Tomato Dum Biryani – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Sun, 11 Jun 2023 08:51:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png Tomato Dum Biryani – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Tomato Dum Biryani : టమాటో దమ్ బిర్యాని ఇలా డిఫరెంట్‌గా చేశారంటే టేస్ట్ అదిరిపొద్ది.. కొంచెం కూడా వదిలిపెట్టరంతే..! https://mearogyam.com/food-recipes/tomato-dum-biryani-recipe-in-telugu.html https://mearogyam.com/food-recipes/tomato-dum-biryani-recipe-in-telugu.html#respond Sun, 11 Jun 2023 08:47:01 +0000 https://mearogyam.com/?p=5757 Tomato Dum Biryani : టమాటో దమ్ బిర్యాని ఇలా డిఫరెంట్‌గా చేశారంటే టేస్ట్ అదిరిపొద్ది.. కొంచెం కూడా వదిలిపెట్టరంతే..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Tomato Dum Biryani : టమాటా దమ్ బిర్యాని ఇంట్లో ఎప్పుడైనా చేశారా? వెజిటేబుల్స్‌తో చాలా రకాలైన బిర్యానిలు చేసుకుంటారు. ఇప్పుడు టమాటాతో సింపుల్, డిఫరెంట్‌గా దమ్ బిర్యాని ఎలా చేయాలో తెలుసా? స్పెషల్‌గా లంచ్ బాక్స్‌లో కానీ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, లేదా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా అప్పటికప్పుడు గెస్టులు వచ్చినా కూడా ఈజీగా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా టమాట దమ్ బిర్యాని చేశారా? అయితే ఇప్పుడు ఓసారి […]

The post Tomato Dum Biryani : టమాటో దమ్ బిర్యాని ఇలా డిఫరెంట్‌గా చేశారంటే టేస్ట్ అదిరిపొద్ది.. కొంచెం కూడా వదిలిపెట్టరంతే..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Tomato Dum Biryani : టమాటో దమ్ బిర్యాని ఇలా డిఫరెంట్‌గా చేశారంటే టేస్ట్ అదిరిపొద్ది.. కొంచెం కూడా వదిలిపెట్టరంతే..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Tomato Dum Biryani : టమాటా దమ్ బిర్యాని ఇంట్లో ఎప్పుడైనా చేశారా? వెజిటేబుల్స్‌తో చాలా రకాలైన బిర్యానిలు చేసుకుంటారు. ఇప్పుడు టమాటాతో సింపుల్, డిఫరెంట్‌గా దమ్ బిర్యాని ఎలా చేయాలో తెలుసా? స్పెషల్‌గా లంచ్ బాక్స్‌లో కానీ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, లేదా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా అప్పటికప్పుడు గెస్టులు వచ్చినా కూడా ఈజీగా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా టమాట దమ్ బిర్యాని చేశారా? అయితే ఇప్పుడు ఓసారి ట్రై చేయండి..

ముందుగా టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. పావు కేజీ టమాటలు బిర్యానీకి సరిపోతాయి. వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. వీటిలో హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగుని బాగా కలుపుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల (schezwan chutney) చట్నీ వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం లేకుండా ఈ రెడీమేడ్ చట్ని మాత్రమే వేసుకోవచ్చు. ఇప్పుడు, పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి.

కొంచెం కారం కూడా వేసుకోవాలి. కలర్ కోసం కారంపొడి పెద్దగా అవసరం లేదు. మీకు ఇంకా స్పైసీనేస్ కావాలి అనుకుంటే (schezwan chutney) అనే చట్నీని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ చేయాలనుకుంటే బిర్యానీ మసాలా పౌడర్ కానీ పేస్ట్ కానీ ప్రిపేర్ చేసుకుంటారు. మసాలా ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఈ రకమైన చట్నీని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.

