థితి ఉండదు. కరోనా టీకాల్లో ఒక్కో టీకా సమర్థత వేరుగా ఉంటుంది. అందుకే కొన్ని టీకాలకు కొన్ని దేశాలు మాత్రమే గుర్తింపునిచ్చాయి.

కోవాగ్జిన్ టీకాకు ఇప్పటికీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గుర్తింపు పొందలేదు. ఈ పరిస్థితుల్లో కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారు ఇతర దేశాలకు వెళ్లేందుకు ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా ఆంక్షలు ఎత్తేయడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు ఉపశమనం కలిగించింది.

కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారంతా స్వేచ్ఛగా ఆస్ట్రేలియాలో పర్యటించవచ్చు. ఆస్ట్రేలియన్లు కూడా భారత్ సహా ఇతర దేశాలకు వెళ్లిరావొచ్చు. మీరు కూడా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే కోవాగ్జిన్ టీకా వేయించుకున్నారా? లేదా? ఒకవేళ కోవాగ్జిన్ టీకా వేయించుకుంటే.. మీరు స్వేచ్ఛగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆస్ట్రేలియా వెళ్లి రావొచ్చు.
Read Also : Horoscope Today : ఈ రాశి వారికి సాయం చేసే గుణం ఎక్కువంట.. ఈ లిస్టులో మీరున్నారో లేదో చూసుకోండి

The post Covaxin Vaccine : కొవాగ్జిన్‌ వేసుకున్న వారికి గుడ్ న్యూస్.. ఏంటంటే? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/coronavirus-updates/covaxin-approval-covaxin-shots-indian-travellers-can-go-australia-who-have-received-covaxin-shots.html/feed 0