Tomato Dum Biryani Recipe in Telugu
Tomato Dum Biryani Recipe in Telugu

ఇప్పుడు, బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు రైస్ వండుకోవాలి. ఒక బౌల్ లో హాఫ్ కన్నా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. 3 ఇలాచీలు వేసుకోవాలి. 4 లవంగాలు, 2 నుంచి 3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 లేదా 3 బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. మూత పెట్టుకోవాలి. మామూలు దమ్ బిర్యానికి రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవచ్చు. లేదంటే.. మిగిలిపోయిన రైస్‌తో కూడా చేసుకోవచ్చు.

నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఒకటన్నర (1/2) కప్ బాస్మతి రైస్ తీసుకోవాలి. మీకు కావాల్సిన రైస్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ రైస్ అరగంట ముందు కడిగి నానబెట్టుకోవాలి. ఈ రైస్‌ని 80శాతం వరకు మాత్రమే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించొద్దు. ఎందుకంటే.. మనం దమ్ బిర్యానీ కదా చేసేది.. అందుకే 80 శాతం వరకు మాత్రమే ఉడికించుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం రెండు వేల మధ్యలో నొక్కితే ఈజీగా ఇరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన రైస్‌లో మిగిలిన వాటర్ వడకట్టాలి. ఏదైనా జాలి గిన్నెలో వంచేసుకోవాలి.

Tomato Dum Biryani : సింపుల్‌గా ఇంట్లోనే టమాటో దమ్ బిర్యాని చేసుకోండిలా..

మందంగా ఉన్న ఒక పాన్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గి కలర్ మారిన తర్వాత ఇప్పుడు టమాటాలని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటాలు బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేవరకు ఉంచాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని ఈ టమాటాలని పానంత స్ప్రెడ్ చేసుకుని పైనుంచి రెండు పచ్చిమిర్చిని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రైస్ వేసుకోవాలి. లేదంటే.. మిగిలిన అన్నం ఉన్నా కూడా ఆ అన్నంతో బిర్యాని చేసుకోవచ్చు.

Tomato Dum Biryani Recipe in Telugu
Tomato Dum Biryani Recipe in Telugu

ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ నచ్చితేనే వేసుకోవచ్చు కానీ, బిర్యానీ నెయ్యితో చేస్తేనే చాలా బాగుంటుంది. దమ్ చేసుకోవాలి అంటే ఆవిరి మీద ఉడికించుకోవాలి. అందుకే సిల్వర్ ఫైల్ వేసుకోవాలి. ఆపై గట్టిగా మూత పెట్టుకోవాలి. మీ దగ్గర సిల్వర్ ఫైల్ లేకపోయినా పర్లేదు. మూత గట్టిగా పెట్టుకుంటే సరిపోతుంది. మూత గట్టిగా పెట్టుకున్న తర్వాత స్టవ్ పాన్‌కి మధ్యలో పెనం పెట్టుకోవాలి.

ఎందుకంటే అడుగున మాడకుండా ఉంటుంది. ఇలా పాన్ పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని మరో 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి అంతే.. యమ్మీ యమ్మీగా టమాటా బిర్యాని రెడీ అయినట్టే.. ఈ టమాటా దమ్ బిర్యానీని లంచ్ బాక్స్ లేదా డిన్నర్ లేదా బ్రేక్ ఫాస్ట్ లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా గిఫ్ట్ లు వచ్చినా అప్పటికప్పుడు ఇలా డిఫరెంట్ గా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఉప్మాలోకి కూడా ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది.

Read Also : Beerakaya Pachadi : తింటే బీరకాయ పచ్చడినే తినాలి.. ఇలా చేశారంటే లొట్టలేసుకుని తినేస్తారు.. అంత టేస్టీగా ఉంటుంది..!

The post Tomato Dum Biryani : టమాటో దమ్ బిర్యాని ఇలా డిఫరెంట్‌గా చేశారంటే టేస్ట్ అదిరిపొద్ది.. కొంచెం కూడా వదిలిపెట్టరంతే..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/food-recipes/tomato-dum-biryani-recipe-in-telugu.html/feed 0